ముంబై: భారత మహిళల జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో వీరిద్దరికి గ్రేడ్ ‘సి’లో చోటు దక్కింది. బ్యాటర్ మేఘన ఇప్పటి వరకు భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20లు ఆడగా... లెఫ్టార్మ్ పేసర్ అంజలి 6 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేంట్రం చేసింది.
ఇక మూడు గ్రేడ్‌లలో కలిపి మొత్తం 17 మందితో బోర్డు వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటి వరకు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఉండగా కొత్తగా ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు అవకాశం లభించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ప్రకటించడం ఇదే తొలిసారి.
గత జాబితాలో ఉండి ప్రస్తుతం రిటైర్ అయిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో పాటు పూనమ్ యాదవ్‌ను కూడా తప్పించగా... ‘బి’ గ్రేడ్ జాబితాను 10నుంచి ఐదుకు కుదించారు. ప్రస్తుతం జట్టులో కీలకంగా మారిన రేణుకా ఠాకూర్, రిచా ఘోష్‌లకు ప్రమోషన్ దక్కగా, పూజ వస్త్రకర్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయింది.
కాంట్రాక్ట్‌ల జాబితా
గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ.
గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షలు): మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తిక భాటియా.
చదవండి: NZ vs PAK: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment