మేఘన (ఫైల్)
నిజామాబాద్: తండ్రి మరణం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 15 ఏళ్ల క్రితం కూనమనేని శ్రీనివాస్ కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎడపల్లిలో స్థిర పడింది. శ్రీనివాస్‌కు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రెండేళ్ల క్రితం కూనమనేని శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమార్తె మేఘన తండ్రిపై బెంగపెట్టుకొని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని తల్లి మాట్లాడుతుండగా విన్న మేఘన మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేశ్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment