
ప్లీజ్.. ఆ పని చేయకండి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకొని యధాతథ స్థితిని కొనసాగించాలని భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు కోరుతున్నారు. అందుకోసం టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు దాదాపు లక్ష మెయిల్స్ను savetheinternet.in. ద్వారా పంపించారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు మరికొందరు కలిసి భారీ స్థాయిలో ఈ విషయంలో స్పందించారు.
వాట్సాప్, ఫ్లిఫ్కార్ట్, స్కైప్వంటి కొన్ని ప్రత్యేక యాప్లు, వెబ్సైట్లను వాడే వ్యక్తుల నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయడమే కాకుండా, మరికొన్నింటిని నిషేధించాలని ట్రాయ్ నిబంధనలు తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం వారం రోజుల్లోగా అభిప్రాయం తెలపాల్సిందిగా కోరింది. దీంతో ఇంటర్నెట్ వినియోగదారులు, డీలర్లు భారీగా స్పందించి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని కోరారు.