breaking news
SIIMA award
-
'పుష్ప'గాడి రూల్.. అవార్డ్స్‌లో అల్లు అర్జున్ ఆధిపత్యం
దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుకలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు. పుష్ప2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆయన అవార్డ్ సొంతం చేసుకున్నారు. సైమా నుంచి ఇప్పటి వరకు ఐదు అవార్డ్స్ బన్నీకి లభించాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021),పుష్ప (2022) చిత్రాలకు సంబంధించి అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన 'గామా' అవార్డ్స్ -2025లో కూడా బన్నీ సత్తా చాటారు. 'గామా' నుంచి బెస్ట్ యాక్టర్ (పుష్ప 2) అవార్డును తొలిసారి అందుకున్నారు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గద్దర్ అవార్డ్స్-2025లో కూడా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని తెలంగాణ చరిత్ర పుటల్లో చేరారు. అల్లు అర్జున్ తన కెరీర్లో 20కి పైగా ఎంతో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇది ఆయన నటనా ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.పుష్ప2 ఖాతాలో సైమా అవార్డ్స్సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ సింగర్‌గా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) పాటకు అందుకున్నారు. ఏకంగా ఈ చిత్రానికి 5 అవార్డ్స్ రావడం విశేషం.అల్లు అర్జున్‌కు అవార్డ్స్.. సీక్రెట్ ఏంటి..?గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం.. సినిమా కలెక్షన్స్‌తో పాటు అనేక రికార్డ్స్‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్‌కు అవార్డులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆయన నటనలో అభినయం, శ్రమ, వైవిధ్యం కనిపిస్తాయి. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. ఆయన నటనా ప్రస్థానమే కాకుండా.. పాత్రల ఎంపిక ఆపై సినిమా ఏదైనా సరే అందులో ఆయన చూపించే మెథడ్ యాక్టింగ్ తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డ్యాన్స్ ప్రాక్టీస్, యాసలు నేర్చుకోవడం వంటి అంశాలపై ఆయన చేసిన కృషి.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయే విధానం ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అల్లు అర్జున్‌కి అవార్డులు రావడం కేవలం గెలుపు మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత కూడా అని చెప్పవచ్చు.నటన, డ్యాన్స్‌తో ఆధిపత్యం ఆర్యలో అమాయక ప్రేమికుడిగా కనిపించిన బన్నీ.. వేదంలో స్ట్రీట్ కుర్రాడిగా మెప్పించారు. రుద్రమదేవిలో గోన గన్నా రెడ్డి పాత్రలో తెలుగు చరిత్రకు ప్రాణం పోసినట్టు చేశారు. పుష్పలో చిత్తూరు యాస, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ గడ్డపై ఆధిపత్యం చూపించారు. పుష్పలో “తగ్గేదే లే” అనే డైలాగ్‌కి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ మామూలుగా ఉండదు. ఇలా ప్రతి సినిమాలో కూడా తన ప్రత్యేకతను చూపారు. అల్లు అర్జున్‌కి 'ఇండియా బెస్ట్ డాన్సర్' అనే ట్యాగ్ రావడానికి కారణం వెండితెరపై ఆయన వేసిన స్టెప్పులని చెప్పవచ్చు. బుట్ట బొమ్మ, సీటీ మార్, టాప్ లేచిపోద్ది వంటి పాటల్లో స్పీడ్, గ్రేస్, కంట్రోల్ అన్నీ కలిపి మనకు ఒకేసారి చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకే కాదు, మలయాళం, తమిళం, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బన్ని నటనా శైలి అంటే ఒకే ఫార్ములా కాదు.. ప్రతి పాత్రకు తనదైన శైలి, శక్తికి మించిన శ్రమతో ప్రాణం పోసేలా కష్టపడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకు అవార్డులతో పాటు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. -
ఇకపై 'నాని అన్నా' అని పిలుస్తా: విజయ్ దేవరకొండ
సైమా అవార్డుల వేడుక (#SIIMA2024) అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా, హాయ్ సినిమాలు ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకుని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. కంగారుపడ్డా..'ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్‌కు వెళ్లాను. ఓపక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కాస్త కంగారుపడ్డాను. కానీ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు. నానీ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందర్నీ అన్నా అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానీని మాత్రం నేను అన్నగా భావించాను, కాబట్టి ఇకనుంచి తనను నానీ అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది' అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఫిక్స్ అయిపో..తర్వాత నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజీపై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని తెలిపాడు. కాగా నాని, విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇకనైనా గొడవలకు చెక్!కాగా నాని, విజయ్ దేవరకొండ మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్స్వార్కు చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.చదవండి: 'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..' -
సలార్‌తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్!
సైమా అవార్డ్స్-2024లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్‌వుడ్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా కాటేరా.. గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. (ఇది చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్)జైలులో దర్శన్అయితే ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. Best Film #KAATERA #SIIMA #SIIMAAwards #SIIMAinDubai #Dboss #D56 pic.twitter.com/Pvx3ixJCDp— Filmy Corner ꭗ (@filmycorner9) September 14, 2024Congratulations Harikrishna for winning Best Music Director award in SIIMA for #Kaatera 🎊Thank you for giving this gem of a song to us, We will cherish forever❤️#DBoss @dasadarshanpic.twitter.com/fULQhP4tsK— King Kariya (@KingKariyaa) September 14, 2024𝗦𝗜𝗜𝗠𝗔 𝟮𝟬𝟮𝟰: Best Film (Kannada) award goes to #Kaatera #DBoss #RocklineEntertainment #SIIMA2024 #SIIMAAwards pic.twitter.com/jqitWHmMDu— Bhargavi (@IamHCB) September 14, 2024 -
సైమా అవార్డ్స్ 2024.
-
సైమా అవార్డ్స్ 2024. దసరా, జైలర్ హవా!
-
నేడు సైమా అవార్డ్స్ ప్రకటన.. పోటీ పడుతున్న తెలుగు స్టార్స్ వీళ్లే
సినిమా ఇండస్ట్రీలో సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుగా సైమాకు గుర్తింపు ఉంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుక మరికొన్న గంటల్లో దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే అక్కడకు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నారు. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది పరిపాటి అని తెలిసిందే. ఈ పోటీలో ఎవరెవరున్నారో ఆ లిస్ట్‌ను సైమా ఇప్పటికే విడుదల చేసింది. ఉత్తమ నటుడు, చిత్రం – తెలుగు (2023) ♦ అడవి శేష్ (మేజర్) ♦ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR) ♦ దుల్కర్ సల్మాన్ (సీతారామం) ♦ నిఖిల్ సిద్దార్ద్ (కార్తికేయ) ♦ సిద్దు జొన్నలగడ్డ (DJ టిల్లు) ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023) ♦ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ♦ హను రాఘవపూడి (సీతారామం) ♦ చందూ మొండేటి (కార్తికేయ 2) ♦ శశికిరణ్ తిక్కా (మేజర్) ♦ విమల్ కృష్ణ (డీజే టిల్లు) ఉత్తమ గేయ రచయిత ♦ RRR సినిమా నుంచి నాటు నాటు (చంద్రబోస్) ♦ సీతారామం నుంచి 'ఇంతందం' సాంగ్ (కృష్ణకాంత్) ♦ ఆచార్య సినిమా నుంచి 'లాహె.. లాహె' సాంగ్ (రామజోగయ్య) ♦ RRR నుంచి 'కొమురం భీముడో' సాంగ్ (సుద్దాల అశోక్ తేజ) ఉత్తమ సహాయ నటి ♦ అక్కినేని అమల (ఒకే ఒక జీవితం) ♦ ప్రియమణి (విరాట పర్వం) ♦ సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్) ♦ సంగీత (మాసూద) ♦ శోభిత ధూళిపాళ (మేజర్) ఉత్తమ విలన్ ♦ సత్యదేవ్ (గాడ్ ఫాదర్) ♦ జయరామ్ (ధమాకా) ♦ సముద్రఖని (సర్కారు వారి పాట) ♦ సుహాస్ (హిట్-2) ► పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా 2023లో కనీసం నామినేషన్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. A glimpse of the star-studded moments. SIIMA 2023 pre-event press meet highlights!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall #TruckersUAE #SIIMA2023 #A23SIIMAWeekend #SouthIndianAwards #Docile… pic.twitter.com/hlVL9fI050 — SIIMA (@siima) September 14, 2023 (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) -
రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్లో బాడిగార్డ్.. రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ప్రతి ఏటా నిర్వహించిన ప్రతిష్టాత్మక సైమా 2022 అవార్డు కార్యక్రమాన్ని శనివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్‌కు దక్షిణాది చెందిన అగ్ర తారలతో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చదవండి: సిసింద్రి టాస్క్‌లో ట్విస్ట్.. శ్రీహాన్‌కు షాకిచ్చిన గలాట గీతూ టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, పూజా హెగ్డె, విజయ్ దేవరకొండ, సుకుమార్‌లు తదితరులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన తనదైన స్టైల్లో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రణ్వీర్ ఈ అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్‌కు హజరైన రణ్వీర్ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక వారితో సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నాడు. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ ఈ క్రమంలో రణ్వీర్ మీదకు ఎగబడుతున్న జనాలను పక్కనే ఉన్న బాడిగార్డ్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాడీగార్డ్ చేయి రణ్వీర్ చెంపకు గట్టిగా తగిలింది. దాంతో రణ్వీర్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా తగలడంతో కాసేపు చెంప మీద చేయి అలాగే ఉంచి అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. Oops! Who slapped him?#RanveerSingh #slapped #Viral pic.twitter.com/0jzekvpOMr — Payal Mohindra (@payal_mohindra) September 13, 2022 -
సైమాకు థ్యాంక్స్ చెప్పిన సూపర్ స్టార్
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డు-2016 అందుకోవటం సంతోషంగా ఉందని తెలిపాడు. అవార్డు అందుకున్న సందర్భంగా మహేష్ బాబు సోమవారం 'థ్యాంక్యూ సైమా' అంటూ ట్విట్ చేశాడు. శ్రీమంతుడు చిత్రానికిగానూ ప్రిన్స్ ఉత్తమ నటుడుగా సైమా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో ఆదివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా అవార్డుల ఎంపిక జరగగా, ఆ పోటీలో మహేష్ బాబు దూసుకుపోయి తొలి స్థానంలో నిలిచాడు. కాగా ఇప్పటివరకూ అయిదు సైమా అవార్డు వేడుకలు జరగ్గా, మహేష్ బాబు మూడుసార్లు సైమా అవార్డులను అందుకోవటం విశేషం. 2012లో దూకుడు, అలాగే 2014లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలకు మహేష్ ఉత్తమ నటుడుగా అవార్డులు కైవసం చేసుకున్నాడు. తాజాగా వచ్చిన అవార్డుతో అతడు ముచ్చటగా మూడోసారి కూడా ఉత్తమ నటుడుగా ఎంపిక కావటం విశేషం. కాగా మహేష్ బాబు, శృతిహాసన్ హీరో, హీరోయిన్లుగా, కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఘన విషయం సాధించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. Received my "Best Actor" Trophy for Srimanthudu! Thank You @siima — Mahesh Babu (@urstrulyMahesh) 4 July 2016