
బంగ్లా టూర్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
ముంబై : ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సందీప్ పాటిల్ నేతృత్వంలో సెలక్టర్లు బుధవారం సమావేశమై వన్డే, టెస్టు మ్యాచ్ లకు ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. జూన్ 10 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్ 18న మొదలవుతుంది. బంగ్లాదేశ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ భారత సీనియర్లకు విశ్రాంతి ఇవ్వలేదు. ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. బీసీసీఐ ఎంపిక చేసిన ఆటగాళ్ల వివరాలు..
వన్డే జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్టూవర్ట్ బిన్నీ, దవళ్ కులకర్ణి
టెస్టు జట్టు: మురళీ విజయ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, హర్బజన్ సింగ్, భువనేశ్వర్, కరణ్ శర్మ, వరుణ్ అరోణ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్