ఎటో వెళ్లిపోయింది మనసు! | mahanati savithri movie march 29 release | Sakshi
Sakshi News home page

ఎటో వెళ్లిపోయింది మనసు!

Dec 18 2017 12:17 AM | Updated on Dec 18 2017 12:17 AM

mahanati savithri movie march 29 release - Sakshi

సండేని ఫన్‌డేగా ఫుల్‌ జోష్‌తో దిల్‌ ఖుష్‌ అయ్యేలా ఎంజాయ్‌ చేయాలనుకున్నారు హీరోయిన్‌ సమంత. కానీ, దర్శకుడు నాగ అశ్విన్‌ షూట్‌ ప్లాన్‌ చేయడంతో సమంత షూట్‌లో జాయినైపోయారు. వృత్తి పట్ల సమంతకు అంత డెడికేషన్‌. సెట్‌లో సమంత యాక్షన్‌ ఇరగదీసేస్తున్నారు కానీ షూట్‌ గ్యాప్‌లోనే ఎటో వెళ్లిపోయింది మనసు అన్నట్లు ఆలోచిస్తున్నట్లున్నారట. అందుకే నాగ అశ్విన్‌పై సరదాగా సెటైర్‌ వేశారీ బ్యూటీ. ‘‘ప్రజెంట్‌ నా మోస్ట్‌ ఫేవరెట్‌ పర్సన్స్‌ లిస్ట్‌లో నాగ అశ్విన్‌ లేరు.

సరదాగా గడపాల్సిన నా సండే.. వర్క్‌ అంటూ సెట్‌లో గడిచిపోయింది’’ అని సమంత పేర్కొన్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగఅశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్‌ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. మెహన్‌బాబు, దుల్కర్‌సల్మాన్, సమంత, దర్శకుడు క్రిష్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇటీవల 1980 కాలం నాటి లూనా ఫొటోను సమంత బయటపెట్టారు. ఇప్పుడు ఆ కాలంనాటి ఎమ్‌టీఎస్‌ ఫొటో ఒకటి (ఇన్‌సెట్‌లో చూడొచ్చు) ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement