సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూని యర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల బాలికల ఫ్రీస్టయిల్ రేసులో రంగారెడ్డికి చెందిన పంజల శ్రియ స్వర్ణం సాధించింది. ఆదివారం సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన అంతర్ జిల్లా ఈవెంట్‌లో శ్రియ 13ని.29.59 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని సాధించింది. హుస్నా జయీబ్ (హైదరాబాద్–14ని.35.33 సెకన్లలో), శ్రేష్ఠ (రంగారెడ్డి–16ని.31.78 సెకన్లలో) రజత, కాంస్య పతకాలు సాధించారు. 800 మీటర్ల పురుషుల ఫ్రీస్టయిల్ పోటీల్లో యశ్ వర్మ (రంగారెడ్డి–10ని.12.00 సె.), ఆకాశ్‌వర్ధన్ (హైదరాబాద్–11ని.42.94 సె.), ఆశీష్ తేజ (వరంగల్–12ని.06.32 సె.) తొలి 3 స్థానాల్లో నిలిచి పతకాలు సాధించారు.
ఇతర ఫ్రీస్టయిల్ పోటీల విజేతలు
1500 మీ. బాలురు: 1.ప్రద్యోత్ (హైదరాబాద్– 23ని.34.53), 2.యువ హిమాన్షు (హైదరాబాద్–23.37.52 సె.), 3.లలిత్ సాగర్ (హైదరాబాద్–23.42.21 సె.).
1500 మీ. బాలికలు: 1.అంజలి (23ని.23.29 సె.), 2.ఇషిత రసమయి (27.59.20 సె.), 3.అభిచందన (31.11.11 సె.).
200 మీ. బాలురు: 1.సాయి నహర్ (రంగారెడ్డి–02.53.34 సె.), 2.శ్రీశాంత్ (రంగారెడ్డి, 03.11.93 సె.), 3.దీపక్ జావర్ (ఆదిలాబాద్, 03.36.70 సె.).
200 మీ. బాలికలు: 1.అలీజా అన్వర్ (హైదరాబాద్, 03.09.12 సె.), 2.శుభ శృతి (03.35.82 సె.).