
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో తెలంగాణ బాలికల జట్టు ముందంజ వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో బుధవారం జరిగిన పోరులో తెలంగాణ 43–7తో ఉత్తరాఖండ్‌పై విజయం సాధించింది. చిరుజల్లుల వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు ఆరంభం నుంచి ప్రత్యర్ధిపై ఆధిపత్యం చెలాయించింది.
చివరిదాకా కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయం దక్కించుకుంది. తెలంగాణ తరఫున భువనేశ్వరి (9), రాగమయి (8), గౌతమి (6), జాయిసీ (6) మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సత్తా చాటిన తెలంగాణ బాలికల ప్రదర్శనపై రాష్ట్ర బాస్కెట్‌బాల్ సమాఖ్య కార్యదర్శి నార్మన్ ఐజాక్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment