ఇకపై 'నాని అన్నా' అని పిలుస్తా: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda: I Will Call Hero Nani as Brother | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: చాలా సపోర్ట్‌ చేశాడు.. ఇకపై నాని అన్నా అని పిలుస్తా

Published Sun, Sep 15 2024 7:42 PM | Last Updated on Mon, Sep 16 2024 9:56 AM

Vijay Devarakonda: I Will Call Hero Nani as Brother

సైమా అవార్డుల వేడుక (#SIIMA2024) అట్టహాసంగా జరిగింది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన దసరా, హాయ్‌ సినిమాలు ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ నానిని హత్తుకుని కెరీర్‌ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

 కంగారుపడ్డా..
'ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడానికి నాని ఆఫీస్‌కు వెళ్లాను. ఓపక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కాస్త కంగారుపడ్డాను. కానీ తను నాకు చాలా సపోర్ట్‌ చేశాడు. నానీ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందర్నీ అన్నా అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానీని మాత్రం నేను అన్నగా భావించాను, కాబట్టి ఇకనుంచి తనను నానీ అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్‌ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది' అని విజయ్‌ చెప్పుకొచ్చాడు.

ఫిక్స్‌ అయిపో..
తర్వాత నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్‌. కష్టపడి ఒక్కో స్టెప్‌ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజీపై మా గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్‌ అయిపో అని తెలిపాడు. కాగా నాని, విజయ్‌ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇకపోతే ‍ప్రస్తుతం విజయ్‌.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇకనైనా గొడవలకు చెక్‌!
కాగా నాని, విజయ్‌ దేవరకొండ మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్స్‌వార్‌కు చెక్‌ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

చదవండి: 'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement