
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు
జరుగనున్నాయి.
టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి.
వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment