Ghost Shark: కొత్త దెయ్యం షార్క్‌ దొరికింది | New Zealand Scientists Discover New 'Ghost Shark' Species In Ocean Waters Near Australia And New Zealand | Sakshi
Sakshi News home page

Ghost Shark: కొత్త దెయ్యం షార్క్‌ దొరికింది

Published Wed, Sep 25 2024 9:38 AM | Last Updated on Wed, Sep 25 2024 10:10 AM

New Zealand scientists discover new 'ghost shark' species

అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు 

విల్లింగ్టన్‌: పసిఫిక్‌ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్‌ షార్క్‌’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్‌ షార్క్‌లను స్పూక్‌ షిఫ్‌ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. 

న్యూజిలాండ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ అటా్మస్ఫిరికల్‌ రీసెర్చ్‌ బృందం ఈ చేప జాతిని కనుగొంది. న్యూజిలాండ్‌కు తూర్పున ఉన్న ఛాథమ్‌ రైస్‌ అనే సముద్రజలాల ప్రాంతంలో ఈ చేపలు జీవిస్తున్నాయి. ఉపరితలం నుంచి దాదాపు 2,600 మీటర్లలోతు మాత్రమే సంచరిస్తుంటాయి. మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. ‘‘లాటిన్‌లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం.  అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement