‘‘సావిత్రిగారి గురించి రాసే అర్హత తెచ్చుకున్నాకే ఆమె కథ రాస్తా’... ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణి ఇలానే అంటుంది. కానీ సావిత్రి లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక, ఇన్‌స్పైర్ అయ్యి అనుభవం పెరిగే వరకూ ఆగకుండా రాస్తుంది. ఆ మాటకొస్తే.. ‘మహానటి’ తీయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వయసు, అనుభవం ఎంత? చాలా చాలా తక్కువ. అయినా కన్విక్షన్, ప్యాషన్ ఉంటే వయసు, అనుభవంతో పనేంటి? పైగా సావిత్రి లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాక నాగ్ అశ్విన్‌కి ఆమె అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అదే ‘మహానటి’ జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేలా చేసింది. టైటిల్ రోల్‌లో కీర్తీ సురేష్, జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ తదితర తారలతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘నాగ్ అశ్విన్ బ్రహ్మాండంగా తీశాడు.. కీర్తీ నటన అద్భుతం’ అంటు న్నారు. ట్వీటర్ ద్వారా కొందరు ప్రముఖులు తమ అనుభూతిని పంచుకున్నారు.
28 ఏళ్ల క్రితం ఇదే రోజున (మే, 9) భారీ వర్షం. చాలా పెద్ద సినిమా (జగదేక వీరుడు అతిలోక సుందరి) తీశామనే ఆనందం. ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు.. ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు. మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా అశ్వనీదత్‌గారికి ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఈ రోజు ‘మహానటి’ నిర్మించడానికీ అంతే ధైర్యం కావాలి. సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్‌కి ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తీ జీవించింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్‌కు నా అభినందనలు.
– దర్శకుడు కె. రాఘవేంద్ర రావు
మహానటి క్లాసిక్, ఇన్‌స్పిరేషనల్ బయోపిక్. కీర్తీ సురేశ్ ‘మాయాబజార్’ డ్యాన్స్‌లతో సావిత్రిగారిని తిరిగి తీసుకువచ్చింది. సమంతా అదరగొట్టింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి క్లాసిక్ మాకు అందించినందుకు వైజయంతీ మూవీస్‌కు స్పెషల్ థ్యాంక్స్.
– ‘మెర్సల్’ ఫేమ్ దర్శకుడు అట్లీ
సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ల్లో ఒకటి. కేవలం ఇమిటేటింగ్ కాదు, సావిత్రి గారి పాత్రకు ప్రాణం పోసింది. దుల్కర్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను అతని ఫ్యాన్ అయిపోయా. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్, స్వప్నా. మీ నమ్మకం, డిటర్మినేషన్ అద్భుతం.
– దర్శకుడు రాజమౌళి
థ్యాంక్యూ నాగ్ అశ్విన్.. ఈ సినిమా తీసినందుకు. సావిత్రిగారు అమరులు. నీ రైటింగ్, నీ రీసెర్చ్, నీ స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు. నాగీ ఆలోచనను, అతని కన్విక్షన్‌ను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు స్వప్నా, ప్రియాంకకు కంగ్రాట్స్. టేక్ ఏ బౌ గర్ల్స్. సమంతా.. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం గ్రేట్. నీ రోల్‌ను కమాండబుల్‌గా చేశావు. క్లైమాక్స్‌లో నీ నటన చాలా రోజులు గుర్తుండిపోతుంది.
– దర్శకుడు వంశీ పైడిపల్లి
నాగ్ అశ్విన్ నన్ను సావిత్రిగారి ఎరాలోకి తీసుకువెళ్లిపోయారు. ఏం సినిమా... ఇలాంటి పాత్ర చేసే అవకాశం కీర్తీ సురేశ్‌కి రావడం నిజంగా బ్లెస్డ్. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చైతన్య సూపర్బ్. స్వప్నా అండ్ టీమ్‌కు కంగ్రాట్స్.
– దర్శకుడు మారుతి
నాగ్ అశ్విన్, స్వప్నా, వైజయంతి మూవీస్ బోల్డ్ ఆలోచన ఇది. అద్భుతమైన నటీనటులతో సినిమా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రతి ఒక్కరి నటన నచ్చింది. ‘కీర్తీ యూ కిల్డ్ ఇట్’. సమంతా.. నన్ను ఏడిపించేశావ్. దుల్కర్.. నువ్వు సూపర్. మోహన్‌బాబుగారు, విజయ్, క్రిష్, ప్రకాశ్ రాజ్ అందరూ కన్విన్సింగ్‌గా చేశారు. తాత రోల్‌లో చైతన్యను చూడటం హ్యాపీగా ఉంది. హార్ట్ ఈజ్ హ్యాపీ.
– సుశాంత్
Comments
Please login to add a commentAdd a comment