
భర్తతో కలిసి ఘాతుకానికి పాల్పడ్డ కూతురు
పోలీసుల అదుపులో నిందితులు
వివరాలు వెల్లడించిన నార్త్ సీఐ శ్రీనివాస్
నిజామాబాద్: కన్న తల్లిని కట్టుకున్న భర్తతో కడతేర్చింది ఓ కూతురు. ఈ ఘటనలో దంపతులిద్దరిని పోలీ సులు అరెస్టు చేశారు. నగరంలోని నార్త్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. నాగారం 300క్వార్టర్స్‌లో రమేష్, సౌందర్య అనే దంపతులు నివసిస్తున్నారు. సౌందర్య తల్లి విజయలక్ష్మి నాలుగు సంవత్సరాలుగా వీరివద్దనే ఉంటోంది.
ఈక్రమంలో విజయలక్ష్మీ తరుచూ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడంతో కూతురు, అల్లుడికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించి బుధవారం రాత్రి విజయల క్ష్మి పడుకోగానే దంపతులు ఇద్దరు కలిసి ఆమె ము ఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి, చేతితో గొంతు పిసికి చంపారు.
సహజ మరణంగా నమ్మించడానికి యత్నించగా, అనుమానం వచ్చి స్థానికు లు పోలీసులకు సమాచారం అందించారు. విచార ణలో వారు నేరం అంగీకరించడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు లు తెలిపారు. ఎస్సై గంగాధర్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment