Vritti Agarwal Clinches Second Gold in Junior National Aquatic Championships - Sakshi
Sakshi News home page

Junior National Aquatic Championships: వ్రితి అగర్వాల్‌కు మరో పసిడి పతకం

Published Tue, Jul 19 2022 1:02 PM | Last Updated on Tue, Jul 19 2022 2:03 PM

Vritti Agarwal clinches second gold in Junior National Aquatic Championships - Sakshi

జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ రెండో స్వర్ణ పతకం సాధించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అండర్‌–17 బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వ్రితి 17ని:37.78 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.

అండర్‌–17 బాలుర 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్‌లో తెలంగాణకే చెందిన బిక్కిన సాయి నిహార్‌ (4ని:40.08 సెకన్లు)... అండర్‌–14 బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్‌ ప్రీతమ్‌ (28.51 సెకన్లు) రజతాలు నెగ్గారు.
చదవండి: రన్నరప్‌ హర్ష భరతకోటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement