
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ముగ్గురు యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు మంచి అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన కె. గౌతమ్, కార్తీక్ చద్దా, జి. ప్రతీక్ జాతీయ బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికయ్యారు.
బెంగళూరులోని జయప్రకాశ్ నారాయణ్ జాతీయ యూత్ సెంటర్ బాస్కెట్‌బాల్ అకాడమీలో ఈనెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ బాస్కెట్‌బాల్ క్యాంపు జరుగుతుంది. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు జరుగనున్న ‘ఫిబా’ అండర్–16 ఆసియా పురుషుల చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా ఈ జాతీయ క్యాంపును నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment