10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ న్యూట్రాలిటీ గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కు లేఖలు రాసిన 10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. జీవో అవర్ లో ఆయన ఈ అంశాన్ని వారు లేవనెత్తారు.
ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం పోరాడుతున్న వారి ఈ-మెయిల్ ఐడీలు ట్రాయ్ వెబ్ సైట్లో పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం చేయడం వల్ల వారు హాకర్స్ బారిన పడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.