ఢిల్లీ: లోక్‌సభలో కులగణనపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇతరు కులాన్ని ఎలా అడుగుతారు? అని మండిపడ్డారు. కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని విమర్శలు చేశారు.
తాజాగా అఖిలేష్ యాదవ్ విమర్శలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టతారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా గతంలో అఖిలేష్ మాట్లాడిన రెండు వీడియోలు పోస్ట్ చేసి విమర్శలు చేశారు. రెండు వీడియోల్లో ఒకటి.. ఓ జర్నలిస్ట్‌ను అఖిలేష్.. అతని కులం ఏంటి? అని అడుగుతారు. మరో వీడియోలో లోక్‌సభలో కులం అంశంపై ప్రసంగిస్తారు. ఈ వీడియోలకు మీరు(అఖిలేష్ యాదవ్) ఎలా కులం గురించి అడుగుతారు? అని అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు.
जाति कैसे पूछ ली अखिलेश जी ? pic.twitter.com/uaFujlDWrD
— Anurag Thakur (@ianuragthakur) July 31, 2024
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బుధవారం సైతం లోక్‌సభలో గందరగోళం చోటు చేసుకుంది. అనురాగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నినాదాలు చేశారు.
మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’వ్యాఖ్యలను మంగళవారం ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు.. రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment