కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ | Kannada Actor Darshan Thoogudeepa Admitted In VIMS Hospital From Bellary Jail For Surgery | Sakshi
Sakshi News home page

Actor Darshan Surgery: కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ

Published Wed, Oct 23 2024 9:09 AM | Last Updated on Wed, Oct 23 2024 10:44 AM

Kannada Actor Darshan Hospitalized For Surgery

రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్‌ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌ కోరుతూ దర్శన్‌ సమర్పించిన పిటిషన్‌ను  న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వజిత్‌ శెట్టి విచారించారు. పిటిషన్‌ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్‌ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్‌ ఇవ్వాలని దర్శన్‌ వకీలు కోరారు. 

నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.

100 రోజులు దాటింది
దర్శన్‌, పవిత్రలు జూన్‌ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్‌ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్‌ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్‌జైల్‌లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్‌ పిటీషన​ వేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement