ప్రియా చూస్తుంటే నీ కళ్లు... పులకించిపోతోంది నా ఒళ్లు. కాటుకైనా కాకపోతిని నీ కళ్లతో కలగలిసిపోయేందుకు. ఏంటి.. సినిమాలో హీరోయిన్‌కి హీరో చెప్పాల్సిన డైలాగ్‌లు ఇక్కడ చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి డైలాగ్‌లు సినిమాలో హీరోలు చెప్పటం చాలాసార్లు విన్నాం. కానీ, మంచు విష్ణు బయట కూడా ఇలాంటి డైలాగ్స్ పలుకుతున్నారు.
మ్యాటర్ ఏంటంటే.. మోహన్‌బాబు నటిస్తూ, నిర్మిస్తున్న ‘గాయత్రి’ సినిమాలో విష్ణు, శ్రియ జంటగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ఆ షూటింగ్‌లో కొన్ని ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారట. అందులో భాగంగా విష్ణు ‘‘నేనిప్పటివరకూ చేసినవాటిలో ఇదో బెస్ట్ లవ్‌స్టొరీ. శ్రియ నీ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ మాయలో పడిపోయేవాణ్ణి’’ అని శ్రియ కళ్లందాన్ని అభినందించారు. ‘గాయత్రి’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment