ఢిల్లీ: ప్రతిపక్షనేతలపై మంత్రులు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విసయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంత్రుల పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్‌నీత్ సింగ్ బిట్టు అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపు దోరణితో వ్యహరించారని ఆరోపణలు చేశారు. ఈవిషయంలో లోక్‌సభ స్పీకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పార్లమెంట్ సభ్యులపై చేస్తున్న పలు అభ్యంతరకమైన సేట్‌మెట్లు చేసస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘ ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లోని ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచుగా అధికార మంత్రులే ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అన్‌పార్లమెంటరీ, అభ్యంతరకర, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కాని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై జూలై 26న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. జూలై 25న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు అన్ పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే సభలో మతపరమైన భాష ఉపయోగిస్తూవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ సంఘటనలు జరిగినప్పుడు తన సభ్యులను అదుపు చేయలేదు అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment