Mohanbabu
-
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
అర్ధరాత్రి అర్జంట్‌గా రూ.5 లక్షలు కావాలని అడిగా: మనోజ్
రామ్‌చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని అతడి తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ బుధవారం నాడు (మార్చి 27న) అన్నదానం చేశారు. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంచెలంచెలుగా ఎదిగిన చరణ్‌ను కొనియాడుతూ ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. చరణ్‌కు ఉన్న గొప్ప గుణం.. మనోజ్ మాట్లాడుతూ.. 'నా ప్రాణ స్నేహితుడు రామ్‌చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు చెన్నైలో అందరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మేమంతా కలిసి ఉండేవాళ్లం. చిన్నప్పటినుంచి చరణ్‌కు ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే.. కష్టాల్లో ఉన్నానంటూ ఎవరైనా వస్తే వారికి సాయం చేస్తుంటాడు. ఈ రోజుల్లో అంత పెద్ద మనసు ఎవరికీ ఉండదు. చరణ్ స్నేహితుడిగా తన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చాను. తెలుగింటి పిల్లకు కష్టం ఈ రోజుల్లో విలువైనది స్నేహం. అతడు తన చిన్ననాటి స్నేహితుల నుంచి ఇప్పటి ఫ్రెండ్స్ వరకు అందరితోనూ టచ్‌లో ఉన్నాడు. స్నేహానికి అంత విలువిస్తాడు. ఒకసారి ఏమైందంటే? దుబాయ్‌లో ఒక తెలుగింటి ఆడపిల్లకు కష్టమొచ్చింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి చరణ్‌కు ఫోన్ చేశాను. మిత్రమా, దుబాయ్‌లో ఓ ఆడపిల్ల చిక్కుకుపోయింది. చిరంజీవి, మోహన్‌బాబు మధ్యలోకి వెళ్లకూడదు నా వంతు నేను చేశాను. ఐదు లక్షలు తక్కువయ్యాయిరా.. ఏం చేయాలిరా? అని అడిగాను. వెంటనే అకౌంట్ నెంబర్ పంపించు అని క్షణంలో డబ్బు పంపించాడు. అంత గొప్పవాడు. మీ నాన్నలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎలా కలిసుంటారని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలోకి మనం ఎప్పుడూ వెళ్లకూడదు. వాళ్లిద్దరు కూడా అంతే.. కొట్టుకుంటారు, కలిసిపోతారు. క్యూట్ టామ్ అండ్ జెర్రీలాగా! పొరపాటున కూడా వాళ్ల మధ్య మనం దూరకూడదు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు. -
చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్ బాబు ఏం అన్నారంటే
టాలీవుడ్ మెగాస్టార్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. మెగాస్టార్‌కు అవార్డు ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు రియాక్ట్ అయ్యారు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి.. అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నానని మోహన్ బాబు తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను.. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. భారీ వేడుకకు ప్లాన్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చిరు ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ఇంతటి శుభ సందర్భంగా మెగాస్టార్ కోసం చిత్ర పరిశ్రమ నుంచి ఒక వేడుకను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ వివరాలు త్వరలో చెబుతామని దిల్ రాజు చెప్పారు. Congratulations to my dear friend @KChiruTweets on this well-deserved honor! We are all very proud of you for receiving the award. — Mohan Babu M (@themohanbabu) January 26, 2024 Woke up to the fantastic news on Sri. @KChiruTweets garu winning the prestigious #PadmaVibhushan! What a proud moment for Telugu Film Industry! Congratulations @KChiruTweets Garu 💪🏽👌❤️ — Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2024 -
ఏ ధైర్యంతో సినిమాలు చేస్తున్నారు అని ప్రశ్నించిన మోహన్‌బాబు
-
జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. స్పీచ్ వైరల్
విలక్షణ నటుడు మోహన్‌బాబు క్రమశిక్షణకు మారుపేరు. తను మాత్రమే కాదు, తన చుట్టుపక్కలవారు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు. బుధవారం (సెప్టెంబర్ 20) నాడు తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ క్రమంలో తన పక్కనే కూర్చున్న జయసుధ అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా ఫోన్ చూస్తూ ఉంది. ఫోన్‌తో జయసుధ ఆటలు దీంతో మోహన్‌బాబు ఈ సమయంలో ఫోన్ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఎన్నార్ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ వంక చూడటం కరెక్ట్ కాదు కదా.. మోహన్‌బాబు చేసింది కరెక్టేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చొక్కా చించుకుని వెళ్లా ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి మోహన్ బాబు ప్రసంగిస్తూ.. 'ఏఎన్నార్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయన సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుందంటే చొక్కా చించుకుని మరీ వెళ్లేవాడిని. మళ్లీ ఆ చొక్కా కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. అటువంటిది ఆయన నటించిన మరపురాని మనిషి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఆ తర్వాత ఆయన బ్యానర్లో ఎన్నో సినిమాల్లో నటించాను. ఓసారి నాగేశ్వరరావు- అన్నపూర్ణమ్మ పక్కపక్కనే కూర్చున్నప్పుడు నేను వెళ్లాను. ఆమె నన్ను చూసి ఫలానా సినిమాలో బాగా నటించావని ఆశీర్వదించిస్తే ఆయన కసురుకున్నారు. నా కోరిక తీర్చారు వాడేమైనా గొప్ప నటుడని ఫీలవుతున్నావా? వాడికి ముందే పొగరు. ఎందుకు? వాడి గురించి పొగుడుతున్నావని ఆమెపై కోప్పడ్డారు. తర్వాతి రోజు నేను సెట్‌కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడో విషయం చెప్పాను.. నాకు ఓ కోరికుంది సార్.. ప్రతిసారి మీరొస్తే మేము నిలబడటమేనా? నేను వచ్చినప్పుడు మీరు లేచి నిలబడాలని కోరుకుంటున్నా అన్నాను. నా కోరిక విని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు సెట్‌కు వెళ్తే దాసరి, ఏఎన్నార్.. ఇద్దరూ నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారు. ఇలా ఆయనతో ఎన్నో సరదా సంఘటనల అనుభూతులున్నాయి. ఏఎన్నార్ ఒక గ్రంథం, ఒక పాఠ్య పుస్తకం. అటువంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండటం చాలా సంతోషం' అని చెప్పుకొచ్చారు. ఫోన్ పట్టుకొని కూర్చున్న జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు. #ANRLivesOn #CelebratingANR100 pic.twitter.com/IcsDTT5RJe — Actual India (@ActualIndia) September 20, 2023 చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
రేపే ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్‌లుక్..
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి సన్నాఫ్ ఇండియా రెడీ అయ్యారు. సన్నాఫ్ ఇండియా ఎలా ఉంటారో చిన్న లుక్ ద్వారా పరిచయం చేస్తారట. మోహన్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సోషల్ డ్రామా ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు, లక్ష్మీ మంచు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రేపు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సమాజాన్ని సరిదిద్దాలని ప్రయత్నించే పవర్ఫుల్ వ్యక్తిగా మోహన్‌బాబు కనిపిస్తారని టాక్. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. -
అనుమతులకు టైమ్ పడుతుంది
సూర్య హీరోగా మోహన్‌బాబు, అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రదారులుగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌డెక్కన్ అధినేత జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తమిళంలో ‘సూరరై పోట్రు’ పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. మొదట్నించి తన కెరీర్‌కు అండగా ఉన్న అభిమానులతో ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు సూర్య. ‘‘ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయని లొకేషన్లలో షూటింగ్ చేయటం, భిన్న భాషలకు చెందిన వ్యక్తులతో పని చేయటం మాత్రమే మా ముందున్న సవాళ్లని అనుకున్నాను. వైమానికరంగం నేపథ్యంలో జరిగే కథ అని తెలిసిందే. నిజమైన ఇండియన్ యుద్ధవిమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వచ్చింది. యన్.ఓ.సి (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) లు ఇంకా రావలసి ఉంది. అందుకే కొన్ని అనుమతుల కోసం ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇప్పుడున్న కరోనా కాలంలో మిగతా అన్ని విషయాలకంటే దేశం తాలూకు ప్రాధాన్యాల మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది. సినిమా విడుదలయ్యేలోపు ట్రైలర్‌ను, ఈ లెటర్‌తో పాటు మన స్నేహం, ప్రేమానురాగాలకు గుర్తుగా ఫ్రెండ్షిప్ సాంగ్‌ను అందిస్తున్నా’’ అన్నారు సూర్య. ఈ చిత్రాన్ని సూర్య, గునీత్ మోంగా నిర్మించారు. -
కంగ్రాట్స్ డాడీ: మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైనట్లు వెల్లడించింది. కాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్‌బాబు, ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. (చదవండి: 'బిల్లా-రంగా' రీమేక్‌లో వారసులు) ఇక మంచు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విష్ణు సతీమణి విరానిక స్టైలిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు ఆమె స్టైలింగ్ చేయనున్నారు. కాగా ‘సన్నాఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా, మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కంగ్రాట్స్ డాడీ! ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయింట్‌గా ఎదురు చూస్తున్నా! బెస్ట్ ఆఫ్ లక్, నాకు తెలుసు మీ అత్యద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తారు’’అంటూ ట్వీట్ చేశారు. Congrats Daddy! I am so so so excited for this one, can't wait for the curtain to raise and gaze at your exceptional performance! Best of Luck to you, I know you're going to rock it!🥰✨🥳#LakshmiManchu #MohanBabu #SonOfIndia #LakshmiUnfiltered #ComingSoon #24Frames — Lakshmi Manchu (@LakshmiManchu) October 23, 2020 For the first time @vinimanchu (@iVishnuManchu 's better half) styling for Collection King Dr. @themohanbabu with #SonOfIndia. Directed by @ratnababuwriter Maestro #Ilaiyaraaja Musical. 🎶@LakshmiManchu @HeroManoj1 #SrilakshmiprasannaPuctures @24FramesFactory #SOI pic.twitter.com/c424pOwR01 — BARaju (@baraju_SuperHit) October 23, 2020 -
భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్
‘‘ఓసారి ర జనీకాంత్ ఫోన్ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్ అయింది. రీమేక్ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్బీ చౌదరిగారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు... ► ‘నాట్టామై’ రీమేక్ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్ ఇచ్చారు. తొలి షాట్లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నాడు రజనీ. ► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి. ► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్) లేరు. సౌందర్య, కెమెరామేన్ కేఎస్ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి. ► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు. ► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలోనూ హిట్ కావాలనే రూల్ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు. ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు. ‘పెదరాయుడు’ని రీమేక్ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్.. చేసే అవకాశం ఉంటుందా? ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర. -
మోహన్‌బాబు న్యూలుక్.. చిరు కోసమే..!
టాలీవుడ్ కథానాయకుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవీ సినిమా కోసమే ఆయన న్యూలుక్‌తో ఫోటోషూట్‌లో పాల్గొన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. చిరు సినిమాలో విలన్ పాత్ర కోసం మోహన్‌బాబును కొరటాల శివ కలిశాడని, దానికి ఆయన అంగీకరించారని టాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అయిన మోహన్‌బాబు న్యూలుక్ ఫోటోలు పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి. చిరు సినిమా కోసమే ఆయన కొత్త లుక్‌లో ఫోటోషూట్ చేశారని వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు సైతం ఆయన లుక్‌ను ప్రశంసిస్తున్నారు. కాగా, గతంలో వీరింద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బిల్లా రంగా’,‘పట్నం వచ్చిన ప్రతివతలు’మంచి విజయాన్ని సాధించాయి. చిరంజీవీ హీరోగా చేసిన పలు చిత్రాలలో మోహన్‌బాబు విలన్‌గా నటించారు. ప్రస్తుతం మోహన్‌బాబు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఆకాశం నీ హద్దురాలో నటిస్తున్నారు. -
సంక్రాంతి సంబరాలు: రంకెలేసిన ఉత్సాహం
సాక్షి, చంద్రగిరి/వెదురుకుప్పం: మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగలో మూడో రోజైన గురువారం జిల్లాలోనే ఎడ్ల పందేల(జల్లికట్టు)కు ప్రసిద్ధి చెందిన రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వీక్షించడానికి మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. దీంతో రంగంపేట గ్రామం జనసంద్రమైంది. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. గ్రామంలోని పశువులను పందేలకు వదలడంతో యువకులు కేరింతలు కొడుతూ వాటిని నిలువరించేందుకు పోటీపడ్డారు. మహిళలు సైతం మేడలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునే ప్రయత్నంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. సుమారు 4 గంటల పాటు ఉల్లాసంగా జల్లికట్టు సాగింది. ఎడ్ల పందేలు తిలకించడానికి చెట్టు పైకి ఎక్కిన జనం పందేలను తిలకించిన మోహన్‌బాబు పశువుల పందేలను శ్రీవిద్యానికేతన్ అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, నటుడు మంచు మనోజ్ తిలకించారు. మోహన్‌బాబు పశువుల పందేలను తిలకించడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మాంబేడులో.. వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు కోడెగిత్తలను నిలువరించడానికి ఉత్సాహం చూపారు. -
దైవ సన్నిధానంలో శ్రీ స్వరూపానందేంద్ర
సాక్షి, హైదరాబాద్ : విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం ఫిలిం నగర్ దైవ సన్నిధానాన్ని సందర్శించి పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, శ్రీమతి సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ - ‘రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు. నేను రజినీకాంత్ గారు ఒక సారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజమైన ప్రశాంతత కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఒక్కసారి వైజాగ్ లోని శ్రీ శ్రీ శ్రీ శారదా పీఠం ని దర్శించుకోవాల్సిందిగా మనవి. అలాంటి బృహత్తర రూపం గల శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి భాద్యతలు ఇవ్వడం మంచి పరిణామం. వారికి దాదాపు భారతదేశం లో 108 మఠాలు ఉన్నాయి. వారి ఆశీస్సులు ఫిలిం నగర్ దైవసన్నిదానానికి ఎల్లవేళలా ఉంటాయి’ అన్నారు. శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఫిలిం నగర్ దైవసన్నిధానంలో సినిమా వారు ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. విశాఖ శ్రీ శారదా పీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం 21 సంవత్సరాలుగా అవిశ్రామంగా కృషి చేస్తుంది. మా పీఠానికి శ్రీ సుబ్బిరామి రెడ్డి గారు ఎంతో చేయూత నిస్తున్నారు. ఆయన నేను లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరు. నా తరువాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారిని నియమించడం జరిగింది. ఫిలిం నగర్ దైవసన్నిధానం నుండి విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది’ అన్నారు. కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఫిలిం నగర్ దైవసన్నిధానం ఎల్లప్పుడూ కలకలడానికి కారణం భారత దేశంలో అతి తక్కువ సమయంలోనే అన్ని చోట్లా పీఠాలను నెలకొల్పిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. వారి జీవిత లక్ష్యం ప్రతి ఒక్కరికి ధార్మిక జీవితాన్ని ప్రసాదించడం. అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహా జ్ఞాని. ఆయన నాకు చాలా కాలంగా పరిచయం. నేను గత 27 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసిన వారు, వారి ఆశీస్సులు నాతోనే ఉంటాయి’ అన్నారు. శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ళక్రితం ఇక్కడే గణపతి ప్రదక్షిణాలు చేసి స్వామి వారి దగ్గర పాఠాలు నేర్చుకునే వాడిని. నాకు ఈ ఫిలిం నగర్ దైవసన్నిధానం తో చాలా అభినాభావ సంభందం ఉంది. రెండు సంవత్సరాల క్రితం మా గురువు గారు ఉత్తరాఖండ్‌లో తపస్సు చేయమని చెప్పారు. చాలా క్లిష్ట మైన ప్రదేశం. అక్కడ జవాన్లు మాత్రమే ఉండగలరు. అక్కడ కూడా తెలుగు వారు వచ్చి ఫిలిం షూటింగ్ లు జరుపుతున్నారు. ప్రేక్షకులకు రెండు మూడు గంటలు ఆనందం ఇవ్వడం కోసం అంత కస్టపడి సినిమాలు తీస్తారా? అని ఆశ్చర్యానికి లోనయ్యాను. అలా సైనికులు ఉండగలిగే ప్రదేశాలలో షూటింగ్ చేయడం సినిమా వారికే చెల్లింది’ అన్నారు. -
మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్..
సాక్షి, హైదరాబాద్ : ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదేనని, సీనియర్ నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ఆయన ఓ పత్రికప్రకటనను విడుదల చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన బిడ్డ జగన్ మోహన్‌రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని, దీంతో ప్రజలు ఆశీస్సులు అందజేసి ముఖ్యమంత్రిని చేశారన్నారు. కచ్చితంగా ప్రజలకు జగన్ మేలు చేస్తారని, మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని అభివర్ణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీకి 130స్థానాలు ఖాయం
రేణిగుంట (చిత్తూరు): ఈనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని సినీనటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్‌బాబు అన్నారు. కుమారుడు మంచు విష్ణుతో కలిసి శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసమర్థ పాలనతో ప్రజలు విసుగెత్తి ఉన్నారని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఆయన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాద్రి, రైతు విభాగం నేతలు ఆదికేశవులరెడ్డి, హైకోర్టు న్యాయవాది పేరూరు మునిరెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు అన్నా రామచంద్రయ్య యాదవ్, వై.సురేష్, ఎన్వీ సురేష్, నైనారు మధుబాల, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు
-
బాబూ.. నీపై ఉన్న కేసుల సంగతేంటి
సాక్షి, భీమవరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా మంచివారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రముఖ సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ ధ్వజమెత్తారు. భీమవరంలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడో వ్యక్తులను కాకుండా నిత్యం అందుబాటులో ఉండే గ్రంధి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా, కనుమూరు రఘురామకృష్ణంరాజును ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరని, దీనిని గమనించాలన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని విమర్శించారు. నిత్యం జగన్‌పై కేసులు గురించి మాట్లాడే చంద్రబాబు తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు. ఆయన చుట్టూ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ్యత, సంస్కారం మర్చిపోయి ఎన్నికల సభల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడన్నారు. గత ఐదేళ్లుగా తాను ప్రజలకు ఏం చేశానో చెప్పడం లేదని మోహన్‌బాబు విమర్శించారు. మూడెకరాల ఆసామికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాకున్నాడనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జగన్ సోదరి షర్మిళను కించపర్చే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు సభ్యత లేదంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చి పూర్తిగా మోసం చేశాడని, పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సభలో గ్రంధి శ్రీనివాస్, కనుమూరు రఘురామకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, తోట భోగయ్య, రాయప్రోలు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనం, సభలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, సినీహీరో మోహన్‌బాబు, చిత్రంలో గ్రంధి శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు -
శత్రువుకు సాయం చేసే వ్యక్తి ఆయన : మంచు విష్ణు
సాక్షి, చంద్రగిరి: శత్రువుకు సైతం సాయంచేసే మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ, నటుడు మంచు విష్ణు కొనియాడారు. మంగళవారం రాత్రి ఆయన మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీలో రచ్చబండ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. 27 ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నామన్నారు. ఏనాడు తాము రాజకీయాలపై ఆసక్తి చూపలేదని తెలిపారు. అలాంటి తమ సంస్థపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రావా ల్సిన రూ.19కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా, ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పనిచేసినా నియోజకవర్గానికి, ప్రాంతానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీవిద్యానికేతన్‌ను నెలకొల్పి చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల మందికి మోహన్‌బాబు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంతమందికి ఉపాధి కల్పిం చారో ఆలోచించాలని సూచించారు. వైఎస్ హయాంలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లాంటి పథకాలను తీసుకొచ్చారన్నారు. వాటిని అమలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మాజీ సర్పంచ్ కొటాల పద్మజ, ఎంపీటీసీ సభ్యురాలు పుష్పలత, రాజేంద్రప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, సంస్థల ఏఓ సుదర్శన్‌నాయుడు పాల్గొన్నారు. -
టీడీపీ ఎన్టీఆర్‌ది.. హెరిటేజ్ ఫుడ్స్ నాది..
సాక్షి, అమరావతి : చంద్రబాబుది అంతా కరివేపాకు పాలసీ. యూజ్ అండ్ త్రో. అదే ఆయన క్యారెక్టర్. ఎన్టీ రామారావు సహా చంద్రబాబు తనను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేశారు. నాకు చేసిన మోసం అదో చరిత్ర. హెరిటేజ్ ఫుడ్స్ నాది.. నాది.. నాది ఎక్కువ శాతం. చంద్రబాబు, నేను, దాగా అనే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్ ఫుడ్స్‌ను స్థాపించాం. నేను ప్రధాన భాగస్వామిని. అంటే నాది ఎక్కువ పెట్టుబడి. చంద్రబాబుది తక్కువ పెట్టుబడి. దాగా అనే అయనది మరికొంత తక్కువ పెట్టుబడి. స్థాపించిన కొన్నాళ్ల తరువాత చంద్రబాబు కొన్ని బ్లాంక్ పేపర్లు పంపించి సంతకాలు పెట్టమన్నారు. బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు. అప్పట్లో నేను సినిమా హీరోగా అగ్రస్థానంలో ఉన్నాను. కెరీర్ పీక్స్‌లో ఉండటంతో చాలా బిజీగా ఉన్నాను. అప్పట్లో నాకు ఇన్ని విషయాలు కూడా తెలీవు. స్నేహితుడు అని నమ్మి చంద్రబాబు చెప్పినట్లు బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు చేశాను. తరువాత మరికొన్ని పేపర్ల మీద కూడా సంతకాలు తీసుకున్నారు. తరువాత కొన్నేళ్లకు హెరిటేజ్ సంస్థతో నాకు సంబంధం లేదని చెప్పడంతో ఒక్కసారి షాక్ తిన్నాను. కోర్టుకు వెళ్లాను. కేసు చాలా కాలం సాగింది. కానీ చంద్రబాబు పరపతి ఉన్నవాడు. ఆయనతో మనం తట్టుకోలేం అని కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశాను. ఓ సినిమా తీశాం. ఫెయిల్ అయ్యింది అనుకుని సరిపెట్టుకున్నాను. నా తరువాత దాగానూ అలాగే మోసం చేసి బయటకు పంపేశారు. హెరిటేజ్ సంస్థ విషయంలో చంద్రబాబు మమ్మల్నే కాదు రైతులను, ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. చంద్రబాబు ఏం చేశారో తెలుసా. కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసేవారు. ఆ డబ్బును తనకు తెలిసిన కొందరు రైతులకు ఇచ్చేవారు. వాళ్లు హెరిటేజ్ కంపెనీలో షేర్లు కొన్నట్టు చూపించేవారు. కొన్నాళ్లకు మళ్లీ ఆ షేర్లను తానే కొనుక్కున్నట్లు డ్రామా నడిపించారు. హెరిటేజ్ సంస్థలో వాటాలు పెట్టినట్టు గానీ వాటిని చంద్రబాబుకు అమ్మినట్టు గానీ ఆ రైతులకే తెలియకుండా వ్యవహారం నడిపారు. రైతులు ఇస్తే పన్నులు ఉండవు. అంత ఘోరాలు చేశారు. ఎన్టీ రామారావును మోసం చేసి టీడీపీని తీసుకున్నట్టుగా.. నన్ను మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారు. దాన్ని రూ.వేల కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం మీద తిరుపతిలో లేదా కాణిపాకంలో గానీ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేసి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి అలా చెప్పగలరా? -
ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు
-
ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవం : మోహన్‌బాబు
సాక్షి, మంగళగిరి : వైస్రాయ్ హోటల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు. ఇది అన్నయ్య టీడీపీ కాదు.. ‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మహోన్నత వ్యక్తి.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహోన్నత వ్యక్తి. ఆయన మాట చెబితే అది వేదమే. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. కొన్నివేల మంది ప్రజలకు ఇళ్లు కట్టించారు. కాంగ్రెస్ వంటి మహాసముద్రంలో ఓ మహానాయకుడిగా ఎదిగి.. పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకొని అద్భుత పథకాలు రూపొందించారు. ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివేలా చేశారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాను పార్టీకి బానిసను కాదని, ప్రజలకు బానిసని సోనియాను వ్యతిరేకించారు. ఆ తర్వాతే వైఎస్సార్ మరణం చెందారు. దాని వెనుక అనేక అనుమానులున్నాయి. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయను ఆదరించి ముఖ్యమంత్రిని చేసుకుందా. మూడు పంటలు పండే చోట రాజధాని పేరుతో భూములు లాక్కున్నారు. తన బినామీలతో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ముందుగానే కొనుగోలు చేయించారు. రైతులను దారుణంగా మోసం చేశారు. అప్పులు పాలు చేశారు. చంద్రబాబుపై ఉన్న 11 కేసులు ప్రజలకు తెలియకుండా దాచారు. నీ దగ్గరున్న ఎంపీలు అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయారు. నీవెలా సత్య హరిశ్చంద్రుడివి అవుతావు చంద్రబాబు? వేల కోట్లు ఆస్తులు నీకెక్కడి నుంచి వచ్చాయి? బాబుకు ఓటేస్తే ఆయన అనుకూల మీడియా, భూకబ్జాదారులు బాగుపడుతారు. వాళ్లు మళ్లి ప్రజల రక్తం తాగుతారు. పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బులు నీవా చంద్రబాబు? నాలుగేళ్లుగా పసుపు కుంకుమ గుర్తుకు రాలేదా? 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళగిరిలో మీ అందుబాటులో ఉండే రామకృష్ణారెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్‌రెడ్డిలను గెలిపించండి. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదు.’ అని మోహన్‌బాబు ప్రజలను కోరారు. -
ఆయన్ని పిలవకపోవడం సరికాదు: మోహన్‌బాబు
సాక్షి, పాలకొల్లు: దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్‌బాబు తప్పుబట్టారు. ఆయనను పిలవకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ముద్రగడను మోహన్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. ‘అనుకున్నది సాధించాలన్న పట్టుదల గల వ్యక్తి ముద్రగడ. తనను నమ్ముకున్నవారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమ’ని మోహన్‌బాబు అన్నారు. శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఇందులో మోహన్‌బాబుతో పాటు మురళీమోహన్, శ్రీకాంత్, శివాజీరాజా, కవిత, హేమ, ప్రభ, సి. కళ్యాణ్, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి, చోటా కె నాయుడు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దాసరి బయోపిక్ తీస్తే సహకరిస్తా దర్శకరత్న, తన గురువు దాసరి నారాయణరావు బయోపిక్‌ను ఎవరైనా తెరకెక్కిస్తే పూర్తిగా సహకరిస్తానని మోహన్‌బాబు అంతకుముందు చెప్పారు. దాసరి జీవితచరిత్రను సినిమా తీసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరైనా ముందుకు వస్తే తాను పూర్తిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. సినీ జగత్తులో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తనలాంది వందల మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత దాసరికే చెందుతుందన్నారు. -
దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు
-
‘కొమ్ములు తిరిగిన నటుడైనా సరే.. ఆయన దగ్గరకు రావాల్సిందే’
సాక్షి, పశ్చిమగోదావరి : తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మా నాన్న ఒక బడిపంతులు. విలన్‌గా ఉన్న నన్ను కమెడియన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. హీరోగా తయారు చేసింది మా గురువు గారే. అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను నిర్మించిన శ్రీ విద్యానికేతన్‌లో దాసరి పేరుతో ఆడిటోరియం, లైబ్రరీని నిర్మించాను’ అని మోహన్‌బాబు దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు. కొమ్ములు తిరిగిన నటుడైనా సరే దాసరిని వేషం ఇమ్మని అడిగారే తప్ప ఆయన ఏనాడు ఏ నటుడిని ఫలానా వేషం వేయాలని అడగలేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు. కాగా దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు సహా సినీ ప్రముఖులు రాజా వన్నెంరెడ్డి, కోటి, రవిరాజా పినిశెట్టి, ఎన్.శంకర్, సురేష్ కొండేటి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కి మోహన్‌బాబు విషెస్
బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో క్రిష్ తెరకెక్కించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ బుధవారం విడులైంది. భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆకాక్షించారు. కొన్ని యాంగిల్స్‌లో బాలయ్య తండ్రి పోలికలతో ఉండడం అద్భుత విషయమని పేర్కొన్నారు. ‘మంచి దర్శకుడి చేతిలో సినిమా రూపొందడం, స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్ర పోషించడం కూడా అద్భుతం, అమోఘం’ అని బాలయ్యను ప్రశంసించారు మోహన్‌బాబు. ‘అన్నగారి బయోపిక్ తీయడం.. అందులోనూ మహానటుని కుమారుడు బాలయ్య తండ్రి పాత్ర పోషించడం మామూలు విషయం కాదని’ ట్విటర్లో పేర్కొన్నారు. -
ఆయన నిజమైన లెజెండ్
సాక్షి, హైదరాబాద్: ద్రవిడ అభిమానంకోసం, ద్రవిడ జాతికోసం విప్లవాత్మక పోరాటం చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయంతో దేశం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ,ఇ తర రంగాల ప్రముఖులు సంతాపం వెలుబిచ్చారు. నటుడు , కవి, రచయిత, హేతువాది అయిన కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా, గొప్ప రాజకీయవేత్తగా చేసిన ఎనలేని సేవలను గుర్తు చేసుకున్నారు. అటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా కరుణానిధి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. నిజమైన లెజెండ్, మాస్ నాయకుడు, నిరంతరం స్పూర్తిగా నిలిచిన నాయుకుడు కరుణానిధి. ఆయనలేని లోటు పూడ్చలేనిదని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. సోదరుడు స్టాలిన్, అళగిరి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి. తన విధానాలతో లక్షలాదిమంది ప్రజలకు చేరువయ్యారు. తన రచనలతో లక్షలామంది ప్రజలకు కరుణానిధి ప్రేరణగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుఒక ఫోటోనుకూడా షేర్ చేశారు. ఈ భువిని వీడిన ఆయన నిజంగా ఎప్పటికీ మనల్ని వీడిపోని మనిషి కరుణాధి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే వుంటారు. మన ద్వారా ఆయన బతికే వుంటారంటూ కరుణానిధి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు మరో ప్రముఖ నటి రమ్యకృష్ణన్. అన్ని అసమానతలను ఎదుర్కొన్న ధీరుడు కరుణా నిధిగారు. ఈ అంతులేని విషాదంనుంచి కోలుకునే శక్తిని ఆయన కుటుంబం, తమిళ సోదర, సోదరీ మణులకు ఆ దేవుడు ప్రసాదించాలంటూ తెలుగు హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇంకా హీరో విశాల్ కూడా కరుణానిధి మృతిపట్ల ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. కాగా తమిళ రాజకీయ యోధుడు, ద్రవిడ గడ్డ లెజెండరీ నేత, డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) కన్నుమూశారు. నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులు, డీఎంకే శ్రేణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న తమిళ సోదరులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు. A true legend, a leader of masses and always lead by example, Sri. Karunanidhi leaves a huge void. My condolences to Brothers Stalin and Alagiri and their families. He touched millions of lives with his policies, gave hope to millions and inspired millions with his writing. — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 One of my Cherished Photo with Sri. Karunanidhi pic.twitter.com/gcATjLpTVf — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 A person that departs from this earth never truly leaves, for they are still alive in our hearts, through us, they live on. My condolences. #RIPKalaingr pic.twitter.com/qIfflYsgm1 — Ramya Krishnan (@meramyakrishnan) August 7, 2018