న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్ అంశంపై గొగొయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
కాగా, లోక్‌సభలో గౌగవ్ గగొయ్ మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే, ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు. మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామని, మణిపూర్‌కు కచ్చితంగా న్యాయం జరగాలన్నారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అసోం రైఫిల్స్ మణిపూర్ పోలీసులు కొట్టుకున్నారు. ఇదేనా నవభారతం అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది చురకలు అంటించారు.
వాజ్‌పేయి, మన్మోహన్ వెళ్లారుగా..
ఇదే సమయంలో పార్లమెంట్‌లో మాట్లాడరాదు అని ప్రధాని మోదీ మౌనవ్రతం చేపట్టారు. ఆయన మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానాన్ని తీసుకువచ్చామన్నారు. ఆయన్ను మూడు ప్రశ్నలు అడగాలని ఉందని, ఇప్పటి వరకు ఆయన ఎందుకు మణిపూర్‌ను విజిట్ చేయలేదని, 80 రోజుల తర్వాత ఆ అంశంపై కేవలం 30 సెకన్లు మాట్లాడారని, ఎందుకు ఆయన ఇంత సమయాన్ని తీసుకున్నారని, మణిపూర్ సీఎంను ఎందుకు ఇంత వరకు తొలగించలేదని గౌరవ్ గగోయ్ ప్రశ్నించారు. అలాగే, కోక్రాఝర్‌లో హింస జరిగినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసోంకు వెళ్లారు. ఇక, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయూ కూడా అక్కడికి వెళ్లారని గుర్తు చేశారు. మణిపూర్‌లో హింస జరుగుతుంటే ఇండియా కూటమిని తిట్టడంపైనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారని విమర్శించారు. మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
When i talked about PM, CM & Home Minister no one had problems but,
— Amock (@Politics_2022_) August 8, 2023
when i talked about ADANI, why BJP MPs stood in anger?
-Gaurav Gogoi schooling BJP🔥 pic.twitter.com/yUvkzSPCal
సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా?
పలు సందర్భాల్లో మోదీ మౌనంపై గగొయ్ విరుచుకుపడ్డారు. చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. బాలీలో జిన్‌పనింగ్, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది. చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే అని అన్నారు. తన తప్పును దేశ ప్రజల ముందు మోదీ ఒప్పుకోవడం లేదని అన్నారు.
ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుందన్నారు. మణిపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది. అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. మణిపూర్ అంతా బాగుందని మీరు అంటున్నారు. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా? అని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారని స్పష్టం చేశారు.
#WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY
— ANI (@ANI) August 8, 2023
ఇది కూడా చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. మోదీపై కాంగ్రెస్ నిప్పులు
Comments
Please login to add a commentAdd a comment