ICC Women Cricket World Cup 2023- ముంబై: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కేశవరాజుగారి అంజలి శర్వాణికి తొలి వరల్డ్ కప్ అవకాశం లభించింది. ఫిబ్రవరి 10నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో ఆడిన 5 టి20ల్లో 8.73 ఎకానమీతో 3 వికెట్లు తీసింది.
అంజలి శర్వాణి
మరో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘనను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ ఆడే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన టీమ్‌లో మాత్రం మేఘనకు అవకాశం దక్కింది. మరో వైపు దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన పేసర్ శిఖాపాండేకు మళ్లీ పిలుపు లభించింది.
షఫాలీ, రిచా..
వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిచా ఘోష్, షఫాలీ వర్మ నెల రోజుల వ్యవధిలో సీనియర్ టీమ్ తరఫున కూడా వరల్డ్ కప్ ఆడనుండటం విశేషం.
ప్రపంచ కప్‌కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్‌నెస్ సాధిస్తేనే).
రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్
ముక్కోణపు టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, సుష్మ వర్మ, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్‌నెస్ సాధిస్తేనే).
చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే..
IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..!
Comments
Please login to add a commentAdd a comment