ముంబై: త్వరలో జరిగే బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియాను బుధవారం ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటి ఇక్కడ సమావేశమై జట్టును ఎంపిక చేయనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
బంగ్లా పర్యటనలో భారత్ ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 10-14 వరకు టెస్టు మ్యాచ్ జరగనుంది. జూన్ 18 న ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టెస్టు సిరీస్కు కోహ్లీ సారథ్యంలో జట్టును ఎంపిక చేయనున్నారు. కొత్త ముఖాలకు చోటు కల్పించే అవకాశముంది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కెప్టెన్ ధోనీ టెస్టులకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. బంగ్లాతో్ వన్డే సిరీస్కు ధోనీ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయం తెలియరాలేదు.
బంగ్లా టూర్కు రేపే టీమిండియా ఎంపిక
Published Tue, May 19 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement