Gaurav Gogoi
-
స్పీకర్‌కు లేఖ.. ప్రతిపక్ష ఎంపీలపై బెదిరింపు వ్యాఖ్యలు: గౌరవ్ గోగొయ్
ఢిల్లీ: ప్రతిపక్షనేతలపై మంత్రులు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విసయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంత్రుల పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్నీత్ సింగ్ బిట్టు అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపు దోరణితో వ్యహరించారని ఆరోపణలు చేశారు. ఈవిషయంలో లోక్‌సభ స్పీకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పార్లమెంట్ సభ్యులపై చేస్తున్న పలు అభ్యంతరకమైన సేట్మెట్లు చేసస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.‘ ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లోని ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచుగా అధికార మంత్రులే ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అన్‌పార్లమెంటరీ, అభ్యంతరకర, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కాని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై జూలై 26న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. జూలై 25న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు అన్ పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే సభలో మతపరమైన భాష ఉపయోగిస్తూవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ సంఘటనలు జరిగినప్పుడు తన సభ్యులను అదుపు చేయలేదు అని లేఖలో పేర్కొన్నారు. -
అసోం సీఎం భార్య పై ఆరోపణలు..పరువు నష్టం దావా
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ ఏకంగా రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె గొగోయ్‌కు నోటీసులు పంపారు. కామ్రూప్ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం కేసు దాఖలు చేశామని, ఇది సెప్టెంబర్ 26న విచారణకు రానుందని భుయాన్ తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా చెబుతున్నారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా పలు ట్వీట్ల ద్వారా గౌరవ్ గొగోయ్ తన క్లయింట్ రినికి భుయాన్ శర్మకు నష్టం కలిగించారని, అందుకే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా, ఓ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. అయితే.. తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 -
భార్యపై ఆరోపణలు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: అస్సాం సీఎం
గువాహతి: తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘నా భార్య కానీ, ఆమెతో అనుబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు పొందలేదని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యాలను చూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా ఏ శిక్షనైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ చేసిన పోస్ట్‌కు సమాధానంగా ట్వీట్ చేశారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 అయితే లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, హిమంత బిస్వాశర్మ మధ్య ట్విటర్లో మాటల యుద్ధం నడుస్తోంది. అస్సాం బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానాన్ని గొగోయ్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. Please do not lecture me on what to do. Whether I decide to go to the assembly or a court of law against you, I will make that decision myself. https://t.co/38OAG2xy6T — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 ముఖ్యమంత్రి శర్మ తన పరపతిని ఉపయోగించి ఆయన భార్య నడుపుతున్న సంస్థకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కింద రూ.10 కోట్లు ఇప్పించారంటూ గొగోయ్ సంచలన ఆరోపణ చేయడంతో ఈ ఇద్దరు అసోం నేతల మధ్య వివాదం రాజుకుంది. పీఎం కిసాన్ యోజన కింద అస్సాం సీఎం భార్యకు రూ.10 కోట్ల రాయితీ అందినట్లు గొగోయ్ ఆరోపణలు చేశారు.సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో దయచేసి అస్సాం అసెంబ్లీకి హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని గొగోయ్ కోరారు. KMSY గురించి చర్చించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాన్ని సమర్పించారని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. గొగోయ్ ఆరోపణలను శర్మ ఖండించారు. ఏం చేయాలో తనకు ఉపన్యాయం ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిపై అసెంబ్లీకి, న్యాయస్థానానికి వెళ్లాలో తానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. Please do not change the goal post now. Yes, all family members of BJP politicians have the right to run their own companies and seek government subsidies if they are entitled to them. This is true for everyone. However, I would like to clarify that in this particular case, my… https://t.co/4GW6NonRSN — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 శర్మ ట్వీట్‌కు గొగోయ్ వెంటనే స్పందించారు. ''మరీ అంత ఉద్రేకం తెచ్చుకోకండి. అసెంబ్లీకి మీరు రావాలని విపక్ష ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను మీకు పంపుతున్నాను. కోర్టుకు మీరు వెళ్తే నేను సంతోషిస్తాను. అప్పుడు అన్ని డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తాయి'' అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు. Yes, I am agitated. There have been numerous reasons for my anger against your family since 2010. I am confident that we will meet in court, and once again, I will be able to prove my point. I have successfully done so in 2016 and 2021, and I am determined to do it again, both… https://t.co/pM0Kz8Eqw1 — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 దీనిపై హిమంత శర్మ స్పందిస్తూ.. "అవును, నేను చాలా ఆగ్రహంతో ఉన్నాను. 2010 నుంచి మీ కుటుంబంపై అనేక కారణాల వల్ల ఆగ్రహంతో ఉన్నాను. మనం కోర్టులోనే మరోసారి కలవబోతున్నాం. నా వాదనను నేను నిరూపించుకుంటాను. 2016, 2021లో కూడా విజయవంతంగా నా వాదన వినిపించాను. మరోసారి అదే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇద్దరం ఇటు ప్రజాకోర్టులోనూ, అటు న్యాయస్థానంలోనూ కలుద్దాం'' అని శర్మ ట్వీట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేస్తున్నారా? గోయల్ శర్మ తన భార్యకు మంజూరు చేయడాన్ని ఆమోదించారు. కానీ నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఇంకా ఎంత మంది బీజేపీ రాజకీయ నాయకులు తమ కుటుంబాలను సుసంపన్నం చేసేందుకు పీఎంకేఎస్‌వై పథకాన్ని ఉపయోగించుకున్నారు? అని గౌరవ్ గొగోయ్ అన్నారు. వెబ్సైట్ పేర్కొన్నది. ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. -
‘మోదీ ఏమైనా స్పెషలా.. మన్మోహన్, వాజ్‌పేయి చేశారుగా..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్ అంశంపై గొగొయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాగా, లోక్‌సభలో గౌగవ్ గగొయ్ మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే, ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు. మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామని, మణిపూర్‌కు కచ్చితంగా న్యాయం జరగాలన్నారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అసోం రైఫిల్స్ మణిపూర్ పోలీసులు కొట్టుకున్నారు. ఇదేనా నవభారతం అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది చురకలు అంటించారు. వాజ్‌పేయి, మన్మోహన్ వెళ్లారుగా.. ఇదే సమయంలో పార్లమెంట్లో మాట్లాడరాదు అని ప్రధాని మోదీ మౌనవ్రతం చేపట్టారు. ఆయన మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానాన్ని తీసుకువచ్చామన్నారు. ఆయన్ను మూడు ప్రశ్నలు అడగాలని ఉందని, ఇప్పటి వరకు ఆయన ఎందుకు మణిపూర్‌ను విజిట్ చేయలేదని, 80 రోజుల తర్వాత ఆ అంశంపై కేవలం 30 సెకన్లు మాట్లాడారని, ఎందుకు ఆయన ఇంత సమయాన్ని తీసుకున్నారని, మణిపూర్ సీఎంను ఎందుకు ఇంత వరకు తొలగించలేదని గౌరవ్ గగోయ్ ప్రశ్నించారు. అలాగే, కోక్రాఝర్‌లో హింస జరిగినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసోంకు వెళ్లారు. ఇక, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయూ కూడా అక్కడికి వెళ్లారని గుర్తు చేశారు. మణిపూర్‌లో హింస జరుగుతుంటే ఇండియా కూటమిని తిట్టడంపైనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారని విమర్శించారు. మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. When i talked about PM, CM & Home Minister no one had problems but, when i talked about ADANI, why BJP MPs stood in anger? -Gaurav Gogoi schooling BJP🔥 pic.twitter.com/yUvkzSPCal — Amock (@Politics_2022_) August 8, 2023 సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా? పలు సందర్భాల్లో మోదీ మౌనంపై గగొయ్ విరుచుకుపడ్డారు. చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. బాలీలో జిన్‌పనింగ్, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది. చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే అని అన్నారు. తన తప్పును దేశ ప్రజల ముందు మోదీ ఒప్పుకోవడం లేదని అన్నారు. ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుందన్నారు. మణిపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది. అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్ఐఆర్లు నమోదయినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. మణిపూర్ అంతా బాగుందని మీరు అంటున్నారు. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా? అని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారని స్పష్టం చేశారు. #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY — ANI (@ANI) August 8, 2023 ఇది కూడా చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. మోదీపై కాంగ్రెస్ నిప్పులు -
మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
-
యువతను విస్మరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశం యంగ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ.. భారత్‌లో యువత సమస్యలను అర్థం చేసుకోవడంలో ఎంపీ లు, విధాన రూపకర్తలు విఫలమయ్యారు. ఈ పరిస్థి తి మారి యువత రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలం గాణ జాగృతి అంతర్జాతీయ యువ సదస్సు (టీజేఐ వైసీ)లో వక్తలు అభిప్రాయపడ్డారు. హైటెక్‌సిటీ నోవాటెల్ హోటల్లో శనివారం ‘వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్మెంట్’ పేరుతో జరిగిన చర్చాగోష్టిలో.. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (టీఆర్ఎస్), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్లతోపాటు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొన్నారు. భారత్‌లో మధ్యవయస్కు లు, అంతకన్నా పెద్ద వయసున్న వారే ఎక్కువ సంఖ్యలో పార్లమెంటుకు ఎంపికవుతున్నందునే.. యువత సమస్యలను అర్థం చేసుకోవడం లేదని సీని యర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా అన్నారు. దీన్ని ఒవైసీ సమర్థిస్తూ.. పార్లమెంటులో ఎంపీల వయసుకు సబంధించిన గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 55ఏళ్లుగా ఉందని.. 40ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు 13% కంటే తక్కువగా ఉన్నారని ఒవైసీ వివరించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండటం, గత కొన్నేళ్లలోనే ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం వంటివన్నీ దేశ పార్లమెంటరీ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మారి యువతకు రాజకీయరంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఒవైసీ ఆకాంక్షించారు. బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. యూకేలో యువత సమస్యలు భారత్‌తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మానసిక సమస్యలు, ఆత్మహత్యలపై అక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాలపై దృష్టిపెట్టి పరిష్కారిస్తున్నాయని వివరించారు. దేశమంతా ఒక్కటేనని గుర్తిస్తే.. జనాభా నియంత్రణ పథకాలు సమర్థవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో వాటా తక్కువగా ఉండటంపై కవిత మాట్లాడారు. ఈ విషయంలో దేశమంతా ఒక్కటేనని అందరూ గుర్తించాలని.. రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. పేదరి కం, ఉపాధి కల్పన వంటి చాలా అంశాలు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే తీరుగా ఉంటాయని.. ఈ అంశాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిధు ల పంపిణీ చేయడం తప్పేమీ కాదన్నారు. అయితే.. మిగిలిన అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరంపైనా చర్చ జరగాలని ఆమె పేర్కొన్నారు. అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సరళీకరణలకు పాతికేళ్లు దాటినా.. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మాత్రం రెండు దశాబ్దాలు వెనుకబడే ఉందన్నారు. ఇందుకు కారణాలేమైనా.. దీని ప్రభావం మాత్రం యువతపై స్పష్టంగా కనబడుతోందన్నారు. తండ్రు లు రాజకీయాల్లో ఉండటం తమకు కొంతవరకు కలి సొచ్చినా.. దీర్ఘకాలం ఈ రంగంలో కొనసాగేందుకు మాత్రం కష్టపడాల్సిందేనని గౌరవ్, అసదుద్దీన్, కవిత స్పష్టం చేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: ఒవైసీ ఎవరెన్ని చెప్పినా కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఒవైసీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు, యువకులు భారతీయులే అనడంలో సందేహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటూ అందరూ ప్రకటనలు చేస్తారు. తీరా పరిస్థితులు చక్కబడగానే కశ్మీర్లో చేయాల్సిన అభివృద్ధిని మరిచి పోతున్నారు’అంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఈ వివాదంపై కేంద్రానికి ఓ స్థిరమైన విధానం లేదని.. నాలుగున్నరేళ్లలో కశ్మీరీ పండిట్ల కోసం గానీ.. అక్కడి యువత కోసం గానీ.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఒవైసీ ఆరోపించారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అక్కడి యువతలో ఉందన్నారు. అయితే కశ్మీర్ సమస్య సినిమాల్లాగా యుద్ధం చేసి పరిష్కరించేది కాదని.. ఇరువర్గాల్లో ఒకరు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. -
అవినీతికి వ్యతిరేకంగా అసహనం ఏదీ?
న్యూఢిల్లీ: ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆజాద్ పై కమలం వేటు వేయడాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, అవినీతిపరులను కాపాడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. యాంటి కరెప్షన్ కాస్తా యాంటి బీజేపీగా మారిందని... ఇప్పుడు ప్రధాని మోదీ కొత్త నినాదం ఇదేనని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాలా ట్విటర్ లో పేర్కొన్నారు. వ్యాపం, లలిత్ మోదీ, పీడీఎస్ కుంభకోణాల్లో నిందితులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడారని, డీడీసీఏ స్కామ్ లో ఇరుక్కున్న వారిని కూడా ఇప్పుడు రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా అసహనం ఎక్కడా అని ట్విటర్ లో ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకా లేదా అవినీతిని బయటపెట్టినందుకు ఆజాద్ పై చర్య తీసుకున్నారా అని యూత్ కాంగ్రెస్ ట్విటర్ లో ప్రశ్నించింది. అవినీతిని బయటపెడితే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని ఈ చర్యతో బీజేపీ హెచ్చరించిందని పేర్కొంది. ఎవరైనా అవినీతి గురించి వెల్లడిస్తే ఎలాంటి చర్య తీసుకోవాలో ఆజాద్ పై వేటు ద్వారా తమ పార్టీ ముఖ్యమంత్రులకు బీజేపీ సందేశమిచ్చిందని ఎద్దేవా చేసింది. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని ఆరోపణలు చేసిన కీర్తి ఆజాద్ ను బీజేపీ బుధవారం సస్పెండ్ చేసింది. Where is zero tolerance against corruption? PM Modi protecting the accused - first Vyapam-Lalit Modi-PDS scam. Now DDCA scam #KirtiAzad — Gaurav Gogoi (@GauravGogoiAsm) December 23, 2015 There is no democracy in BJP. Honest voices are muzzled to protect corruption — Arvind Kejriwal (@ArvindKejriwal) December 23, 2015 -
10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ న్యూట్రాలిటీ గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కు లేఖలు రాసిన 10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. జీవో అవర్ లో ఆయన ఈ అంశాన్ని వారు లేవనెత్తారు. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం పోరాడుతున్న వారి ఈ-మెయిల్ ఐడీలు ట్రాయ్ వెబ్ సైట్లో పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం చేయడం వల్ల వారు హాకర్స్ బారిన పడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.