
చెలరేగిన స్మిత్
సిడ్నీ:తన కెరీర్లో 88వ వన్డే ఆడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అత్యధిక స్కోరు సాధించాడు. న్యూజిలాండ్తో ఇక్కడ జరుగుతున్న వన్డేలో స్మిత్(164;157 బంతుల్లో 14 ఫోర్లు,4 సిక్సర్లు)తో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక స్కోరును సాధించాడు. అంతకుముందు స్మిత్ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు 149. ఈ ఏడాది వాకాలో భారత్ తో జరిగిన వన్డేలో స్మిత్ ఈ భారీ సెంచరీ సాధించాడు. తాజాగా మరో భారీ సెంచరీ సాధించి తన వన్డే అత్యధిక వ్యక్తిగత స్కోరును సవరించుకున్నాడు.
ఈ మ్యాచ్లో స్మిత్ దూకుడుగా ఆడటంతో ఆస్ట్రేలియా 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. స్మిత్ ఆదుకున్నాడు.ఐదో వికెట్ కు ట్రావిస్ హెడ్ తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హెడ్(52;60 బంతుల్లో5ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.ఆ తరువాత వేడ్(38) ఫర్వాలేదనిపించడంతో ఆస్ట్రేలియా 50.0ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.