net neutrality
-
నెట్ న్యూట్రాలిటీకి అమెరికా గుడ్ బై!
వాషింగ్టన్: గత ప్రభుత్వాల నిర్ణయాలను తోసిపుచ్చుతూ అందుకు విరుద్ధంగా వరుస నిర్ణయాలను తీసుకుంటున్న ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలో నెట్ న్యూట్రాలిటీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేసింది. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా ఓటేసింది. అమెరికాలోని ఏటీఅండ్‌టీ, కామ్‌కాస్ట్, వెరిజాన్లాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల(ఐఎస్పీ)కు దక్కిన ఘన విజయంగా దీనిని అభివర్ణిస్తున్నారు. కాగా.. నెట్ న్యూట్రాలిటీ వద్దని ఐఎస్పీలు, కావాలని కంటెంట్ ప్రొవైడర్లు వాదిస్తున్నారు. అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ? నెట్ న్యూట్రాలిటీ అంటే కంటెంట్ ప్రొవైడర్లందరికీ సమానమైన నెట్ హక్కులు ఉండటం. అన్ని వెబ్సైట్లకు సమానమైన నెట్ యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ ఉద్దేశం. దీనివల్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కావాలని కొన్ని సైట్లను స్లో చేయడం, బ్లాక్ చేయడం లేదా కొన్ని సైట్ల స్పీడు పెంచడంలాంటివి చేయకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయి. దీనివల్ల ఒకరు డబ్బులు ఎక్కువగా ఇచ్చారు కదా అని ఆ వెబ్‌సైట్‌కు పోటీగా వస్తున్న వెబ్సైట్ల వేగాన్ని ఎలా పడితే అలా తగ్గించే వీలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉండదు. దీనివల్ల నష్టం ఏంటి? నెట్ న్యూట్రాలిటీని ఎత్తేయడం వల్ల ఫేస్బుక్, యూట్యూబ్‌లాంటి పెద్ద సంస్థలకు పోటీగా ఉన్న విమియో, రెడిట్లాంటి వెబ్సైట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తమకు పోటీగా రాకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎంతైనా చెల్లించడానికి పెద్ద సంస్థలు సిద్ధంగా ఉంటాయి. దీంతో వీళ్ల వెబ్సైట్ల వేగం పెరిగి.. వీళ్లకు పోటీగా ఎదుగుతున్న చిన్న వెబ్సైట్లు కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. -
నెట్ 'స్వేచ్ఛ' కు సై
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సేవలను అందించడంలో వివక్షను సహించేది లేదని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కుండబద్దలుకొట్టింది. నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని తేల్చిచెప్పింది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఈ రంగంలోని ఏ సంస్థలైనా సరే కొన్ని యాప్‌లు, వెబ్సైట్లను ఎలాంటి నెట్చార్జీలు లేకుండా ఉచితంగా అందించడం, అదేవిధంగా మరికొన్ని వెబ్సైట్లు, యాప్‌లను విస్మరించడం.. అడ్డుకోవడం వంటి చర్యలను నిషేధించాలని సూచించింది. నెట్‌న్యూట్రాలిటీపై ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సిఫార్సుల నివేదికను మంగళవారం ట్రాయ్ విడుదల చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం(టెలికం శాఖ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. నెట్ సేవల్లో వివక్షపై గతేడాదే ట్రాయ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుత లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్లో సమాచారం (కంటెంట్)ను అందించే విషయంలో కొన్నింటికి అధిక చార్జీలు, మరికొన్నింటికి తక్కువ చార్జీలు లేదా ఉచితంగా సేవల వంటివి లేకుండా నియంత్రణరహిత సేవలను ప్రొవైడర్లు కల్పించాలి’ అని ట్రాయ్ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీపై ఇదివరకే చర్చాపత్రాన్ని విడుదల చేసి వివిధ పక్షాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. వీటన్నింటినీ పరిశీలించి.. తాజా సూచనలను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం కూడా ఓకే చెబితే... ఇకపై ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్పీ) వెబ్ ట్రాఫిక్(కంటెంట్)ను ఇష్టానుసారం అడ్డుకోవడం లేదా నియంత్రించడం(కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ఫోన్లు ఇలా ఏవిధమైన పరికరానికి సంబంధించినదైనా), కొందరు కంటెంట్ ప్రొవైడర్లకు వేగవంతమైన సర్వీసులు(ఫాస్ట్ లేన్స్) కల్పించడం వంటి వాటికి పూర్తిగా అడ్డుకట్టపడుతుంది. అమెరికా వెనకడుగు... కాగా, నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా ఒబామా సర్కారు 2015లో తీసుకొచ్చిన నిబంధనలను పక్కనబెట్టి కొత్త నిబంధనల రూపకల్పనకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ ప్రతిపాదించిన కొద్దిరోజులకే ట్రాయ్ నివేదిక వెలువడటం గమనార్హం. ఐఎస్పీలన్నింటినీ సమాన సేవలందించే సంస్థలుగా(కామన్ క్యారియర్లు) పరిగణించకుండా.. కంటెంట్ ఆధారంగా వాటిని ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థలుగా విభజించాలనేది పాయ్ ప్రతిపాదన. దీనిపై వచ్చే నెలలో పూర్తిస్థాయిలో కమిషన్ ఓటింగ్ జరపనుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా పలుదేశాలు నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ప్రస్తుత ట్రంప్ సర్కారు మాత్రం దీనిపై మెలిక పెడుతుండటంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఏం చెబుతున్నాయంటే... ♦ టెలికం కంపెనీలు, ఐఎస్పీలు... ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు సంబంధించి విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు వంటి చర్యలకు పాల్పడకూడదు. ఆన్లైన్ వీడియోలకు ఎక్కువతక్కువ స్పీడ్లతో వివక్షకు తావుండరాదు. ♦ కంటెంట్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్స్ నిబంధనలను మార్చాలి. ♦ కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం, స్పీడ్ విషయంలో కొందరికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి ఎలాంటి జోక్యాన్ని అయినా వివక్షగానే పరిగణించాలి. ♦ సమాచారం పంపేవాళ్లు–అందుకునేవాళ్లు, సర్వీసు ప్రోటోకాల్స్, వినియోగించే పరికరాలు(ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, మొబైల్స్ ఇతరత్రా) ఆధారంగా అసమానతలకు తావిచ్చేవిధంగా కంటెంట్‌ను అందించే సంస్థలతో సర్వీసు ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకుండా నిషేధం విధించాలి. ♦ అయితే, ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో కొన్ని ‘ప్రత్యేక సర్వీసు’లకు మినహాయింపు ఇవ్వొచ్చు. ముఖ్యంగా చాలా కీలకమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్తో అనుసంధానించడం) సేవల విషయంలో నిబంధనల సడలింపు అవసరం. డ్రైవర్‌లెస్ కార్లు, టెలీ–సర్జరీ వంటి సేవలు దీనికిందికి వస్తాయి. ♦ నెట్ న్యూట్రాలిటీని కచ్చితంగా అమలుచేయాలంటే దేశంలో ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించిన లైసెన్స్ ఒప్పందాల నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నిబంధనల్లో సమానత్వానికి కూడా దోహదం చేస్తుంది. ♦ కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారులకు ప్రతినిధులకు చోటు కల్పించాలి. ♦ టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా యూజర్లపై దాని ప్రభావం వంటి అంశాలనూ వెల్లడించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి. సమానత్వం తప్పనిసరి... ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ న్యూఢిల్లీ: ఇంటర్నెట్ అనేది దేశాభివృద్ధితో ముడిపడిన అత్యంత ముఖ్యమైన వేదిక అని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, సమానత్వంతో కూడిన ఇంటర్నెట్ సేవల కల్పనకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఇంటర్నెట్ ఒకరిసొత్తుకాదు. ఇదొక బహిరంగ వేదిక. అందరికీ ఒకేవిధమైన సేవలు లభించాలి. అంతేకానీ, ఒకరినొకరు అంతంచేసుకునే(క్యానిబలైజ్డ్) విధంగా వ్యవహరించడం మంచిదికాదు. సర్వీసు ప్రొవైడర్లు ఇంటర్నెట్పై నియంత్రణలు(గేట్ కీపింగ్) విధించకూడదు’ అని శర్మ వ్యాఖ్యానించారు. వినూత్నతల ఆవిష్కరణ(ఇన్నోవేషన్), స్టార్టప్‌లు, ఆన్లైన్ లావాదేవీలు, విభిన్న ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రామ్ సాకారం కావడంలో ఇంటర్నెట్ ప్రధాన భూమిక పోషిస్తోందని.. ఇటువంటి వేదికపై వివక్షకు తావుండకూడదని ఆయన పేర్కొన్నారు. కాగా, నెట్ న్యూట్రాలిటీకి మీరు(ట్రాయ్) మద్దతుగా నిలుస్తుంటే.. అమెరికా నియంత్రణ సంస్థ మాత్రం 2015 నాటి నిబంధనలను రద్దుచేయనుండటంపై అడిగిన ప్రశ్నకు.. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా ట్రాయ్ మార్గదర్శకాలు, సూచనలను రూపొందిస్తోందని బదులిచ్చారు. ‘దేశంలో 130 కోట్ల జనాబాలో 50 కోట్ల మంది నెట్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా ఎన్నో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో దీన్ని వివక్షరహితంగా ఉంచడం చాలా కీలకం. టెలికం, ఐఎస్పీ నెట్‌వర్క్‌లు కంటెంట్ యాక్సెస్ విషయంలో తటస్థంగా వ్యవహరించాల్సిందే’ అని శర్మ స్పష్టం చేశారు. కాగా, నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ తాజా కార్యాచరణ ప్రణాళిక ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందన్న ప్రశ్నపై స్పందించేందుకు శర్మ నిరాకరించారు. లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానాలు ఉంటాయని.. అంతేకానీ, నెట్ న్యూట్రాలిటీ నియమాల ఉల్లంఘనకు ప్రత్యేకంగా జరిమానాలను ట్రాయ్ ప్రతిపాదించలేదని పేర్కొన్నారు. ఇక ఓవర్ ద టాప్(ఓటీటీ– అంటే నెట్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ వంటివి) సేవలపై కూడా త్వరలోనే ట్రాయ్ చర్చా పత్రాన్ని విడుదల చేయనుంది. నెట్ న్యూట్రాలిటీ అంటే... ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు(టెలికం సంస్థలు, ఐఎస్పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని కంటెంట్ ప్రొవైడర్ల సేవలను(వెబ్సైట్లు, యాప్‌ల వంటివి) ఎలాంటి డేటా చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా అందించడం, మిగతావాటికి చార్జీలు వసూలు చేయడం లేదంటే కొన్ని వెబ్సైట్లకు అధిక స్పీడ్, మరికొన్నింటికి తక్కువ స్పీడ్‌తో వచ్చేవిధంగా చేయడం వంటి అసమానతలు లేకుండా చూడటమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం. రెండేళ్ల క్రితం ఫేస్బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవడంతో గగ్గోలు మొదలైంది. మిగతా కంటెంట్ ప్రొవైడర్ల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో నెట్ న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చమొదలైంది. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా ‘ఎయిర్టెల్ జీరో’ పేరుతో కొన్ని ఎంపిక చేసిన వెబ్సైట్లను డేటా చార్జీల్లేకుండా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది ఫిబ్రవరిలో ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ‘ఇంటర్నెట్.ఆర్గ్’, ‘ఎయిర్టెల్ జీరో’ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించింది. కాగా, ఇంటర్నెట్ ఆధారిత యాప్‌ల ద్వారా దేశీయంగా వాయిస్ కాల్స్(వాట్సాప్, స్కైప్ వంటివి)పై నియంత్రణ ఉండాలని, ఈ సేవలను టెలికం ఆపరేటర్ల సర్వీసుల కిందే పరిగణించాలన్న ట్రాయ్ ప్రతిపాదనలపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివిధ పరిశ్రమ సంఘాలు, సామాజికవేత్తలు దీనిపై నిరసన గళం వినిపించారు కూడా. తలోమాట.. ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ సిఫారసులపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. వెబ్ ద్వారా అనియంత్రిత సేవలు, కంటెంట్ పొందేందుకు ట్రాయ్ సిఫారసులు ఉపకరిస్తాయని ఇంటర్నెట్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ అంశానికి ట్రాయ్ నామమాత్రపు నిర్వచనమే ఇచ్చినట్టు టెలికం ఆపరేటర్లు పేర్కొనడం గమనార్హం. దేశంలో ఇంకా నెట్ అందుబాటు లేని వారిని కనెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన అంశాలను ట్రాయ్ పరిష్కరించలేదని... అలాగే, కాల్స్, మెస్సేజ్‌లకు వీలు కల్పిస్తున్న వాట్సాప్, స్కైప్, వైబర్, గూగుల్ డ్యుయో వంటి యాప్స్‌కు లైసెన్సింగ్పైనా మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తమైంది. దేశంలో ఇంకా సేవలు అందని 100 కోట్ల ప్రజలను కనెక్ట్ చేసేందుకు వీలుగా నెట్ న్యూట్రాలిటీపై మేము మరింత విస్తృత విధానాన్ని సూచించాం. ఈ విధానం దేశ అవసరాలకు అనుగుణంగానే ఉండాలి. కానీ, ట్రాయ్ మాత్రం పరిమిత విధానాన్నే సూచించింది. సిఫారసులను ఇంకా అధ్యయనం చేస్తున్నాం. తర్వాత మా అభిప్రాయాలను వివరంగా తెలియచేస్తాం. – రాజన్ ఎస్ మాథ్యూస్, సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ప్రగతిదాయక, ఆచరణాత్మక సిఫా రసులు ఇవి. దేశంలో డిజిటల్ సేవల విస్తరణ అవసరాలను గుర్తించినట్టయింది. ఇంటర్నెట్ అన్నది చైనా, అమెరికా మాదిరిగా కాకుండా ఉచితంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యపు సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. సిఫారసులపై ప్రభుత్వం వేగంగా స్పందించాలి. – ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌లను నెట్న్యూట్రాలిటీ నియంత్రణల నుంచి మినహాయించాలంటూ ట్రాయ్ సూచించినందున రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరం. ఇవి ఇప్పటికే కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా ఉన్నాయి. – ఎడెల్వీజ్ రిపోర్ట్ -
మనం బ్రిటిష్ పాలనలో ఉంటేనే బాగుండేదట!
భారత్‌పై ఫేస్బుక్ సభ్యుడి అక్కసు! న్యూయార్క్: మొబైల్ ఇంటర్నెట్ టారీఫ్‌లో వివక్షకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌పై ఓ ఫేస్బుక్ బోర్డు మెంబర్ ఒకరు తీవ్ర అక్కసు వెళ్లగక్కాడు. భారత్ నిర్ణయం పెట్టుబడిదారులకు వ్యతిరేకమని, భారత్ ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంటేనే బాగుండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఫేస్బుక్ బోర్డు మెంబర్ అయిన మార్క్ అండ్రీస్సెన్ ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. అతని పార్ట్నర్ బెనెడిక్ట్ ఎవన్స్ కూడా ట్రాయ్ నిర్ణయంపై తన విద్వేషాన్ని వెళ్లగక్కాడు. ఆన్లైన్లో పొందే సమాచారం ఆధారంగా ఇంటర్నెట్ సేవలకు భిన్నమైన చార్జీలు వర్తింపచేయాలని పేర్కొంటూ ఫేస్‌బుక్‌తోపాటు కొందరు మొబైల్ ఆపరేటర్లు ప్రచారం చేశారు. ఫేస్బుక్ ఏకంగా ఫ్రీబేసిక్స్ పేరిట భారీ ప్రకటనలతో ఈ విషయంలో ప్రచారం చేసింది. అయితే ఇంటర్నెట్ సమాచారాన్ని పొందే విషయంలో ఇలాంటి వివక్షలకు ఎంతమాత్రం అంగీకరించబోమని భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తేల్చిచెప్పడంతో వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారానికి తెరపడింది. ట్రాయ్ నిర్ణయాన్ని సామాజిక కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ఇంటర్నెట్ సమానత్వానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఫేస్బుక్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. -
'భారత్ నిరాశ పరిచింది.. అయినా వదిలిపెట్టం'
వాషింగ్టన్: నెట్ న్యూట్రాలిటీ కల్పించి కోట్లాది వినియోగదారులకు ఫ్రీ ఇంటర్నెట్ కల్పించాలని భావించిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందినట్లు తెలిపాడు. అయినప్పటికీ ఈ విషయాన్ని వదిలేది లేదని భారత్ సహా ప్రపంచ దేశాలలో నెట్ న్యూట్రాలిటీ అందించేందుకు కృషిచేస్తానని చెప్పాడు. ఇంటర్నెట్ సేవలకు సంబంధించి దుమారం రేపిన నెట్ న్యూట్రాలిటీ వివాదానికి సోమవారం ట్రాయ్ తెరదింపిన విషయం తెలిసిందే. వివిధ సైట్ల వినియోగాన్ని బట్టి రకరకాల చార్జీలు విధించడం కుదరదని టెలికం కంపెనీలకు తేల్చి చెప్పింది. ఈ నిబంధన పాటించని పక్షంలో, ఎన్నాళ్లు ఉల్లంఘిస్తే అన్ని రోజులూ రోజుకు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇంటర్నెట్.ఆర్గ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని కానీ, భారత్ ఫ్రీ ఇంటర్నెట్ ను కట్టడిచేసిందని అభిప్రాయపడ్డాడు. తమతో పాటు ఇతర సంస్థలు ఇంటర్నెట్.ఆర్గ్ ద్వారా భారత్, ప్రపంచ దేశాలలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధపడగా, ట్రాయ్ తమను అడ్డుకున్నదన్నాడు. 38 దేశాల్లోని కోట్లమంది ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఫేస్ బుక్ వాడతారని.. భారత్ లో కూడా 10 కోట్ల మంది ఫ్రీ ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉందని వివరించాడు. సోలార్ పానెల్స్, శాటిలైట్స్, లేజర్స్, ఉద్యోగావకాశాలు ఇలా చాలా రంగాల వారికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర విధానాలు ఏవైనా అన్వేషించి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ కృషి చేస్తుందని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి తెలిపారు. -
ఫేస్‌బుక్‌పై ధ్వజమెత్తిన ట్రాయ్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్రీ బేసిక్ అంశంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యవహరిస్తున్న తీరుపై భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతుగా తన యూజర్ల చేత ఫేస్బుక్ ట్రాయ్‌కి ఈమెయిల్స్ పంపించడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ విషయంలో ఫేస్బుక్ తనపై చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఘాటైన బహిరంగ లేఖను ట్రాయ్ రాసింది. ఫేస్బుక్ వ్యవహారాలకు సంబంధించి ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా డైరెక్టర్ అంఖీ దాస్ పేరిట రాసిన ఈ లేఖలో ఆ వెబ్సైట్ తీరును ట్రాయ్ ఏకీపారేసింది. 'డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు' అంశంపై ట్రాయ్ సంధించిన నాలుగు ప్రశ్నలకు తన యూజర్ల తరఫున ఫేస్బుక్ తెలిపిన ప్రతిస్పందన.. అది ప్రజల స్పందన కాబోదని, ఫ్రీబేసిక్స్ కు మద్దతుగా ఫేస్బుక్ తన యూజర్ల స్పందనను ప్రజా స్పందనగా చిత్రించడానికి అది ప్రయత్నిస్తున్నదని ఈ లేఖలో ట్రాయ్ పేర్కొంది. తనకు ఉన్న భారీ యూజర్ల సామర్థ్యాన్ని ఫేస్బుక్ ఫ్రీ బేసిక్కు మద్దతుగా ఉపయోగించుకుంటున్నదని, ఈ వ్యవహారంలో పారదర్శకమైన నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా అర్థవంతమైన సంప్రదింపుల ప్రక్రియ కొనసాగకుండా.. కేవలం మెజారిటేరియన్ ఓపినియన్ పోల్‌లా ఇది కొనసాగాలని ఫేస్బుక్ భావిస్తున్నదని ట్రాయ్ ఈ లేఖలో మండిపడింది. ఫేస్బుక్ చర్యలను ఆమోదిస్తే.. భారత్‌లో విధాన నిర్ణయాలపై తీవ్ర ప్రమాదకరమైన ప్రభావాలు పడే అవకాశముందని ట్రాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫేస్బుక్ తన యూజర్ల తరఫున స్వయం నియమిత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నదని, యూజర్లందరి తరఫున మూకుమ్మడిగా మాట్లాడేందుకు ఫేస్‌బుక్‌కు ఎలాంటి అధికారం లేదని ట్రాప్ తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతాల వారికి ఉచిత ఇంటర్నెట్ పేరిట ఫేస్బుక్ ముందుకు తీసుకొచ్చిన 'ఫ్రీబేసిక్స్' ప్రచారాన్ని ఇంటర్నెట్ సమానత్వ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
‘నెట్’పై ట్రాయ్‌కు 24 లక్షల మెయిల్స్...
న్యూఢిల్లీ: వేర్వేరు వెబ్సైట్లు, యాప్స్‌కు వివిధ రకాల డేటా చార్జీల వసూలు విధాన ప్రతిపాదనకు (డిఫరెన్షియల్ ప్రైసింగ్) టెలికం సంస్థలు తమ మద్దతు తెలిపాయి. ఇంటర్నెట్ వ్యవస్థలో నవకల్పనలను ప్రోత్సహించేందుకు, మరింత మందికి నెట్‌ను చేరువ చేసేందుకు ఇలాంటివి తోడ్పడగలవని పేర్కొన్నాయి. టెల్కోల సమాఖ్యలు సీవోఏఐ, ఏయూఎస్పీఐలు ఈ మేరకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సంయుక్త లేఖ రాశాయి. మరోవైపు, ఇంటర్నెట్ సేవలు అందించడంలో టెల్కోలు తటస్థ వైఖరితో ఉండాలన్న (నెట్ న్యూట్రాలిటీ) ప్రతిపాదనలో కీలకమైన డిఫరెన్షియల్ ప్రైసింగ్ మీద చర్చాపత్రంపై ట్రాయ్‌కి రికార్డు స్థాయిలో దాదాపు 24 లక్షల పైగా అభిప్రాయాలు వచ్చాయి. వీటిలో దాదాపు 80 శాతం సమాధానాలు (సుమారు 18.94 లక్షలు) సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌కి చెందిన ఫ్రీ బేసిక్స్ సేవలకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో చాలా మటుకు సమాధానాలు ఎటువంటి వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలు లేకుండా.. ‘సపోర్ట్ఫ్రీబేసిక్స్డాట్ఇన్’ నుంచి, మరో 5.44 లక్షల కామెంట్లు.. ఫేస్బుక్మెయిల్డాట్కామ్ నుంచి వచ్చినట్లు పరిశీలనలో వెల్లడైంది. అటు నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా సేవ్ ది ఇంటర్నెట్ వంటి వేదికల ద్వారా 4.84 లక్షల కామెంట్స్ వచ్చాయి. నిర్దిష్ట యాప్స్‌ను, వెబ్సైట్లను కొన్ని టెల్కోలు, వాటి భాగస్వామ్య సంస్థలు డేటా చార్జీల ప్రసక్తి లేకుండా యూజర్లకు ఉచితంగా అందిస్తుండటంపై వివాదం రేగడంతో, ఈ తరహా ప్రయోగాల గురించి ట్రాయ్ చర్చాపత్రం విడుదల చేయడం, అభిప్రాయాలు సమీకరించడం సంగతి తెలిసిందే. -
ఫ్రీ బేసిక్స్‌పై అనుమానమేల: జుకెర్బెర్గ్
'ఫ్రీ బేసిక్స్'.. గత కొన్ని రోజులుగా భారతదేశంలో విపరీతంగా చర్చిస్తున్న అంశం. ఫేస్బుక్ దీన్ని బాగా ప్రమోట్ చేస్తుంటే, మన దేశంలో మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చోపచర్చలు సాగుతున్నాయి. మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని వెబ్సైట్లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ ఫ్రీ బేసిక్స్ వల్ల సాధ్యమవుతుంది. దీంతో అందరికీ ఎంతో కొంత వరకు ఇంటర్నెట్ అందుతుందన్నది ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ వాదన. అయితే ఫేస్బుక్ సహా కొన్ని సైట్లు మాత్రమే అందుబాటులోకి రావడం సరికాదని, మొత్తం ఇంటర్నెట్నే అందరికీ ఉచితంగా అందించాలని అంటున్నారు. కానీ జుకెర్బెర్గ్ మాత్రం లైబ్రరీ, ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ పాఠశాలల్లా బేసిక్ ఇంటర్నెట్ సర్వీసులు అందరికీ అందించాలని వాదిస్తున్నారు. భారతదేశంలో దాదాపు ఏడాదిగా దీనిపై చర్చలు జరగడం ఆశ్చర్యకరమని చెప్పాడు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి బదులు దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అంటే వాళ్లు దాదాపు వంద కోట్ల మందికి ఇంటర్నెట్ అందకుండా చేస్తున్నారని అన్నాడు. అయితే ప్రజలు గట్టిగా కావాలని అడుగుతున్న నెట్ న్యూట్రాలిటీకి, ఫ్రీ బేసిక్స్‌కు చాలా తేడా ఉంది. ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ, అన్ని సైట్లకూ ఉచితంగా యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ కావాలంటున్నవాళ్ల వాదన. కానీ ఫేస్బుక్ మాత్రం ఫ్రీ బేసిక్స్ కావాలంటూ తన సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది, చేయిస్తోంది. ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది ప్రజలు ఫ్రీ బేసిక్స్‌ను నిషేధించవద్దంటూ ట్రాయ్‌కి పిటిషన్లు పెట్టారు. మీ ఫ్రెండ్స్ ఈ పిటిషన్ పెట్టారు, మీరు కూడా చేరండంటూ ఫేస్బుక్ యూజర్లకు పదే పదే మెసేజిలు, నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ భారతానికి ఇంటర్నెట్ ఉచితంగా అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని, దీన్నినిషేధించవద్దని జుకెర్బెర్గ్ కోరుతున్నాడు. -
'నెట్ యాక్సెస్ లేనివాళ్ల సంగతి ఏమిటి?'
న్యూఢిల్లీ: 'ఇంటర్నెట్ న్యూట్రాలిటీకి మేం పూర్తిగా మద్దతునిస్తాం. ప్రపంచవ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీని ఉండాలని మేం కోరుతున్నాం. అదే సమయంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు మేం పనిచేస్తున్నాం'అని ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ (సమానత్వాని)కి ఫేస్బుక్ ఆధ్వర్యంలోని ఇంటర్నెట్.ఓఆర్జీ మద్దతునిస్తుందా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి వివక్ష, ఆంక్షలు లేకుండా, అందరికీ ఇంటర్నెట్ సేవలు ఒకేరకంగా అపరిమితంగా అందించాలని కోరుతూ ఇంటర్నెట్ న్యూట్రాలిటీ ఉద్యమం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 'ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవాళ్లే ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం ఆన్లైన్ పిటిషన్ల ద్వారా ఉద్యమిస్తున్నారు. నెట్ సదుపాయం లేనివాళ్లు సంగతి ఏమిటి.. వారు తమకు యాక్సెస్ కావాలంటూ పిటిషన్‌పై సంతకం చేయలేరు కదా' అని పేర్కొన్నారు. ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ జుకర్‌బర్గ్ తెలిపిన కీలకాంశాలివి.. ఆఫ్రికాలో కొత్త తరహా పాఠశాలలు ప్రవేశపెట్టేందుకు మేం పెట్టుబడులు పెడుతున్నాం. భారత్‌కు కూడా వీటిని తీసుకువస్తామని ఆశిస్తున్నా. ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం సమయంలో దాదాపు 30 లక్షలమందికిపైగా తాము సురక్షితంగా ఉన్నామని ఫేస్బుక్లో చెప్పారు. ప్రజలతో అనుసంధానం కావాలన్న మా మిషన్ లక్ష్యం ఇదే. భారత్‌కు చెందిన చాలామంది ఫేస్బుక్, మా అనుబంధ సంస్థ వాట్సప్ ను వినియోగిస్తున్నారు. నాణెనికి మరోవైపు చూస్తే భారత్‌లో ఇప్పటికీ చాలామందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇంటర్నెట్ ద్వారా విద్య, ఆరోగ్య సమాచారం, ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ప్రతి పది మందికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తే ఒకరికి ఉద్యోగ అవకాశం ఏర్పడుతుంది. తద్వారా అతను పేదరికం నుంచి బయటపడతాడని మా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఈ విషయంలో భారత్‌కు ఎంతో అవకాశముంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, యాక్సెస్ ఉంటే పేద విద్యార్థులకు మరింత మెరుగైన పాఠశాలలను అందించవచ్చు. స్కూళ్లు, ఆస్పత్రులు అందుబాటులో లేనివారికి మా టెక్నాలజీ ద్వారా సహాయం చేయాలని భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కట్టడాలన్నీ యుద్ధ విజయాలను పురస్కరించుకొని నిర్మించిన స్మారకాలే. కానీ తాజ్‌మహల్ మాత్రం ప్రేమ చిహ్నం. అందుకే అది నన్ను అబ్బురపరిచింది. టెక్నాలజీ.. సూపర్ న్యాచురల్ పవర్! మీకు మానవాతీత శక్తులు వస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు జుకర్‌బర్గ్ బదులిస్తూ.. టెక్నాలజీ అందుబాటులో ఉంటే చాలు మీకోసం మీరు ఎలాంటి మానవాతీత శక్తులైన రూపొందించవచ్చు అని పేర్కొన్నారు. -
నెట్ న్యూట్రాలిటీపై కేంద్రానికి 73వేలకు పైగా కామెంట్స్
న్యూఢిల్లీ : వివాదాస్పదమైన నెట్ న్యూట్రాలిటీ అంశంపై కేంద్రానికి 73,326 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. టెలికం శాఖ నివేదిక మీద మైగవ్డాట్ఇన్ వెబ్సైట్లో వీటిని పొందుపర్చారు. నెట్ యూజర్లకు అందించే వెబ్సైట్లపై పక్షపాత ధోరణి లేకుండా టెలికం సంస్థలు తటస్థ వైఖరిని పాటించేందుకు ఉద్దేశించినది నెట్ న్యూట్రాలిటీ అంశం. కొన్ని టెల్కోలు ప్రత్యేక ప్లాన్ల పేరిట డేటా చార్జీలు లేకుండా నిర్దిష్ట వెబ్సైట్లను ఉచితంగా అందిస్తుండటంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి టెలికం శాఖ నివేదికపై కేంద్రం ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీనికి ఆగస్టు 15 డెడ్‌లైన్ అయినప్పటికీ.. కామెంట్స్ వెల్లువెత్తుతుండటంతో ఆగస్టు 20 దాకా పొడిగించింది. ఆయా అంశాల ప్రాతిపదికన పటిష్ట నిబంధనలను కేంద్రం రూపొందించనుంది. -
దేశంలో ఇంటర్నెట్.ఆర్గ్ యూజర్లు @ 8 లక్షలు
న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చే నినాదంతో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఆవిష్కరించిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ యూజర్ల సంఖ్య భారత్‌లో ప్రస్తుతం 8 లక్షల స్థాయికి చేరింది. టెలికం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఆంధ్రప్రదేశ్ సహా ఏడు సర్కిల్స్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద డేటా చార్జీల ప్రసక్తి లేకుండా 30 పైచిలుకు వెబ్సైట్లను ఆర్‌కామ్ ఉచితంగా అందిస్తోంది. ఇంటర్నెట్ సేవలు అందించడంలో టెల్కోలు తటస్థంగా వ్యవహరించాలన్న నెట్ న్యూట్రాలిటీ విధానానికి ఇది విరుద్ధమంటూ ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల మందికి నెట్ మాధ్యామాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఫేస్బుక్.. ఈ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌ను ప్రారంభించింది. దీనికోసం శామ్సంగ్, క్వాల్కామ్ వంటి టెక్నాలజీ దిగ్గజాలతో చేతులు కలిపింది. ఇప్పటికే భారత్ సహా తొమ్మిది దేశాల్లో 80 కోట్ల మందికి నెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫేస్బుక్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఇక అందరికీ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్!
కంటెంట్, యాప్ డెవలపర్లందరికీ సేవలు అందిస్తామన్న ఫేస్బుక్... ⇒ కొన్ని నిబంధనలు పాటించాలని షరతు.. న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా భారీయెత్తున ఆందోళనలు చెలరేగడంతో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ కూడా ఒక మెట్టుదిగింది. తమ ఉచిత ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌ను కంటెంట్, అప్లికేషన్ డెవలపర్లందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయితే, దీనికి కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్ డేనియల్స్ పేర్కొన్నారు. ప్రధానంగా సంబంధిత కంటెంట్ అంతా ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు రెండింటిలోనూ పరిమిత బ్యాండ్‌విడ్త్‌లో కూడా బ్రౌజ్ చేసేవిధంగా ఉండాలని ఆయన చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్)తో ఒప్పందం ద్వారా ఇంటర్నెట్డాట్ ఆర్గ్.. ఫేస్బుక్ ఇతరత్రా 33 వరకూ వెబ్సైట్లను ఎలాంటి డేటా చార్జీలూ లేకుండా యూజర్లు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్టెల్ కూడా ఇలాంటిదే ఎయిర్టెల్ జీరో పేరుతో ఒక స్కీమ్‌ను మొదలుపెట్టింది. టెలికం కంపెనీలు ఇలా కొన్ని వెబ్సైట్లు, యాప్‌లను మాత్రమే ఉచితంగా అందించడంవల్ల చిన్న డెవలపర్లు, ఇతర కంటెంట్ ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని.. ఇది నెట్ సమానత్వానికి(న్యూట్రాలిటీ) దెబ్బ అంటూ నిరసనలు వెల్లువెత్తడంతో పాటు విస్తృత చర్చకు కూడా దారితీసింది. దీంతో క్లియర్‌ట్రిప్, ఎన్డీటీవీ వంటివి ఆర్‌కామ్ ప్లాట్‌ఫామ్ నుంచి వైదొలగగా.. ఫ్లిప్‌కార్ట్ ఇతరత్రా సంస్థలు ఎయిర్టెల్ జీరోకు గుడ్‌బై చెప్పాయి. అయితే, ప్రపంచంలో ఆన్లైన్ సేవలను అందరికీ చేరువచేయాలంటే... నెట్న్యూట్రాలిటీ ఎంతముఖ్యమో ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ వంటి ప్రోగ్రామ్‌లు కూడా చాలా అవసరమని డేయియల్స్ పేర్కొన్నారు. ఇప్పుడు తమ ప్లాట్‌ఫామ్‌ను టెలికం ఆపరేటర్లు, డెవలపర్లు అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల సేవలను మరింత విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. ట్రాయ్ మెయిల్స్‌లో పెళ్లి ఆల్బమ్‌లు! నెట్ న్యూట్రాలిటీపై వివిధ వర్గాల నుంచి ట్రాయ్‌కు వచ్చిన ఈ-మెయిల్స్‌లో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్నల్ మెయిల్స్‌తో పాటు ప్రైవేటు పెళ్లి ఆల్బమ్‌లు ఇతరత్రా వ్యక్తిగత అంశాలు కూడా ఉండటం విశేషం. నెట్ న్యూట్రాలిటీ, ఓవర్దిటాప్ ఆపరేటర్ల(వాట్స్‌యాప్, స్కైప్ వంటివి) సేవలపై మార్గదర్శకాలకు సంబంధించి నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై గత నెల 24 వరకూ ప్రజల అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అయితే, తమ అధికారిక మెయిల్ ఐడీకి సుమారు 10 లక్షల మెయిల్స్ రాగా.. వీటన్నింటినీ యథాతథంగా ట్రాయ్ బయటపెట్టింది. అంతా ఉచితంగా ఇవ్వలేం: జుకర్‌బర్గ్ ఇంటర్నెట్లో మొత్తం సేవలన్నింటినీ ఉచితంగా అందించడం సాధ్యం కాదని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. అయితే, ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ద్వారా విద్య, వికీపీడియా, జాబ్ లిస్టింగ్స్, ఎయిడ్స్‌పై అవగాహన ఇతరత్రా ప్రాథమిక సేవలకు సంబంధించిన వెబ్సైట్లను ఎలాంటి చార్జీలూ లేకుండా అందించవచ్చన్నారు. కంటెంట్, అప్లికేషన్ డెవలపర్లు అందరికీ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ఫ్లాట్‌ఫామ్‌ను కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించిన నేపథ్యంలో జుకర్‌బర్గ్ ఒక వీడియో బ్లాగ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బేసిక్ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందినప్పుడు.. ఇతర విస్తృత సేవలకుగాను కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని.. దీనివల్ల టెలికం ఆపరేటర్లు ఉచిత సేవలను ఆఫర్ చేసేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌లో పాలుపంచుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా ఆహ్వానిస్తామని.. తాము ఎవరికీ పైసా చెల్లించబోమని, అదేవిధంగా ఎవరినుంచీ పైసా తీసుకోబోమని తేల్చిచెప్పారు. -
ప్రయాణం.. అప్పటికప్పుడే!
చివరి నిమిషంలో ప్రయాణానికే హైదరాబాదీల మొగ్గు ⇒ 40% ట్రావెల్ బుకింగ్స్ ఆఖర్లో జరుగుతున్నవే ⇒ ఇందులో 54 శాతం వాటా మొబైల్స్ నుంచే ⇒ క్లియర్‌ట్రిప్ సక్సెస్‌కు కారణమిదే ⇒ క్లియర్‌ట్రిప్ సీఎంఓ సుబ్రహ్మణ్య శర్మ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అనుకున్నదే తడవు’’ అనే నానుడిని భాగ్యనగరవాసులు పక్కా ఫాలో అవుతున్నారు. అందుకేనేమో ముందస్తు ట్రావెల్ బుకింగ్స్ కంటే చివరి నిమిషంలో చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయట. మొత్తం వ్యాపారంలో ఇలా జరుగుతున్నది ఏకంగా 40 శాతానికి చేరిందంటున్నారు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి (సీఎంఓ) సుబ్రహ్మణ్య శర్మ. ఈ 40 శాతంలో కూడా 54 శాతం బుకింగ్స్ సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్నవేనని తెలియజేశారు. ‘దక్షిణ భారతదేశం- ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమ’ అనే అంశంపై మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... ⇒ దేశంలో ఆన్లైన్ ట్రావెల్ విభాగం ఏటా 32% వృద్ధిని కనబరుస్తోంది. 19.8ుతో దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలవగా.. 18.2%తో బ్రెజిల్, 14.1%తో చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. ⇒ ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది క్లియర్‌ట్రిప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 5 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు కూడా. నెలకు 6.5 లక్షల మంది కస్టమర్లు క్లియర్‌ట్రిప్ సేవల్ని స్మార్ట్ఫోన్లు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వినియోగించుకుంటున్నారు. ఇందులో మొబైల్స్ ద్వారా జరుగుతున్న వినియోగం నెలకు 3 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. ఏటా 30 లక్షల ట్రావెల్ బుకింగ్స్ జరుగుతుంటే.. ఇందులో 70% మంది రిపీటెడ్ కస్టమర్లే. ⇒ ఆన్లైన్ ట్రావెల్స్ బుకింగ్స్‌లో మొబైల్ ఫోన్లదే అగ్రస్థానం. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కొందరికే పరిమితం కనక సెల్‌పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. అందుకే 2006లో ప్రారంభమైన క్లియర్‌ట్రిప్ సంస్థ.. 2010లో మొబైల్ వెబ్‌సైట్‌ను, 2012లో ఐఓఎస్ యాప్‌ను, 2014లో ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమలో మేక్మైట్రిప్ మొదటి స్థానంలో ఉంటే.. మొబైల్ ఫోన్ల ద్వారా ట్రావెల్ బుకింగ్స్‌ను వినియోగించటంలో క్లియర్‌ట్రిప్ మొదటి స్థానంలో ఉంది. ⇒ గతేడాది మా టర్నోవర్ 8 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇందులో 43-44 శాతం వాటా మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చిందే. భవిష్యత్తులో మా పెట్టుబడుల్లో 60 శాతం వాటాను మొబైల్ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ మీదే పెట్టాలని నిర్ణయించాం. ⇒ క్లియర్‌ట్రిప్ ఆన్లైన్ ట్రావెల్స్ విభాగంలో హైదరాబాద్ వాటా 6 శాతం. ఏటా దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా విమానయాన బుకింగ్స్ 150-160 శాతం వృద్ధి రేటును కనబరుస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ఏకంగా 192 శాతం వృద్ధి రేటుంది. హోటల్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 903 శాతం వృద్ధి ఉంది. ⇒ విమాన టికెట్లకు సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా 28 శాతం బుకింగ్స్ ఆఖరి నిమిషంలో అవుతుంటే.. డెస్క్‌టాప్‌ల ద్వారా 18 శాతం చేస్తున్నారు. రెండు రోజుల ముందైతే మొబైల్స్ ద్వారా 72 శాతం మంది చేస్తుంటే.. డెస్క్‌టాప్ ద్వారా 82 శాతం మంది చేస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీకే మా మద్దతు మూడు నెలలక్రితం కొన్ని టెలికం కంపెనీలతో భాగస్వాములమై మా అప్లికేషన్‌ను ఉచితంగా ఇచ్చాం. అయితే తర్వాతి రోజే ‘‘క్రియర్ట్రిప్ను డౌన్లోడ్ చేసుకోవటం మానేస్తున్నాం. ఎందుకంటే నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా మేం పోరాడుతున్నాం’’ అని కొందరు కస్టమర్లు ట్వీట్ చేశారు. దీంతో వెంటనే నెట్ న్యూట్రాలిటీకి మేమూ మద్దతు ప్రకటించాం. వారి భాగస్వామ్యం నుంచి వైదొలిగాం. కస్టమర్లు, వారి అభిరుచులు, గౌరవాలే మాకు ముఖ్యం. కొన్ని సంస్థల ప్రయోజనాల కోసం కస్టమర్లను కోల్పోలేం. -
10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ న్యూట్రాలిటీ గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కు లేఖలు రాసిన 10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. జీవో అవర్ లో ఆయన ఈ అంశాన్ని వారు లేవనెత్తారు. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం పోరాడుతున్న వారి ఈ-మెయిల్ ఐడీలు ట్రాయ్ వెబ్ సైట్లో పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం చేయడం వల్ల వారు హాకర్స్ బారిన పడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. -
లోక్‌సభలో ఇంటర్నెట్ దుమారం
న్యూఢిల్లీ : లోక్‌సభలో బుధవారం ఇంటర్నెట్లో నెట్ న్యూట్రాలిటీ దుమారం చెలరేగింది. లోక్‌సభలో నెట్ న్యూట్రాలిటీపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంటర్నెట్ను కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెట్ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ను కార్పొరెట్ కంపెనీల చేతిలో పెట్టడం సరికాదన్నారు. ఈ అంశంపై చర్చించాలని రాహుల్ ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. దీనిపై టెలికంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ నెట్ న్యూట్రాలిటీకి తాము కట్టుబడి ఉన్నాం. యూపీఏ సర్కార్లాగా తాము కార్పొరేట్లకు ఎప్పుడూ తలవంచలేదని, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న 'నెట్ న్యూ ట్రాలిటీ' అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇదీ వివాదం.. ఇంటర్నెట్ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసింది. ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెల్కోలు ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
లోక్‌సభలో ఇంటర్నెట్ దుమారం
-
'చర్చపేరుతో అసత్య ప్రచారం వద్దు'
న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీ పేరుతో తమపై అసత్య ప్రచారం తగదని టెలికాం దిగ్జజ సంస్థ ఎయిర్ టెల్ పేర్కొంది. అందరికీ సమానంగా ఇంటర్నెట్ వినియోగం చర్చ పేరుతో అసత్య ప్రచారం చేయడం మంచిది కాదని తెలిపింది. 22 కోట్ల వినియోగదారులు ఉన్న ఎయిర్ టెల్ ఈ అంశంపై తమ కస్టమర్లకు, ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా తమ విధానాన్ని స్పష్టం చేసింది. అందరికీ ఇంటర్నెట్ చేరువ చేసే నినాదంతో ప్రవేశపెట్టిన 'ఎయిర్ టెల్ జీరో' ప్లాన్, ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. టెల్కోలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే నెట్ న్యూట్రాలిటీపై చర్చకు తాము అనుకూలమని.. చర్చ, అసత్య ప్రచారం ఒకటి కాదని ఎయిర్ టెల్ కస్టమర్ బిజినెస్ డైరెక్టర్ శ్రీనివాస్ గోపాలన్ అన్నారు. -
ఉచిత సేవలు సముచితమే..
- సమర్థించుకున్న ఎయిర్టెల్, ఫేస్బుక్ - నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని వెల్లడి న్యూఢిల్లీ: ‘నెట్ న్యూట్రాలిటీ’కి అన్నివర్గాల నుంచి మద్దతు స్వరాలు జోరందుకుంటున్నప్పటికీ... ఫేస్బుక్, ఎయిర్‌టెల్‌లు మరోసారి తమ ఉచిత ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌లను సమర్థించుకున్నాయి. తమ ఉచిత సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని.. యూజర్లకు ఈ సేవల కల్పన విషయంలో ఎలాంటి వివక్షనూ చూపబోమని స్పష్టం చేశాయి. అందరికీ సమానంగా ఇంటర్నెట్ సేవలను తటస్థంగా అందించాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. కొన్ని వెబ్సైట్లు, యాప్‌లను మాత్రమే ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించడం తీవ్ర వివాదానికి దారితీయడం విదితమే. ఎయిర్టెల్ జీరో పేరుతో, రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఫేస్బుక్ ఇంటర్నెట్డాట్ఆర్గ్తో జట్టుకట్టి కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను ఉచితంగా అందించే సేవలకు తెరతీయడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగడంతో.. ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్, ఎన్‌డీటీసీ, టైమ్స్ గ్రూప్ వంటివి ఎయిర్టెల్ జీరో, ఇంటర్నెట్డాట్ఆర్గ్ల నుంచి వైదొలిగాయి కూడా. కాగా, డిజిటల్ ఇండియాను ప్రోత్సహిం చేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని.. ఓపెన్ ఇంటర్నెట్(నెట్ న్యూట్రాలిటీ)కి కట్టుబడి ఉన్నామంటూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌ఇన్, ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్లు తేల్చిచెప్పాయి. కాగా, ఆర్‌కామ్ మొబైల్ నెట్‌వర్క్‌తో జట్టుకట్టడంద్వారా తమ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ భారత్‌లోని లక్షలాదిమంది నెట్ యూజర్లకు ప్రయోజనం చేకూర్చిందని.. అన్ని మొబైల్ ఆపరేటర్ల(టెల్కో)కూ ఈ సేవలను ఆఫర్ చేస్తామని ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్క్ పేర్కొన్నారు. అందరికీ నెట్ అందుబాటు(యూనివర్సల్ కనెక్టివిటీ), నెట్ న్యూట్రాలిటీ అనేవి రెండూ కచ్చితంగా కలిసి కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌లో ఫేస్బుక్ తదితర కొన్ని సేవలను ఉచితంగా అందించడం నెట్న్యూట్రాలిటీ స్ఫూర్తిని దెబ్బతీస్తోందన్న విమర్శలను జుకర్‌బర్గ్ కొట్టిపారేశారు. కాగా, ఉచిత ప్లాట్ఫామ్లో ఉన్నా లేకున్నా అన్ని వెబ్సైట్లు, యాప్‌లను యూజర్లకు అందించడంలో ఒకేవిధంగా వ్యవహరిస్తామని ఎయిరల్‌టెల్ సీఈఓ, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విటల్ పేర్కొన్నారు. -
టెల్కోలకు అనుకూలంగా పనిచేస్తోంది
ట్రాయ్‌పై ఐఏఎంఏఐ ఆరోపణలు నెట్ న్యూట్రాలిటీకి పెరుగుతున్న మద్దతు న్యూఢిల్లీ: నెట్ వినియోగంలో కొన్ని సైట్లకు ప్రాధాన్యమిచ్చేలా టెలికం సంస్థలు వ్యవహరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ .. టెల్కోలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) ఆరోపించింది. ఇంటర్నెట్ సేవలందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన(నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను డేటా చార్జీల ప్రసక్తి లేకుండా ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ ప్రవేశపెట్టిన చర్చాపత్రంలోని పలు అంశాలన్నీ టెల్కోల సిఫార్సులేనని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ శుభో రాయ్ చెప్పారు. చర్చాపత్రాన్ని చూస్తే ఇంటర్నెట్ ఏ నియమ, నిబంధనల పరిధిలోకి రాదన్న భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ఇంటర్నెట్ కంపెనీలు ఐటీ చట్టానికి లోబడే కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుందన్నారు. నెట్ న్యూట్రాలిటీ, వాట్స్‌యాప్.. స్కైప్ తదితర కాలింగ్ సర్వీసుల మీద మార్చి 27న ట్రాయ్ ఆవిష్కరించిన చర్చాపత్రంపై తమ అభిప్రాయాలను వారం రోజుల్లోగా తెలియజేయనున్నట్లు రాయ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే 7-8 లక్షల పైచిలుకు మంది తమ అభిప్రాయాలను ట్రాయ్‌కు పంపినట్లు సమాచారం. నెటిజన్లు తమ అభిప్రాయాలను ఏప్రిల్ 24లోగా పంపాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్, మెసేజింగ్ తదితర సర్వీసుల యాప్స్.. వ్యక్తులతో పాటు దేశభద్రతకు కూడా ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చాపత్రంలో ట్రాయ్ పేర్కొంది. గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు మేక్మైట్రిప్ తదితర దేశీ సంస్థలు ఐఏఎంఏఐలో సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్నెట్ఆర్గ్నుంచి తప్పుకున్న క్లియర్‌ట్రిప్ నెట్ న్యూట్రాలిటీపై వివాదం నేపథ్యంలో ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ క్లియర్‌ట్రిప్, మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూప్ సంస్థలు ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ నుంచి వైదొలిగాయి. న్యూట్రాలిటీకి మద్దతు ప్రకటిస్తూ, ఈ తరహా ప్లాట్‌ఫాంల నుంచి మిగతా పబ్లిషర్లు కూడా వైదొలగాలంటూ టైమ్స్ గ్రూప్ కోరింది. న్యూట్రాలిటీపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నందున తాము పునరాలోచించుకుని ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ నుంచి వైదొలిగినట్లు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుబ్రమణ్య శర్మ తెలిపారు. అందరికీ ఇంటర్నెట్ చేరువ చేసే నినాదంతో సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ఫేస్బుక్ ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఈ తరహా ప్యాకేజీని ప్రకటించిన ఎయిర్‌టెల్‌కు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.సమర్ధించుకున్న ఫేస్బుక్..: ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ అనేది నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని ఫేస్బుక్ చీఫ్ మార్క్ జకర్బర్గ్ స్పష్టం చేశారు. నెట్ కనెక్టివిటీ అసలు లేకపోవడం కన్నా ఎంతో కొంత అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. నెట్ న్యూట్రాలిటీతో పాటు ఇలాంటివి కూడా అవసరమేనని జకర్బర్గ్ పేర్కొన్నారు. -
స్టార్టప్‌లకు ఊపిరి ‘నె ట్ న్యూట్రాలిటీ’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సేవల్లో ఆటంకాలను సృష్టించేలా ఉన్న టెలికం సంస్థల ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని, అందరికీ సమానంగా ఇంటర్నెట్ (నెట్ న్యూట్రాలిటీ) సేవలు అందించాలని నోలారిటీ కమ్యూనికేషన్స్ సీఈవో అంబరీష్ నారాయణ్ గుప్తా డిమాండ్ చేశారు. ఇంటర్ నెట్ సేవలు స్టార్టప్ కంపెనీలకు ప్రాణవాయువు లాంటిదనీ, ప్రభుత్వ విధానాలు దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో బుధవారం నాస్కామ్ నిర్వహించిన ‘ప్రోడక్ట్ కాన్క్లేవ్’లో ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తూ స్టార్టప్ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాబోయే రోజుల్లో మార్కెట్ రూపురేఖల్ని పూర్తిగా మార్చబోతోందని, నెట్ న్యూట్రాలిటీతోనే ఈ రంగంలో వ్యాపార అవకాశాలను ఒడిసిపట్టుకోవచ్చని లౌడ్సెల్ అధినేత రమేష్ గుప్తా చెప్పారు. ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు... టెక్నాలజీ ఆధారిత డిజిటల్ స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని, వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు నాస్కామ్ ప్రోడక్ట్ కౌన్సిల్ చైర్మన్ రవి గురురాజ్ తెలిపారు. ప్రస్తుతం 850 టెక్నాలజీ ప్రోడక్ట్ స్టార్టప్‌లు దేశంలో పనిచేస్తున్నాయని, 2020 నాటికి వీటి సంఖ్య 11, 500 కు చేరుకుంటుందన్నారు. భవిష్యత్తు నవీకరణలదే... స్టార్టప్ రంగంలో కొత్త ఉత్పత్తులను రాబోయే తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించేవారికే మార్కెట్ ఉంటుందని అట్యూన్ సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ కుమార్ తెలిపారు. సృజనాత్మక ఆలోచనలతో వచ్చే వారికి నిధుల సమస్య లేదని, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇన్టెన్స్ టెక్ వ్యవస్థాపకుడు సీకే శాస్త్రి చెప్పారు. -
నెట్ న్యూట్రాలిటీపై వివాదం
-
నెట్ న్యూట్రాలిటీపై నెలలో నివేదిక
* టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడి * టెల్కోల ప్లాన్లపై సీసీఐ విచారణకూ అవకాశం న్యూఢిల్లీ: పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న ‘నెట్ న్యూ ట్రాలిటీ ’ అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం వెల్లడించారు. జనవరిలో ఏర్పాటైన ఈ కమిటీ ‘నెట్ న్యూట్రాలిటీ’ ప్రయోజనాలు, ప్రతికూలతలు, పరిమితులపై మరో నెలరోజుల్లోగా (మే రెండో వారంలోగా) నివేదికను సమర్పించగలదని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోగలదని చెప్పారు. ఇంటర్నెట్ అనేది అత్యద్భుత ఆవిష్కరణల్లో ఒకటని, అది ఏ ఒక్క దేశానికో, సమాజానికో పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అట్టడుగు వర్గాల వారికి కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. మరోవైపు, కొన్ని యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకునేలా ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, యూనినార్ తదితర టెలికం ఆపరేటర్లు అందిస్తున్న స్కీమ్‌లపై గుత్తాధిపత్య ధోరణులను నియంత్రించే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా గత నెలలో నెట్‌న్యూట్రాలిటీపై చర్చాపత్రాన్ని రూపొందించింది. ఇదీ వివాదం.. ఇంటర్నెట్ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసింది. ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెల్కోలు ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎయిర్టెల్ జీరో పేరిట కొత్తగా డేటా ప్లాన్ ప్రవేశపెట్టిన టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌పైనా, ఇంటర్నెట్ డాట్‌ఆర్గ్ ప్రారంభించిన ఫేస్బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛను కోరుకునే వారిలో లక్షమంది పైగా యూజర్లు ‘నెట్ న్యూట్రాలిటీ’ని కాపాడాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సేవ్దిఇంటర్నెట్డాట్ఇన్ వెబ్సైట్ ద్వారా మెయిల్స్ పంపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ట్విటర్ ద్వారా నెట్ న్యూట్రాలిటీకి తన మద్దతు తెలిపారు. అయితే, తాము అందిస్తున్న కొత్త సర్వీసులు అన్ని వర్గాలకూ ప్రయోజనకరం అంటూ ఎయిర్టెల్ సమర్ధించుకుంది. -
ప్లీజ్.. ఆ పని చేయకండి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకొని యధాతథ స్థితిని కొనసాగించాలని భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు కోరుతున్నారు. అందుకోసం టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు దాదాపు లక్ష మెయిల్స్‌ను savetheinternet.in. ద్వారా పంపించారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు మరికొందరు కలిసి భారీ స్థాయిలో ఈ విషయంలో స్పందించారు. వాట్సాప్, ఫ్లిఫ్‌కార్ట్, స్కైప్వంటి కొన్ని ప్రత్యేక యాప్‌లు, వెబ్సైట్లను వాడే వ్యక్తుల నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయడమే కాకుండా, మరికొన్నింటిని నిషేధించాలని ట్రాయ్ నిబంధనలు తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం వారం రోజుల్లోగా అభిప్రాయం తెలపాల్సిందిగా కోరింది. దీంతో ఇంటర్నెట్ వినియోగదారులు, డీలర్లు భారీగా స్పందించి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని కోరారు.