సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మొహమ్మద్ అఫ్సర్, అజిత్ విజేతలుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో ఆదివారం 30–34 వయో విభాగంలో జరిగిన 400 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్‌ను అఫ్సర్ 6ని. 56.70సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని సాధించాడు. రాజు (7ని.18.03సె.) రజతాన్ని దక్కించుకున్నాడు. 35–39 వయో విభాగంలో జరిగిన 400 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో అజిత్ (6ని.2.29సె.), బిశాల్ (7ని.31.30సె.), మొహమ్మద్ యూనస్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
కుమారస్వామికి నాలుగు పతకాలు
పురుషుల 54–59 వయో విభాగంలో కడియాల కుమారస్వామికి నాలుగు పతకాలు వచ్చాయి. 50 మీటర్ల బటర్‌ఫ్లైలో స్వర్ణం, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్యం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజతం సాధించారు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం అధ్యక్షులు బజ్‌రంగ్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.
ఇతర వయోవిభాగాల విజేతలు
∙400 మీ. ఫ్రీస్టయిల్: 90+ పురుషులు: 1. గులామ్. 25–29 మహిళలు: 1. తంజిల్లా మౌల్వి, 2. ఎం. అనిత. 25–29 పురుషులు: 1. నష్కార్, 2. సీహెచ్. మహేశ్, 3. ఎం. మహేశ్.
∙30–34 మహిళలు: 1. షేక్ సాజిదా. 40–44 పురుషులు: 1. శంకర్, 2. విశ్వనాథ్, 3. కుమారస్వామి; మహిళలు: 1. పి. రమాదేవి.
∙ 50 మీ. బటర్‌ఫ్లై: 50–54 పురుషులు: 1. జాకబ్, 2. శ్రీనివాస్ రెడ్డి, 3. ముకర్రమ్ ఖాన్. 55–59 మహిళలు: 1. విజయలక్ష్మి.
, ,
Comments
Please login to add a commentAdd a comment