కోల్‌కతా : బంగ్లాదేశ్ పర్యటనకు భారత యువ క్రికెటర్ లోకేష్ రాహుల్ దూరమయ్యాడు. అతడు ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతుండగా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో తను జట్టుతో పాటు వెళ్లడం లేదని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈనెల 10 నుంచి జరిగే టెస్టు జట్టుకు అతడు ఎంపికయ్యాడు. తన స్థానంలో ఎవరిని తీసుకునేది ఇంకా ప్రకటించలేదు. ఆసీస్ పర్యటనలో 23 ఏళ్ల రాహుల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.