
ఎట్టకేలకు కివీస్ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లలో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన న్యూజిలాండ్... ఎట్టకేలకు ఓ విజయంతో సిరీస్‌ను ముగించింది. షేరే బంగ్లా స్టేడియంలో బుధవారం జరిగిన ఏకైక టి20లో కివీస్ జట్టు 15 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 204 పరుగులు చేసింది. కొలిన్ మున్రో (39 బంతుల్లో 73 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), డివిచ్ (31 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ముష్ఫీకర్ రహీమ్ (50) టాప్ స్కోరర్. మహ్మదుల్లా (34), నాసిర్ హుస్సేన్ (28), గాజి (24) రాణించినా ప్రయోజనం లేకపోయింది. సౌతీ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు. మున్రోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.