సిరాజ్‌ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్‌ లెజెండ్‌ | Asia Cup 2023: Hardik Pandya Is India's Main Weapon In World Cup, Says Wasim Akram | Sakshi
Sakshi News home page

Asia Cup: సిరాజ్‌ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే.. కుల్దీప్‌ కూడా: పాక్‌ లెజెండరీ బౌలర్‌

Published Mon, Sep 18 2023 12:00 PM | Last Updated on Mon, Sep 18 2023 1:10 PM

Asia Cup Hardik Pandya Is India Main Weapon in WC 2023: Wasim Akram - Sakshi

Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్‌-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు రోహిత్‌ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు.

బుమ్రా మొదలెడితే.. సిరాజ్‌ చుక్కలు చూపించాడు
ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి వికెట్‌ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్‌’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్‌ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు.

ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్‌ ఛేదించి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్‌ సాధించి నయా జోష్‌లో ఉంది.

వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ లెజండరీ పేసర్‌ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. 

ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్‌ పాండ్యా అనడంలో సందేహం లేదు.

కుల్దీప్‌ యాదవ్‌ సైతం అద్భుతరీతిలో
ఇక కుల్దీప్‌ యాదవ్‌.. ఆసియా కప్‌ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్‌మెంట్‌ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. 

ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ శ్రీలంక చేతిలో ఓడి సూపర్‌-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. 

బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ
ఇక ఆసియా కప్‌-2023లో కుల్దీప్‌ యాదవ్‌ 9 వికెట్లు కూల్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్‌ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్‌ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. 

చదవండి: నాకు మెసేజ్‌ వచ్చింది.. అందుకే సిరాజ్‌ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్‌
Asia Cup 2023: కాస్త ఓవర్‌ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement