ICC Women Cricket World Cup 2023
-
WC final 2023: కప్ భారత్‌దే.. రోహిత్ శర్మదే కీలక పాత్ర: వెంకటేశ్,తరుణ్
దేశమంతా క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా మనమంతా టీమిండియా అభిమానులం అన్న చందంగా టీమిండియాకు జై కొడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ మన సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ జాబితాలో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా కప్ కొడుతుందని హీరోలు విక్టరీ వెంకటేశ్, తరుణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే ఈ ఇద్దరు హీరోలు..నేడు జరగనున్న వన్డే ప్రపంచ కప్ ఫైనల్మ్యాచ్ని ప్రత్యక్షంగా తిలకించడం కోసం అహ్మదాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘అహ్మదాబాద్ వెళ్తున్నా.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చూసిన హిట్టింగ్ ఇంకా మర్చిపోకముందే ఫైనల్ మ్యాచ్ వచ్చేసింది. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను తిలకించడానికి అహ్మదాబాద్ వెళుతున్నాను. ఈసారి కప్ సాధిస్తాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీం అన్ని విభాగాల్లో దూకుడుగా ఉంది. వరల్డ్ కప్ ప్రారంభంలో రోహిత్ శర్మను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాను. వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీని అభినందించే అవకాశం లభించింది’అని అన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘ఈసారి వరల్డ్ కప్ కచ్చితంగా భారత్‌దే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటుందని అనుకుంటున్నాను. ఈ రోజు ఆటలో రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించనున్నారు. ప్రారంభ ఓవర్లలో తను వేసే పరుగుల పునాది విజయానికి బాటలా నిలుస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంద శాతం విజయానికి చేరువలో ఉన్నాం. క్రికెట్ చరిత్రలో మరోసారి భారత్‌ను సగర్వంగా సువర్ణాక్షరాలతో లిఖించే సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. -
సిరాజ్ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. బుమ్రా మొదలెడితే.. సిరాజ్ చుక్కలు చూపించాడు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ఛేదించి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్ సాధించి నయా జోష్‌లో ఉంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతరీతిలో ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి సూపర్-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ ఇక ఆసియా కప్-2023లో కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్ Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
T20 WC 2023: భారత ప్రపంచకప్ జట్టు.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు!
ICC Women Cricket World Cup 2023- ముంబై: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కేశవరాజుగారి అంజలి శర్వాణికి తొలి వరల్డ్ కప్ అవకాశం లభించింది. ఫిబ్రవరి 10నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో ఆడిన 5 టి20ల్లో 8.73 ఎకానమీతో 3 వికెట్లు తీసింది. అంజలి శర్వాణి మరో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘనను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ ఆడే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన టీమ్‌లో మాత్రం మేఘనకు అవకాశం దక్కింది. మరో వైపు దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన పేసర్ శిఖాపాండేకు మళ్లీ పిలుపు లభించింది. షఫాలీ, రిచా.. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిచా ఘోష్, షఫాలీ వర్మ నెల రోజుల వ్యవధిలో సీనియర్ టీమ్ తరఫున కూడా వరల్డ్ కప్ ఆడనుండటం విశేషం. ప్రపంచ కప్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్ ముక్కోణపు టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, సుష్మ వర్మ, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..!