sreeya
-
మాయలో పడిపోతానేమో!
ప్రియా చూస్తుంటే నీ కళ్లు... పులకించిపోతోంది నా ఒళ్లు. కాటుకైనా కాకపోతిని నీ కళ్లతో కలగలిసిపోయేందుకు. ఏంటి.. సినిమాలో హీరోయిన్‌కి హీరో చెప్పాల్సిన డైలాగ్‌లు ఇక్కడ చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి డైలాగ్‌లు సినిమాలో హీరోలు చెప్పటం చాలాసార్లు విన్నాం. కానీ, మంచు విష్ణు బయట కూడా ఇలాంటి డైలాగ్స్ పలుకుతున్నారు. మ్యాటర్ ఏంటంటే.. మోహన్‌బాబు నటిస్తూ, నిర్మిస్తున్న ‘గాయత్రి’ సినిమాలో విష్ణు, శ్రియ జంటగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ఆ షూటింగ్లో కొన్ని ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారట. అందులో భాగంగా విష్ణు ‘‘నేనిప్పటివరకూ చేసినవాటిలో ఇదో బెస్ట్ లవ్‌స్టొరీ. శ్రియ నీ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ మాయలో పడిపోయేవాణ్ణి’’ అని శ్రియ కళ్లందాన్ని అభినందించారు. ‘గాయత్రి’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. -
శ్రియ, మేఘన ముందంజ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఈవెం ట్లో ఎ. శ్రియ, జి. మేఘన ముందంజ వేశారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సోమవారం జరిగిన అండర్–17 బాలికల సింగిల్స్‌లో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)కు చెందిన శ్రియ 15–5, 15–5తో వరహాల చెట్టి (విశాఖపట్నం)పై గెలిచింది. మిగతా మ్యాచ్‌ల్లో మేఘన (ఎఫ్‌కేఎస్, రాజమండ్రి) 15–0, 15–3తో నయన (గీతాంజలి, సికింద్రాబాద్)పై విజయం సాధించగా, అన్షు రెడ్డి (సెయింట్ జోసెఫ్) 15–2, 15–4తో అమీన సుల్తానా (ఎన్ఏఎస్ఆర్)ను ఓడించింది. సాయి శ్రియ (ఎఫ్‌కేఎస్, రాజమండ్రి) 15–0, 15–1తో డైసి మిట్ట (అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్)పై నెగ్గింది. అండర్–17 బాలుర సింగిల్స్‌లో మహేశ్ (సెయింట్ జోసెఫ్, కింగ్‌కోఠి) 15–6, 15–7తో సాయి నితిన్ (హెరిటేజ్ వ్యాలీ)పై, గుణ కార్తీక్ (ఎఫ్‌కేఎస్, రాజమండ్రి) 15–3, 15–8తో త్రిపాఠి మనోజ్ రెడ్డి (సెయింట్ జోసెఫ్, కింగ్‌కోఠి)పై గెలుపొందారు. శ్రీకర్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్) 15–6, 15–10తో శాండిల్య (షేర్వుడ్)పై విజయం సాధించాడు. -
800 మీ. ఫ్రీస్టయిల్లో శ్రియకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూని యర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల బాలికల ఫ్రీస్టయిల్ రేసులో రంగారెడ్డికి చెందిన పంజల శ్రియ స్వర్ణం సాధించింది. ఆదివారం సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన అంతర్ జిల్లా ఈవెంట్లో శ్రియ 13ని.29.59 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని సాధించింది. హుస్నా జయీబ్ (హైదరాబాద్–14ని.35.33 సెకన్లలో), శ్రేష్ఠ (రంగారెడ్డి–16ని.31.78 సెకన్లలో) రజత, కాంస్య పతకాలు సాధించారు. 800 మీటర్ల పురుషుల ఫ్రీస్టయిల్ పోటీల్లో యశ్ వర్మ (రంగారెడ్డి–10ని.12.00 సె.), ఆకాశ్వర్ధన్ (హైదరాబాద్–11ని.42.94 సె.), ఆశీష్ తేజ (వరంగల్–12ని.06.32 సె.) తొలి 3 స్థానాల్లో నిలిచి పతకాలు సాధించారు. ఇతర ఫ్రీస్టయిల్ పోటీల విజేతలు 1500 మీ. బాలురు: 1.ప్రద్యోత్ (హైదరాబాద్– 23ని.34.53), 2.యువ హిమాన్షు (హైదరాబాద్–23.37.52 సె.), 3.లలిత్ సాగర్ (హైదరాబాద్–23.42.21 సె.). 1500 మీ. బాలికలు: 1.అంజలి (23ని.23.29 సె.), 2.ఇషిత రసమయి (27.59.20 సె.), 3.అభిచందన (31.11.11 సె.). 200 మీ. బాలురు: 1.సాయి నహర్ (రంగారెడ్డి–02.53.34 సె.), 2.శ్రీశాంత్ (రంగారెడ్డి, 03.11.93 సె.), 3.దీపక్ జావర్ (ఆదిలాబాద్, 03.36.70 సె.). 200 మీ. బాలికలు: 1.అలీజా అన్వర్ (హైదరాబాద్, 03.09.12 సె.), 2.శుభ శృతి (03.35.82 సె.). -
చెస్ చాంప్స్ శ్రీయ, పృథ్వీతేజ్
సాక్షి, హైదరాబాద్: సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో శ్రీయ, పృథ్వీ తేజ్ సీనియర్ విభాగంలో విజేతలుగా నిలిచారు. సీనియర్ బాలికల విభాగంలో శ్రీయ (విస్టా స్కూల్)... విధి (సిద్ధార్థ పబ్లిక్ స్కూల్)పై విజయం సాధించింది. హర్షిత (సిద్ధార్థ పబ్లిక్ స్కూల్) మూడో స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో పృథ్వీ తేజ్ (గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్), కర ణ్ (గ్లెండాల్ అకాడమీ), సయ్యద్ ఫసివుల్లా (సుప్రభాత్ మోడల్ హైస్కూల్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గ్లెన్డెల్ అకాడమీ దక్కించుకుంది. ఇతర విభాగాల విజేతలు జూనియర్ బాలికలు: 1. ఎస్. అనూష, 2. రిషిత, 3. మానస. బాలురు: 1. శ్రీ చైతన్య, 2. కౌశిక్, 3. ప్రణీత్. సబ్ జూనియర్ బాలురు: 1. ఆశ్రీత్ రెడ్డి, 2. శశాంక్, 3. కృష్ణ.