సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠి జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో సీనియర్స్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ బాలికల కేటగిరీలో మొత్తం 9 స్కూల్స్ పాల్గొనగా 38 పాయింట్లతో సెయింట్ జోసెఫ్ అగ్రస్థానంలో నిలిచింది. నాసర్ బాలికల స్కూల్ 25 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. సోమవారం జరిగిన సీనియర్ బాలికల 4–100మీ. రిలేలో సెయింట్ జోసెఫ్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
నాసర్ జట్టు రజతాన్ని గెలుచుకోగా, అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు జూనియర్ బాలికల కేటగిరీలో విశాఖపట్నంకు చెందిన సెయింట్ జాన్స్ పరీశ్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండియన్ బ్లోసమ్స్ స్కూల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రీజియన్ సంయుక్త కార్యదర్శి యు. సుందరి, కార్యదర్శి మారుతి ప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేశారు.
బాస్కెట్‌బాల్‌లోనూ టైటిల్
బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లోనూ సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి జట్టు విజేతగా నిలిచింది. హబ్సిగూడ డివిజన్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి జట్టు 45–34తో ఫ్యూచర్‌కిడ్స్‌పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment