Happy New Year 2025: పాత ఒక రోత.. కొత్త ఒక వింత అంటే బాగోదేమో.. కానీ పాత జ్ఞాపకాలని మదిలో దాచుకుంటూ కొత్త ఆశల్ని భుజానకెత్తుకోవడం అంటే సరిగ్గా సరిపోతుంది కదా. మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతోంది.
అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి.
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్‌లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్‌కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.
🎆✨ Happy New Year 2025! ✨🎆
The first to welcome 2025: 🎉
Christmas Island, Kiribati: 5 AM EST (3:30 PM IST)
Chatham Islands, NZ: 5:15 AM EST (3:45 PM IST)
Auckland & Wellington, NZ: 6 AM EST (4:30 PM IST)
The countdown begins! 🌍#HappyNewYear #HappyNewYear2025 pic.twitter.com/RRqFy7PgT8— Shahadat Hossain (@shsajib) December 31, 2024
భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉంది.
భారత్‌లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..
కిరిబాటి(8.30 am on Jan 1)
సమోవా, టోంగా((7.30 am on Jan 1)
న్యూజిలాండ్((7.30 am on January 1)
రష్యా, ఫిజి((6.30 am on January 1)
ఆస్ట్రేలియా((5.30 am on January 1)
పాపువా న్యూగినియా((4.30 am on January 1)
ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)
చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)
వియాత్నాం, థాయ్‌లాండ్( 1.30 am on January 1)
మయన్మార్(1 am on January 1)
బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)
నేపాల్(12.15 am on January 1)
Comments
Please login to add a commentAdd a comment