bangladesh tour
-
జాక్‌పాట్ కొట్టిన అనంతపురం క్రికెటర్.. టీమిండియాకు ఎంపిక
సాక్షి, అనంతపురం: నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఎమర్జింగ్ ఇండియా తరఫున ఆడిన అనూష బాగా రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్ అయిన అనూష 2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీలో చేరింది. అకాడమీ ప్రోత్సాహంతో జిల్లా, రాష్ట్ర, జోనల్ స్థాయిలో విశేషంగా రాణించి..చివరకు టీమిండియాలో చోటు దక్కించుకుంది. ఈమె తల్లిదండ్రులు బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి. సాధారణ రైతు కుటుంబం అయినప్పటికీ కుమార్తెను క్రికెటులో బాగా ప్రోత్సహించారు. ఆర్డీటీ సహాయ సహకారాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అనూష తెలిపింది. (అనూషను అభినందిస్తున్న మాంఛూ ఫెర్రర్) టీమిండియా తరఫున బాగా రాణించి దేశానికి పేరు తెస్తానంది. అనూష క్రీడాప్రస్తానం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడా ఆణిముత్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తోందని చెప్పారు. కాగా, బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి. వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు. -
బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. స్టార్ ప్లేయర్‌పై వేటు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి. వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు. -
పాపం ఉనద్కత్.. సెలక్టర్లు కరుణించినా, అదృష్టం వెక్కిరించింది..!
Jaydev Unadkat: 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అనూహ్య పరిణామాల నడుమ భారత టెస్ట్ జట్టులో (బంగ్లాతో టెస్ట్ సిరీస్) చోటు దక్కించుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను విధి దారుణంగా వెక్కిరించింది. సెలెక్టర్లు కరుణించి టీమిండియాకు ఆడే అవకాశం కల్పించినా, ఈ సౌరాష్ట్ర బౌలర్‌తో అదృష్టం బంతాట ఆడుకుంది. ఉనద్కత్ ఎంపిక ఊహించని పరిణామాల మధ్య ఆలస్యంగా చోటు చేసుకోవడంతో వీసా సమస్యలు తలెత్తి బంగ్లాతో తొలి టెస్ట్ సమయానికి అతను భారత జట్టుతో కలవలేని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌తో రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుండగా, వీసా పేపర్లు అందని కారణంగా ఉనద్కత్ భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకున్న అతని కలలు కలలుగానే మిగిలిపోయాయి. బీసీసీఐ లాజిస్టిక్ విభాగం అతన్ని వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌కు పంపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. కనీసం రెండో టెస్ట్ సమయానికైనా ఉనద్కత్‌ను జట్టుతో కలిపేందుకు లాజిస్టిక్ విభాగం శతవిధాల ప్రయత్నిస్తుంది. కాగా, 2010 డిసెంబర్లో చివరిసారిగా భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 31 ఏళ్ల ఉనద్కత్.. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోం చేసుకోలేక జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఉనద్కత్ పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి సెలెక్టర్లు తనను ఎంపిక చేసేలా చేసుకున్నాడు. అయితే చేతికందిన అదృష్టం వీసా సమస్యల కారణంగా చేజారడంతో అతను వాపోతున్నాడు. బంగ్లా పర్యటనకు ముందు షమీ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఉనద్కత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. విజయ్ హజారే ట్రోఫీ-2022లో అతని అత్యద్భుతమైన ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ టీమిండియాలో స్థానం కల్పించింది. ఉనద్కత్.. టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20 ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ టోర్నీల్లో ఈ సౌరాష్ట్ర బౌలర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉనద్కత్ ఐపీఎల్లో సైతం మెరుగ్గా రాణించాడు. వివిధ ఫ్రాంచైజీల తరఫున 91 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతున్నాడు. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు షాక్.. విదేశీ సిరీస్‌ల నుంచి ఏడుగురు ఔట్
సిడ్నీ: ఐపీఎల్ 2021లో ఆడిన అగ్రశ్రేణి ఆసీస్ క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలుగుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు షాకిచ్చారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, సీఏ ఈ రెండు విదేశీ పర్యటనలను ఖరారు చేయగా, ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మాత్రం నిరాసక్తత కనబర్చారు . కొందరు వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ, మరికొందరు గాయాల నుంచి కోలుకోలేదని నివేదికలు సమర్పిస్తూ ఈ రెండు విదేశీ పర్యటనలకు డుమ్మా కొట్టారు. సీనియర్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టాయినీస్‌లు వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్ కోసం పరిగణించవద్దని విజ్ఞప్తి చేయగా, స్టీవ్ స్మిత్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్‌లు ఐపీఎల్ సమయంలో తగిలిన గాయాల కారణంగా జట్టు నుంచి తప్పించమని అభ్యర్ధించారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చూపుతూ జట్టుకు దూరంగా ఉండటం సీఏను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, విండీస్, బంగ్లా టూర్ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఆసీస్ జట్టు జూలై 9 నుంచి 24 మధ్య విండీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా, బంగ్లాదేశ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆ దేశ ఆటగాళ్లు దూరం..?
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లదేశ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానంగా మారింది. ఈ పర్యటనలో ఆసీస్ ఐదు టీ20లు ఆడనుండగా, సిరీస్ పూర్తయ్యే సరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 13 మంది ఆసీస్ స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. వీరంతా లీగ్‌కు దూరమైతే టోర్నీ కళావిహీనంగా మారుతుంది. గాయాల బారినపడి ఇది వరకే చాలా మంది స్టార్లు లీగ్‌కు దూరం కాగా, కొత్తగా వీరు కూడా అందుబాటులో ఉండకపోతే, లీగ్ పునఃప్రారంభించి ఉపయోగం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్ పర్యటన విషయమై బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరిపి ఎలాగైనా పర్యటనను రద్దు చేసేలా చేస్తుందని పలువురు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు గట్టిగా నమ్ముతున్నారు. కాగా, కరోనా కారణంగా అర్దంతరంగా ఆగిపోయిన లీగ్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది. లీగ్ నిర్వహణపై మే 29న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: రాహుల్ వర్కౌట్లకు అతియా అదిరిపోయే రెస్పాన్స్.. -
టీమిండియా బంగ్లా పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా బంగ్లా గడ్డపై అడుగుపెట్టనుంది. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2015లో ఆ దేశంలో పర్యటించింది. రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వచ్చే ఏడాది(2022) నవంబర్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. గతేడాది లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ద్వైపాక్షిక సిరీస్‌లను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన సన్నాహకాల్లో ఉన్న బిజీగా ఉన్న భారత్.. రానున్న రెండేళ్ల కాలంలో ఊపిరి సడలని షెడ్యూల్‌ను కలిగివుంది. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే, ఈ ఏడాది ఆఖర్లో టీ20 ప్రపంచ కప్, ఆ తరువాత జనవరిలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్(3 వన్డేలు, 3 టీ20లు), ఆ వెంటనే శ్రీలంక బృందం భారత పర్యటన(3 టెస్టులు, 3 వన్డేలు), ఆతర్వాత జూన్, జులైలలో ఇంగ్లండ్ పర్యటన(3 వన్డేలు, 3 టీ20లు), అక్కడి నుంచి నేరుగా వెస్టిండీస్ పర్యటన(3 వన్డేలు, 3 టీ20లు), ఆతర్వాత ఆసియా కప్, ఆ వెంటనే సెప్టెంబర్, నవంబర్లలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్(4 టెస్టులు, 3 వన్డేలు) .. ఇలా దాదాపు ఏడాదంతా బీజీబిజీగా గడుపనుంది. చదవండి: బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం.. -
బంగ్లా బంద్ హింసాత్మకం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ సంస్థ హెఫాజత్–ఇ–ఇస్లామ్ పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. భారత ప్రధాని మోదీ పర్యటనపై హెఫాజత్–ఇ–ఇస్లామ్ తదితర సంస్థలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు మృతి చెందటాన్ని నిరసిస్తూ ఈ బంద్ జరిగింది. నారాయణ్‌గంజ్ జిల్లా సనర్‌పారాలో పోలీసు కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. నిరసనకారులు రాజధాని ఢాకాతో తీరప్రాంత నగరం చిట్టగాంగ్‌తో కలిపే ప్రధాన రహదారిని దిగ్బంధించారు. పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. బ్రహ్మణ్‌బారియా జిల్లాలో ఆందోళనకారులు రైలుపై దాడికి దిగారు. ఇంజిన్ రూం సహా అన్ని బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పది మంది వరకు గాయాలపాలయ్యారు.ఇదే జిల్లా సరైల్‌లో భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అల్లర్ల అనంతరం ఈ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బంద్ కారణంగా రాజధాని ఢాకాలో వీధులు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ నేరుగా మద్దతు ప్రకటించలేదు. కాగా, హెఫాజత్–ఇ–ఇస్లామ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా మత విద్యాసంస్థలు నడుపుతోంది. -
తీస్తా ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం
ఢాకా: తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై బంగ్లా ప్రధాని హసీనాతో రెండు రోజుల పర్యనటలో భాగంగా మోదీ చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా శనివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని షేక్ హసీనాను మోదీ కోరారని ఆయన చెప్పారు. రెండు దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి..మున్ముందూ కూడా ఇదే సహకారం కొనసాగుతుందని ఆయన అన్నారు. తీస్తా సహా నదీ జలాల విభజనపై రెండు దేశాల ఉన్నతాధికారుల మధ్య ఇటీవలే ఢిల్లీలో జరిగిన భేటీ ఫలప్రదంగా ముగిసిందన్నారు. సిక్కింలో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని మోదీ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇద్దరు ప్రధానుల చర్చలు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని మోదీ శనివారం ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కనెక్టివిటీ, వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్య రంగాలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా మోదీ హసీనాకు 12 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన ఒక బాక్సును బహూకరించారు. శాంతి, ప్రేమ, సుస్థిరత కోరుకుంటున్నాం భారత్, బంగ్లాదేశ్‌లు అస్థిరత, అలజడులు, ఉగ్రవాదం బదులు శాంతి, ప్రేమ, సుస్థిరత ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రకటించారు. గోపాల్‌గంజ్‌లోని ఒరకండిలో మతువా వర్గం హిందువుల ఆరాధ్యుడు హరిచంద్ ఠాకూర్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి వారితో మాట్లాడారు. భారత్ నుంచి ఒరకండికి సులువుగా చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పశ్చిమబెంగాల్లోని అత్యంత కీలకమైన మతువా వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే ప్రత్యేకంగా మోదీ ఈ పర్యటన చేపట్టారని విశ్లేషకులు అంటున్నారు. సరిహద్దులకు సమీపంలో ఉన్న 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని శనివారం ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అమ్మ వారికి వెండితో తయారుచేసిన, బంగారు పూత కలిగిన మకుటాన్ని సమర్పించుకున్నారు. తుంగిపరాలోని షేక్ ముజిబుర్ రహ్మాన్ మాసోలియాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. బంగబంధుకు పుష్పాలతో నివాళులర్పించారు. ముజిబుర్ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేతగా మోదీ నిలిచారు. -
భారత్–బంగ్లా బంధాన్ని విడగొట్టలేరు
ఢాకా: 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో (ముక్తి జుద్దో) బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంతోపాటు భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి బయటపడ్డాక మోదీ మరో దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఢాకాలోని నేషనల్ పరేడ్ స్క్వేర్‌లో దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు బంగబంధు శత జయంతి వేడుకల్లో అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాతోపాటు మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత సైన్యం పోషించిన పాత్రను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. బంగ్లాదేశ్ అమర వీరుల రక్తం, భారత సైనికుల రక్తం కలిసి పారుతున్నాయని చెప్పారు. ఈ రక్తం రెండు దేశాల నడుమ గొప్ప అనుబంధాన్ని ఏర్పర్చిందని, దాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడగొట్టలేరని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి వెనుక అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కృషి మరువలేనిదన్నారు. రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకం బంగబంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ సామాన్య ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చారని, ముక్తి వాహినిగా మారారని మోదీ అన్నారు. 1970వ దశకంలో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలపై పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అకృత్యాలకు సంబంధించిన చిత్రాలు భారతీయులను కలచి వేసేవని గుర్తుచేశారు. అప్పట్లో తన వయసు 20–22 అని, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతుగా మిత్రులతో కలిసి సత్యాగ్రహం చేశానని వివరించారు. రాబోయే 25 సంవత్సరాలు భారత్, బంగ్లాదేశ్‌కు అత్యంత కీలకమని చెప్పారు. మన వారసత్వాన్నే కాదు అభివృద్ధిని, లక్ష్యాలను, అవకాశాలను కూడా పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో భారత్, బంగ్లాదేశ్‌కు ఒకే తరహా అవకాశాలు ఉన్నట్లే, ఉగ్రవాదం లాంటి ఉపద్రవాలు కూడా పొంచి ఉన్నాయని మోదీ హెచ్చరించారు. వాటిని ఎదిరించడానికి ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ఇండో–బంగ్లా సంబంధాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా 50 మంది బంగ్లాదేశీ పారిశ్రామికవేత్తలను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు. అంతకుముందు భారత్ నుంచి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ‘పొరుగు ప్రథమం’ భేష్ దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి చొరవ తీసుకోవాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రసంగించారు. భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘పొరుగు ప్రథమం’ విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు. బంగ్లాదేశ్‌తోపాటు ఇరుగు పొరుగు దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం సరఫరా చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. ఢాకా–న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరాయని తెలిపారు. బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని ఆయన కుమార్తెలు షేక్ రెహానా, షేక్ హసీనాకు ప్రధాని మోదీ అందజేశారు. ఈ వేడుకల్లో ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళిగా ఖాదీ బట్టతో తయారైన నల్లరంగు ముజీబ్ జాకెట్‌ను మోదీ ధరించారు. ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఢాకాలో అధికార మహాకూటమి నేతలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఆందోళనల్లో నలుగురి మృతి మోదీ రాకను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాలు పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఆందోళన చేపట్టాయి. పొలీసులతో ఘర్షణకు దిగాయి. చిట్టగాంగ్‌లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురు మరణించినట్లు తెలిసింది. అలాగే మరో 12 మంది గాయపడ్డారు. ఢాకాలో జరిగిన ఘర్షణలో 50 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. -
కరోనా తర్వాత తొలిసారి మోదీ విదేశానికి
-
కరోనా తర్వాత తొలిసారి మోదీ విదేశానికి
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభానంతరం తొలిసారి జరిపే విదేశీ పర్యటన స్నేహపూరిత పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు కావడం సంతోషకరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. బంగ్లా పర్యటనలో ఆదేశ ప్రధాని షేక్ హసీనాతో కీలకమైన చర్చలు జరుపుతానన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానిమోదీ నేడు, రేపు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. బంగ్లా నేషనల్‌డే వేడుకలు జరిగే శుక్రవారమే బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమన్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. పర్యటనలో ముజిబుర్ సమాధిని సందర్శిస్తానని ఆయన తెలిపారు. బంగ్లా పర్యటనలో 51 శక్తిపీఠాల్లో ఒకటైన జషోరేశ్వరి కాళి ఆలయాన్ని సైతం మోదీ సందర్శించి పూజలు జరపనున్నారు. బంగ్లాలోని మతువా ప్రజలతో సమావేశమయ్యేందుకు తాను ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు. మతువాలకు ప్రధానమైన ఓర్కండాలో శ్రీహరిచంద్ ఠాకూర్ తన సందేశాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గతేడాది డిసెంబర్లో బంగ్లా ప్రధానితో వీడియో సమావేశం ఫలవంతంగా జరిగిందని, తాజా పర్యటనలో మరింత అర్ధవంతమైన చర్చలుంటాయని ఆయన తెలిపారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తో పాటు ఇతర బంగ్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. -
బంగ్లా పర్యటనలో మోదీకి ముప్పు లేదు
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఈ వారాంతంలో పర్యటించ నున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎలాంటి భద్రతా పరమైన ముప్పు లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని వామపక్ష సంస్థలు, కరడుగట్టిన ఇస్లాం గ్రూపులు మోదీ పర్యటనని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి మోదీ ఈ నెల 26,27న బంగ్లా పర్యటనకు వెళుతున్నారు. దేశ స్వాతంత్య్ర వేడుకలతో పాటు బంగాబంధు షేక్ ముజీబర్ రెహ్మాన్ శతజయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. కరోనా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాక మోదీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ‘‘బంగ్లా పర్యటనకు మోదీని ఆహ్వానించడం మాకు గర్వకారణం. ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఏవో కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ల నిరసనలేవో వాళ్లని చేసుకోనిద్దాం. దానికి ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మొమెన్ విలేకరులతో చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవుల దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. విదేశీ ప్రతినిధులందరి రక్షణ బాధ్యత తమదేనని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని మొమెన్ చెప్పారు. -
కరోనా కలకలం: మోదీ బంగ్లా పర్యటన రద్దు?
ఢాకా : మూడు కరోనా కేసులు నమోదయ్యాయని బంగ్లాదేశ్ ప్రకటించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఢాకా పర్యటనను రద్దు చేసుకోవచ్చని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్ వ్యవస్ధాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 17న ప్రధాని మోదీ ఢాకా పర్యటన ఖరారైంది. కాగా ఇటలీ నుంచి ఢాకాకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. వీరి బంధువైన మరొకరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. బంగ్లాదేశ్‌లోనూ కరోనా వ్యాప్తితో ప్రధాని మోదీ పర్యటన రద్దయ్యే అవకాశం ఉండటంతో ప్రధాని రద్దు చేసుకున్న రెండో విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఇండో-ఈయూ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రసెల్స్ పర్యటన సైతం కరోనా భయాలతో రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బంగ్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటనను రద్దు చేయాలని ప్రధాని షేక్ హసీనాపై ఆందోళనకారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. చదవండి: ప్రధాని సోషల్ ఖాతాలు ఆ ఏడుగురికి -
ఆసీస్ కన్సల్టెంట్‌గా శ్రీరామ్
చెన్నై : భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్ ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్‌గా పనిచేయనున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో శ్రీరామ్ విధులు నిర్వర్తిస్తాడు. ఈ విషయాన్ని సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించనుంది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన సహాయాన్ని తీసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆసీస్ సహాయక సిబ్బందిలో పనిచేయబోతున్న తొలి భారతీయుడు శ్రీరామ్ కావడం విశేషం. గత జూలైలో భారత్‌లో పర్యటించిన ఆసీస్ ‘ఎ’ జట్టుకు తను కన్సల్టెంట్‌గా కీలక సేవలందించాడు. రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌ను ఆ జట్టు 1-0తో దక్కించుకుంది. దీంతో అతడి సేవలను తమ సీనియర్ జట్టుకు వినియోగించుకోవాలని సీఏ భావించింది. -
బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనను దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (61 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బంగ్లాదేశ్ 18.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. డుమి ని, వీస్, రబడ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
ఉగ్రవాదంపై పాక్ న్యూసెన్స్
టైజానికి ఊతమిస్తూ భారత్‌కు సమస్యలు సృష్టిస్తోంది ♦ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ ♦ ఉగ్రవాదంపై కలసి పోరాడుదామని బంగ్లాదేశ్‌కు పిలుపు ♦ తీస్తా నదీ జాలల పంపిణీ సమస్యకు మానవీయ పరిష్కారం ఢాకా: బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ‘న్యూసెన్స్’ చేస్తోందని మండిపడ్డారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. భారత్, బంగ్లాదేశ్‌లు కలసికట్టుగా ఈ ప్రాంతంలోని ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో 90 వేల మంది పాకిస్తానీలు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మాది కూడా రాక్షస ప్రవృత్తే అయితే, వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకునేవారమో!’ అని అన్నారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు. గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్నవారు ఏం సాధించారు?ప్రపంచానికి ఏమిచ్చారు? ఉగ్రవాదానికి విలువలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. దాని లక్ష్యం ఒకటే. అదే మానవత్వంతో శత్రుత్వం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని లేశమాత్రం సహించబోమన్న బంగ్లా ప్రధాని హసీనా ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఢాకా వర్సిటీలోని బంగబంధు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో బంగ్లాదేశ్‌లోని ప్రవాస భారతీయులనుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించడంతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. బంగ్లాదేశ్‌కు మళ్లీ వస్తానంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు. ♦ నా పర్యటనకు ఈ రోజే ముగింపు. కానీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఆసియా దేశాలే కాదు ప్రపంచమంతా ఈ పర్యటనపై పోస్ట్‌మార్టం ప్రారంభిస్తుంది. ♦ భూ సరిహద్దు ఒప్పందం రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే అగ్రిమెంట్.. ♦ ప్రపంచంలోని ప్రతీ ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మొదటి ప్రపంచ యుద్ధంలో 75 వేలమందిని, రెండో ప్రపంచ యుద్ధంలో 90 వేల మందిని భారత్ కోల్పోయింది. ఏ దేశంపైనా ఆక్రమణకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో భారత్‌ది కీలక పాత్ర. అయినా.. భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ♦ బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం భారతీయుల గుండెల్ని ఉప్పొంగేలా చేస్తుంది. ♦ శిశు మరణాల నిరోధంలో భారత్ బంగ్లాదేశ్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ♦ మహిళా సాధికారత విషయంలో బంగ్లాదేశ్ స్ఫూర్తినిస్తుంది. ప్రధాని సహా ముఖ్య నేతలంతా మహిళలే. ♦ మానవీయ విలువల ఆధారంగానే తీస్తా నదీజలాల సమస్యను పరిష్కరిస్తాం. ♦ భారత్, బంగ్లాల అభివృద్ధికి సంబంధించి నాకు ఒకే రకమైన కలలున్నాయి. ♦ త్వరితగతిన ఎల్బీఏ అమలు: చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని (ఎల్బీఏ) క్షేత్ర స్థాయిలో అత్యంత శీఘ్రంగా అమలు చేయాలని భారత్, బంగ్లాలు నిర్ణయించాయి. పౌర అణు విద్యుత్తు, పెట్రోలియం, ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ‘నవతరం.. కొత్త దిశ’ పేరుతో ఒక ప్రకటనను మోదీ, హసీనా ఆదివారం సంయుక్తంగా విడుదల చేశారు. అందులో అంశాలు.. ♦ సరిహద్దు ఒప్పందం ఫలితంగా దేశాలు మారిన ప్రజలకు పూర్తి సహకారం ♦ అణు విద్యుత్‌లో సాంకేతిక సహకారం. ఇంధన రంగంలో సహకారంపై కార్యదర్శుల స్థాయి చర్చలు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య మరో మైత్రి ఎక్స్‌ప్రెస్ ♦ ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరులో పరస్పర సహకారం. మరో దేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు, ఉగ్రవాద శక్తులకు తమ దేశాల్లో తావు లేదని స్పష్టీకరణ ♦ అసాంఘిక శక్తులు సరిహద్దులు దాటకుండా ‘సరిహద్దు సమన్వయ నిర్వహణ ప్రణాళిక’ను అమలు చేయడం.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో జోక్యం! బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ దేశ విపక్ష నేత ఖలీదా జియా మోదీని కోరారు. ఆయనతో అరగంట భేటీ అయిన ఆమె బంగ్లాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. బంగ్లా అధ్యక్షుడు హమీద్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. కాగా, మోదీ బంగ్లా పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. వాజ్‌పేయి తరఫున అవార్డ్ స్వీకరణ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారా’న్ని వాజ్‌పేయి తరఫున భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మోదీకి అందించారు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం బంగ్లాభవన్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సహచరులు, పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. ఢాకేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు భారత ప్రధాని నరేంద్రమోదీ ఢాకాలో ఆదివారం ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయాన్ని, రామకృష్ట మఠాన్ని సందర్శించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులకు పవిత్రమైన దేవాలయాల్లో క్రీ.శ. 12వ శతాబ్దంలో బల్లాల సేనుడు నిర్మించిన ఢాకేశ్వరి ఆలయం ఒకటి. ఈ ప్రాంత ప్రధాన శక్తిపీఠాల్లో ఈ ఆలయాన్ని ఒకటిగా భావిస్తారు. ఈ దేవత పేరుమీదుగానే ఈ నగరానికి ఢాకా అని పేరు వచ్చిందని ప్రతీతి. ఆలయంలో దాదాపు పావుగంట పాటు గడిపిన మోదీ.. ఢాకేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు జరిపారు. రామకృష్ణ మఠ్‌లో అక్కడి స్వాములతో కలిసి మోదీ ప్రార్ధనలు చేశారు. రామకృష్ణ మిషన్‌తో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. -
ఢిల్లీ బయల్దేరిన మోదీ.. ముగిసిన బంగ్లా టూర్
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఆదివారం రాత్రి మోదీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. బంగ్లా పర్యటనలో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్, బంగ్లాల మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారమైంది. మోదీ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. -
ఆయన వచ్చుంటే మరోలా ఉండేది..
ఢాకా: 'ఆయనొక ఆదర్శం. నేనే కాదు.. చాలామంది ఆయనలా ఉండాలని కోరుకుంటారనడంలో సందేహంలేదు. నిజానికి ఆయన ఇక్కడికి వచ్చుంటే.. ఈ వేడుక మరోలా.. మరింత అద్భుతంగా జరిగిఉండేది' అని మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారీ వాజపేయిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వాజపేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పురస్కారం 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్' అవార్డును ఆయన తరఫున మోదీ స్వీకరించారు. బంగ్లా అధ్యక్ష నివాసం 'బంగబందు భవన్'లో ఆదివారం కన్నుల పవండువగా జరిగింది. బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ 'లిబరేషన్ వార్' అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షేక్ హసీనాతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంట విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్. జయశంకర్ కూడా ఉన్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఢాకాలో నూతనంగా నిర్మించిన భారతీయ హై కమిషనర్ కార్యాలయంతోపాటు భారత్ ఆర్థిక సహాయంతో చేపట్టిన ఆరు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇండియా- బంగ్లాదేశ్ మైత్రి గర్ల్స్ హాస్టల్, విక్టోరియా కాలేజ్, అంధ విద్యార్థుల కోసం భవంతి నిర్మాణం, పునరావాస కేంద్రం, మురుగు శుద్ధి కేంద్రం తదితరాలు భారత సహాయంతో నెలకొల్పినవే కావడం విశేషం. ఉదయం ఢాకేశ్వరీ ఆలయాన్ని సందర్శించి రెండోరోజు పర్యటనను ప్రారంభించిన మోదీ.. రామకృష్ణ మఠానికి కూడా వెళ్లి ప్రధాన గురువులతో భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియాతోనూ ఆయన సమావేశమవుతారు. -
ఢాకేశ్వరీ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
ఢాకా నగరంలోని ప్రసిద్ధ ఢాకేశ్వరీ ఆలయ సందర్శనతో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో తన రెండో రోజు పర్యటనను ప్రారంభించారు. ఆదివారం ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఢాకేశ్వరీ మాతకు మోదీ పూజలు నిర్వహించారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆలయంలో గడిపిన ఆయనను నిర్వాహకులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఢాకా నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఈ ఆలయమేనని స్థానికులు చెబుతారు. 'ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ శ్రీశ్రీ ఢాకేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. అనంతరం మోడీ.. ఢాకాలోని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, నిర్వాహకులతో ముచ్చటించారు. సాధువులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. నివారం బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో పలు కీలక చర్చలు జరిపిన మోదీ.. ఆదివారం బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నేత ఖలీదా జియాలతోనూ మాట్లాడతారు. పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలతోనూ మోదీ సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ.. శనివారం ఢిల్లీ నుంచి ఢాకాకు బయలుదేరిన సంగతి తెలిసిందే. -
బంగ్లా పర్యటనకు లోకేశ్ దూరం
కోల్‌కతా : బంగ్లాదేశ్ పర్యటనకు భారత యువ క్రికెటర్ లోకేష్ రాహుల్ దూరమయ్యాడు. అతడు ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతుండగా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో తను జట్టుతో పాటు వెళ్లడం లేదని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈనెల 10 నుంచి జరిగే టెస్టు జట్టుకు అతడు ఎంపికయ్యాడు. తన స్థానంలో ఎవరిని తీసుకునేది ఇంకా ప్రకటించలేదు. ఆసీస్ పర్యటనలో 23 ఏళ్ల రాహుల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. -
బంగ్లా పర్యటన తర్వాతే స్పష్టత
టీమ్ డెరైక్టర్ పదవిపై రవిశాస్త్రి న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుతో తన కొనసాగింపుపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికైతే నేను జట్టుతో పాటే ఉన్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది బోర్డుతో సమావేశమై చర్చించాక తెలుస్తుంది. ఇప్పుడు ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా దృష్టంతా బంగ్లా పర్యటన మీదే ఉంది. కోహ్లి నా గురించి మాట్లాడిన విధానం బాగుంది. విరాట్ ఏదైనా సూటిగానే మాట్లాడుతాడు. జట్టులోని ఆటగాళ్లంతా నిజాయితీగా ఉంటారు. 35 ఏళ్ల నుంచి బోర్డుతో అనుబంధం కొనసాగుతోంది. ఈ కాలంలో చాలామంది అధ్యక్షులు మారారు. నేనందరితోనూ బాగానే ఉన్నాను’ అని రవిశాస్త్రి అన్నారు. -
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన భారత్
కోల్‌కతా : బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న శిక్షణా శిబిరంలో తొలి రోజు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో... 14 మందితో కూడిన టెస్టు బృందం తమ ఫిట్నెస్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంది. దీనికోసం సాయంత్రం 4.45 గంటలకు మైదానంలో ప్రవేశించిన ఆటగాళ్లు రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేశారు. హర్భజన్, ఇషాంత్, కోహ్లి తదితరులు 20మీ. దూరం వేగంగా రన్నింగ్ చేశారు. శనివారం తన 27వ పుట్టిన రోజు జరుపుకున్న రహానే సహచరుల మధ్య కేక్ కట్ చేశాడు. -
బంగ్లా సిరీస్ కి రాహుల్ దూరం
కోల్‌కతా: బంగ్లాదేశ్ పర్యటనకు భారత టెస్టు ఆటగాడు కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. భారత్ ఈ నెల 10-14 తేదీల మధ్య బంగ్లాతో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. అయితే డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉండటంలేదని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. రాహుల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని, త్వరగానే కోలుకుంటున్నాడని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాహుల్, సిడ్నీలో జరిగిన రెండో మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ సారధ్యంలోని టెస్టు జట్టు సోమవారం ఢాకా వెళ్లనుందని ఠాకూర్ తెలిపాడు. జూన్ 10 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్, జూన్ 18న మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
ఆ దృశ్యం ఫీనిక్స్ పక్షిని గుర్తుచేస్తుంది..
ఢాకా : బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో అసువులు బాసిన అమరులను తలుచుకున్నపుడు.. తన పూర్వీకుల చితాభస్మం నుంచి కొత్త జీవితాన్ని పొందే కాల్పనిక పక్షి ఫీనిక్స్ గుర్తుకొస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢాకా సమీపంలోని జాతీయ అమర వీరుల స్థూపాన్ని సందర్శనతో ఆయన తన రెండురోజుల బంగ్లాదేశ్ పర్యటను ప్రారంభించారు. 1971 బాంగ్లా విముక్తి పోరాటంలో అమరులైనవారికి పూల మాలలతో ఘన నివాళులు అర్పించిన మోదీ.. స్థూపం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఏడు మెట్లు వాటిపైన ఏడు త్రికోణాల ఆకృతిలో ఉండే బంగ్లా జాతీయ అమరవీరుల స్థూపం విశేషాలను ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఆ తరువాత బాంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబ్ ఉర్ రహమాన్ స్మారక మ్యూజియాన్ని మోదీ సందర్శించారు. ముజీబ్ కు సంబంధించిన వస్తువులను తీక్షణంగా పరిశీలించారు. అంతకుముందు తొలిసారిగా బాంగ్లా పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ ను పక్కనపెట్టి బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో బంగ్లాతో సరిహద్దు ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బంగ్లా ప్రధాని హసీనాతో మోదీ చర్చిస్తారు. ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పలువురు ఉన్నతాధికారులు కూడా బంగ్లా పర్యనలో పాల్గొంటున్నారు. -
బంగ్లాదేశ్‌కు పయనమైన మోదీ
న్యూఢిల్లీ: రెండురోజుల చారిత్రక పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్ కు పయనమయ్యారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రాజ్ దూత్ విమానంలో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. 'ఇప్పుడే బంగ్లాదేశ్‌కు బయలుదేరా. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రెండు రోజుల పర్యటనలో బంగ్లాతో సరిహద్దు ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బంగ్లా ప్రధాని హసీనాతో చర్చల్లో మోదీ పాల్గొంటారు. ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బంగ్లా పర్యనలో పాల్గొంటున్నారు. మోదీ కంటే ఒకరోజు ముందే మమత ఢాకా చేరుకున్నారు.