బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం | South Africa's victory over Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Published Sun, Jul 5 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

South Africa's victory over Bangladesh

మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనను దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (61 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బంగ్లాదేశ్ 18.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. డుమి ని, వీస్, రబడ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement