మహిళల ఆసియాకప్-2022లో భారత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 30 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆంధ్ర అమ్మాయి సబ్భినేని మేఘన అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది.
ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మేఘన.. 11 ఫోర్లు, సిక్స్‌తో 69 పరుగులు చేసింది. అదే విధంగా మరో ఓపెనర్ షఫాలీ వర్మ(39 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. కాగా 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 5.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది.
ఈ సమయంలో వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ తమ తదపరి మ్యాచ్‌లో ఆక్టోబర్4న యూఏఈతో తలపడనుంది.
చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే!
Comments
Please login to add a commentAdd a comment