Anjali Sarvani
-
BCCI: ఏపీ పేసర్ అంజలి శర్వాణి చేజారిన గోల్డెన్ ఛాన్స్.. జట్టులోకి ఆమె
ఆసియా క్రీడలు-2023కు ఆంధ్రప్రదేశ్ పేసర్ అంజలి శర్వాణి దూరమైంది. మోకాలి గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ స్థానంలో.. పూజా వస్త్రాకర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అంజలి స్థానాన్ని హార్డ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 26 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చింది. మెరుగైన ఆట తీరు కనబరిచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం గ్రేడ్-సి(రూ. 10 లక్షల వార్షిక వేతనం)లో ఉన్న అంజలి 19వ ఆసియా క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న భారత మహిళా ప్రధాన జట్టుకు ఎంపికైంది. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెగా ఈవెంట్లో పాల్గొనే సువర్ణావకాశం ఆమె చేజారింది. అంజలి శర్వాణి జట్టుకు దూరం కావడంతో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న పూజా వస్త్రాకర్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. కాగా సెప్టెంబరు 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి. చైనాలోని హోంగ్జో ఇందుకు వేదిక. ఆసియా క్రీడలు-2023కి భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి, పూజా వస్త్రాకర్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్. -
కర్నూల్ అమ్మాయికి బంపరాఫర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
ముంబై: భారత మహిళల జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో వీరిద్దరికి గ్రేడ్ ‘సి’లో చోటు దక్కింది. బ్యాటర్ మేఘన ఇప్పటి వరకు భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20లు ఆడగా... లెఫ్టార్మ్ పేసర్ అంజలి 6 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేంట్రం చేసింది. ఇక మూడు గ్రేడ్లలో కలిపి మొత్తం 17 మందితో బోర్డు వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటి వరకు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఉండగా కొత్తగా ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు అవకాశం లభించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ప్రకటించడం ఇదే తొలిసారి. గత జాబితాలో ఉండి ప్రస్తుతం రిటైర్ అయిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో పాటు పూనమ్ యాదవ్‌ను కూడా తప్పించగా... ‘బి’ గ్రేడ్ జాబితాను 10నుంచి ఐదుకు కుదించారు. ప్రస్తుతం జట్టులో కీలకంగా మారిన రేణుకా ఠాకూర్, రిచా ఘోష్‌లకు ప్రమోషన్ దక్కగా, పూజ వస్త్రకర్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయింది. కాంట్రాక్ట్‌ల జాబితా గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షలు): మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తిక భాటియా. చదవండి: NZ vs PAK: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం -
WPL 2023: వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు క్రికెటర్? ఎవరు ఏయే జట్లకు ఆడబోతున్నారంటే..
Women Cricketers From Telugu States In WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు మంచి ధర దక్కించుకున్నారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు సంక్షిప్తంగా.. అంజలి శర్వాణి ►లెఫ్టార్మ్ పేస్ బౌలర్. కర్నూల్ జిల్లా ఆదోని స్వస్థలం. భారత్ తరఫున 6 టి20లు మ్యాచ్‌లు ఆడింది. ►జట్టు: యూపీ వారియర్జ్ ►ధర: 55 లక్షలు సబ్బినేని మేఘన ►బ్యాటర్, స్వస్థలం విజయవాడ. భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడింది. ►జట్టు: గుజరాత్ జెయింట్స్ ►ధర: రూ.30 లక్షలు షబ్నమ్ షకీల్ ►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం విశాఖపట్నం. ఇటీవల అండర్–19 ప్రపంచకప్‌లో ఆడింది. ►జట్టు- గుజరాత్ జెయింట్స్ ►ధర: రూ.10 లక్షల సొప్పదండి యషశ్రీ ►పేస్ బౌలర్. హైదరాబాద్ స్వస్థలం. ఇటీవల అండర్–19 ప్రపంచ కప్‌లో ఆడింది. ►జట్టు: యూపీ వారియర్స్ ►ధర: రూ.10 లక్షలు అరుంధతి రెడ్డి ►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం హైదరాబాద్. భారత్ తరఫున 26 టి20లు ఆడింది. ►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్ ►ధర: రూ.30 లక్షలు వి. స్నేహ దీప్తి ►బ్యాటర్. స్వస్థలం విశాఖపట్నం. భారత్ తరఫున 1 వన్డే, 2 టి20లు ఆడింది. ►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్ ►ధర: రూ.30 లక్షలు. వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉంటే... అండర్-19 మహిళల ప్రపంచకప్-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. WPL Auction 2023: అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి -
WPL వేలంలో జాక్‌పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి
ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కనక వర్షం కురుస్తుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు సొంతం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. Young Anjali Sarvani is next with a base price of INR 30 Lakh She is SOLD to @UPWarriorz for INR 55 Lakh #WPLAuction — Women's Premier League (WPL) (@wplt20) February 13, 2023 వేలంలో ఊహించని ధర పలికిన వారిలో కర్నూలు అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి కూడా ఉంది. 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. 30 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డ అంజలీని యూపీ వారియర్జ్ పోటీపడి మరీ సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన శార్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, సత్తా చాటింది. ఆ సిరీస్‌లో శర్వాణి ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడిన శర్వాణి 2/34 అత్యుత్తమ ప్రదర్శనతో 3 వికెట్లు తీసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కూడా శర్వాణి సభ్యురాలిగా ఉంది. -
T20 WC 2023: భారత ప్రపంచకప్ జట్టు.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు!
ICC Women Cricket World Cup 2023- ముంబై: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కేశవరాజుగారి అంజలి శర్వాణికి తొలి వరల్డ్ కప్ అవకాశం లభించింది. ఫిబ్రవరి 10నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో ఆడిన 5 టి20ల్లో 8.73 ఎకానమీతో 3 వికెట్లు తీసింది. అంజలి శర్వాణి మరో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘనను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ ఆడే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన టీమ్‌లో మాత్రం మేఘనకు అవకాశం దక్కింది. మరో వైపు దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన పేసర్ శిఖాపాండేకు మళ్లీ పిలుపు లభించింది. షఫాలీ, రిచా.. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిచా ఘోష్, షఫాలీ వర్మ నెల రోజుల వ్యవధిలో సీనియర్ టీమ్ తరఫున కూడా వరల్డ్ కప్ ఆడనుండటం విశేషం. ప్రపంచ కప్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్ ముక్కోణపు టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, సుష్మ వర్మ, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! -
ఆస్ట్రేలియాతో తొలి టీ20.. బ్యాటింగ్ భారత్‌దే! కర్నూలు అమ్మాయి ఎంట్రీ
ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళలలతో తొలి టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా భారత బ్యాటర్ దేవికా వైద్యకు తుది జట్టలో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వణి భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో హీలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తుది జట్లు ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్ భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దేవికా వైద్య, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శర్వాణి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా