న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కే సురేష్‌పై ఓం బిర్లా అత్యధిక ఓటింగ్ సాధింగా వరుసగా రెండోసారి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత సమావేశాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ స్పీకర్‌కు చురకలంటించారు.
గతంలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎంపీల సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు కొత్త లోక్‌సభలో జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ప్రజాప్రతినిధి గొంతు అణచివేయడం, బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేము ఆశిస్తున్నాము. మీ నియంత్రణ కేవలం ప్రతిపక్షంపైనే ఉంది, కానీ అది కూడా అధికార వర్గం వైపు కూడా ఉండాలి' అని అన్నారు.
కాగా గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. టీఎంసీ మహువా మొయిత్రా కూడా నైతిక దుష్ప్రవర్తన కారణంగా బహిష్కరణకు గురరయ్యారు.
స్పీకర్ ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. నిష్పాక్షకతంగా ఉండటం అనేది ఈ పదవికి గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.సభ మీ సంకేతాలపై పనిచేయాలని కానీ ఇతర మార్గాల్లో కాదని అన్నారు. స్పీకర్ తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు తాము కట్టుబడి నిలబడతామని అన్నారు. ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా స్పీకర్ ఇక్కడ కూర్చున్నారని, పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment