శ్రియ, మేఘన ముందంజ | sreeya and meghana leading in badminton event | Sakshi
Sakshi News home page

శ్రియ, మేఘన ముందంజ

Published Tue, Jul 25 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

శ్రియ, మేఘన ముందంజ

శ్రియ, మేఘన ముందంజ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రీజినల్‌ ఐసీఎస్‌ఈ–ఐఎస్‌సీ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ఈవెం ట్‌లో ఎ. శ్రియ, జి. మేఘన ముందంజ వేశారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సోమవారం జరిగిన అండర్‌–17 బాలికల సింగిల్స్‌లో సెయింట్‌ జోసెఫ్‌ (కింగ్‌కోఠి)కు చెందిన శ్రియ 15–5, 15–5తో వరహాల చెట్టి (విశాఖపట్నం)పై గెలిచింది. మిగతా మ్యాచ్‌ల్లో మేఘన (ఎఫ్‌కేఎస్, రాజమండ్రి) 15–0, 15–3తో నయన (గీతాంజలి, సికింద్రాబాద్‌)పై విజయం సాధించగా, అన్షు రెడ్డి (సెయింట్‌ జోసెఫ్‌) 15–2, 15–4తో అమీన సుల్తానా (ఎన్‌ఏఎస్‌ఆర్‌)ను ఓడించింది.

 

సాయి శ్రియ (ఎఫ్‌కేఎస్, రాజమండ్రి) 15–0, 15–1తో డైసి మిట్ట (అభ్యాస ఇంటర్నేషనల్‌ స్కూల్‌)పై నెగ్గింది. అండర్‌–17 బాలుర సింగిల్స్‌లో మహేశ్‌ (సెయింట్‌ జోసెఫ్, కింగ్‌కోఠి) 15–6, 15–7తో సాయి నితిన్‌ (హెరిటేజ్‌ వ్యాలీ)పై, గుణ కార్తీక్‌ (ఎఫ్‌కేఎస్, రాజమండ్రి) 15–3, 15–8తో త్రిపాఠి మనోజ్‌ రెడ్డి (సెయింట్‌ జోసెఫ్, కింగ్‌కోఠి)పై గెలుపొందారు. శ్రీకర్‌ (హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌) 15–6, 15–10తో శాండిల్య (షేర్‌వుడ్‌)పై విజయం సాధించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement