Sabbhineni Meghana
-
మంధాన క్రేజ్.. తెలుగమ్మాయి ఫిఫ్టీ.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్
WPL 2024- RCBW Vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడుతోంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ సోఫీ డివైన్(1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. Captain Smriti Mandhana on fire. 🔥pic.twitter.com/vfvhMozwsk — Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024 ఈ నేపథ్యంలో రెండో ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా సిక్సర్, ఫోర్‌తో చెలరేగింది. కానీ.. మంధాన మెరుపులు కాసేపటికే మాయమయ్యాయి. ఆరో ఓవర్ తొలి బంతికే మెగ్రాత్ బౌలింగ్‌లో వ్రిందా దినేశ్‌కు క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఆమె తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ(8) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో సబ్బినేని మేఘన, వికెట్ కీపర్ రిచా ఘోష్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మేఘన 44 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. Brilliant half-century for Sabbhineni Meghana in front of a massive crowd! Can she power @RCBTweets to a match-winning total? Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/geoj3JWH61 — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 Richa Gosh reaches her maiden FIFTY for #RCB 💪🔥 Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/9QtU8s27Hk — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 ఇలా మేఘన జట్టుకు అవసరమైన సమయంలో అర్ధ శతకం బాదితే.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 37 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 62 రన్స్ చేసింది. మిగతా వాళ్లలో జార్జియా వరేహం డకౌట్ కాగా.. సోఫీ మొలినెక్స్ 9, శ్రెయాంక పాటిల్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. స్మృతి రాగానే హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ మహిళా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హ్యారిస్, తహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో స్మృతి మంధాన రాగానే చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. అదే విధంగా ఆమె బ్యాట్ ఝులించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. Smriti Mandhana was impressed with Home Crowd 😂❤️ ❤️#RCB pic.twitter.com/4vbwccmhDG — RCB Xtra. (@Rcb_Xtra) February 24, 2024 -
T20 WC 2023: భారత ప్రపంచకప్ జట్టు.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు!
ICC Women Cricket World Cup 2023- ముంబై: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కేశవరాజుగారి అంజలి శర్వాణికి తొలి వరల్డ్ కప్ అవకాశం లభించింది. ఫిబ్రవరి 10నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో ఆడిన 5 టి20ల్లో 8.73 ఎకానమీతో 3 వికెట్లు తీసింది. అంజలి శర్వాణి మరో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘనను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ ఆడే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన టీమ్‌లో మాత్రం మేఘనకు అవకాశం దక్కింది. మరో వైపు దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన పేసర్ శిఖాపాండేకు మళ్లీ పిలుపు లభించింది. షఫాలీ, రిచా.. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిచా ఘోష్, షఫాలీ వర్మ నెల రోజుల వ్యవధిలో సీనియర్ టీమ్ తరఫున కూడా వరల్డ్ కప్ ఆడనుండటం విశేషం. ప్రపంచ కప్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్ ముక్కోణపు టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, సుష్మ వర్మ, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! -
అదరగొట్టిన ఆంధ్ర అమ్మాయి.. మలేషియాపై భారత్ ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భారత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 30 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆంధ్ర అమ్మాయి సబ్భినేని మేఘన అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మేఘన.. 11 ఫోర్లు, సిక్స్‌తో 69 పరుగులు చేసింది. అదే విధంగా మరో ఓపెనర్ షఫాలీ వర్మ(39 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. కాగా 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 5.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఈ సమయంలో వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ తమ తదపరి మ్యాచ్‌లో ఆక్టోబర్4న యూఏఈతో తలపడనుంది. చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! -
కామన్వెల్త్ గేమ్స్.. భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్..!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్ మహిళల జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కరోనా బారిన పడిన బ్యాటర్ సబ్భినేని మేఘన కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలలో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. దీంతో మేఘన బర్మింగ్‌హామ్‌లో ఉన్న భారత జట్టలో చేరేందుకు సిద్దమైంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేఘన దృవీకరించింది. ఇక మేఘనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బర్మింగ్‌హామ్‌కు వెళ్లే తన ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఫోటోను షేర్ చేసింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారత జట్టు బర్మింగ్‌హామ్‌కు పయనమయ్యే ఒక్క రోజు ముందు మేఘన, ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉండిపోయారు. అయితే పూజా ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా,పాకిస్తాన్ బార్బడోస్ జట్లతో కలిపి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా గ్రూప్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం(జూలై 29) ఆస్ట్రేలియాతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా,యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా చదవండి: PV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్‌కు తరలింపు