న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా బంగ్లా గడ్డపై అడుగుపెట్టనుంది. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2015లో ఆ దేశంలో పర్యటించింది. రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వచ్చే ఏడాది(2022) నవంబర్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ద్వైపాక్షిక సిరీస్‌లను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన సన్నాహకాల్లో ఉన్న బిజీగా ఉన్న భారత్.. రానున్న రెండేళ్ల కాలంలో ఊపిరి సడలని షెడ్యూల్‌ను కలిగివుంది.
ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే, ఈ ఏడాది ఆఖర్లో టీ20 ప్రపంచ కప్, ఆ తరువాత జనవరిలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్(3 వన్డేలు, 3 టీ20లు), ఆ వెంటనే శ్రీలంక బృందం భారత పర్యటన(3 టెస్టులు, 3 వన్డేలు), ఆతర్వాత జూన్, జులైలలో ఇంగ్లండ్ పర్యటన(3 వన్డేలు, 3 టీ20లు), అక్కడి నుంచి నేరుగా వెస్టిండీస్ పర్యటన(3 వన్డేలు, 3 టీ20లు), ఆతర్వాత ఆసియా కప్, ఆ వెంటనే సెప్టెంబర్, నవంబర్‌లలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్(4 టెస్టులు, 3 వన్డేలు) .. ఇలా దాదాపు ఏడాదంతా బీజీబిజీగా గడుపనుంది.
చదవండి: బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
Comments
Please login to add a commentAdd a comment