లోక్సభలో ఇంటర్నెట్ దుమారం | Government wants to hand over internet to corporate: Rahul on net neutrality | Sakshi
Sakshi News home page

లోక్సభలో ఇంటర్నెట్ దుమారం

Published Wed, Apr 22 2015 1:13 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

లోక్సభలో ఇంటర్నెట్ దుమారం

లోక్సభలో ఇంటర్నెట్ దుమారం

న్యూఢిల్లీ : లోక్సభలో బుధవారం ఇంటర్నెట్లో నెట్ న్యూట్రాలిటీ దుమారం చెలరేగింది.  లోక్‌సభలో నెట్ న్యూట్రాలిటీపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంటర్నెట్ను కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెట్ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ను కార్పొరెట్ కంపెనీల చేతిలో పెట్టడం సరికాదన్నారు. ఈ అంశంపై చర్చించాలని రాహుల్ ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు.

దీనిపై టెలికంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్  సమాధానం ఇస్తూ నెట్ న్యూట్రాలిటీకి తాము కట్టుబడి ఉన్నాం.  యూపీఏ సర్కార్లాగా తాము కార్పొరేట్లకు ఎప్పుడూ తలవంచలేదని, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న 'నెట్ న్యూ ట్రాలిటీ' అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.  దీన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదీ వివాదం..
ఇంటర్నెట్ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసింది. ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెల్కోలు ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement