Sumitra Mahajan
-
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీకు ఎందుకు అంత తొందర: సుమిత్ర మహాజన్
న్యూఢిల్లీ: తను చనిపోయినట్లు వస్తున్న తప్పుడు వార్తలపై లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ శుక్రవారం స్పందించారు. తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా మరణం గురించి ఇండోర్ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా న్యూస్ ఛానల్స్ చనిపోయినట్లు ఎలా చెబుతాయి. నా మేనకోడలు థరూర్‌ను ట్విటర్లో ఖండించారు. కానీ ధృవీకరించకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముంది’. అని ప్రశ్నించారు. కాగా సుమిత్ర మహాజన్ చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆమెకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని, ఆరోగ్యంగా ఉందని ఆమె మేనకోడలు, బీజేపీ నేతలు చెప్పడంతో వెంటనే శశిథరూర్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనతోపాటు కొన్ని మీడియా ఛానళ్లు సైతం తప్పుగా ప్రసారం చేశాయి. అయితే నిజం తెలిశాక ఆమె చనిపోలేదని మళ్లీ పేర్కొన్నాయి. ఇక మహజన్ కుమారుడు మందర్ సైతం తన తల్లి ఆరోగ్యంపై ఓ వీడియో పెట్టారు., తన తల్లి బాగానే ఉందని, ఆమె గురించి వస్తున్న తప్పుడు వార్తలకు నమ్మవద్దని ప్రజలను కోరారు. చదవండి: రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్ కోర్టు నోటీసులు -
రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్?
సాక్షి, బెంగళూరు: రాష్ట్రానికి త్వరలో కొత్త రాజప్రతినిధి రాబోతున్నారా?, గవర్నర్ మార్పు తప్పదా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజుభాయి రుడాభాయి వాలాకు విశ్రాంతి నిస్తారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించే విషయమై కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హృదయ సంబంధిత వ్యాధితో గత మూడు రోజులుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని అక్కడి వైద్యులు సూచించారు. 2014, నవంబర్ 1న కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన వీఆర్ వాలా ఇటీవలే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్‌గా సజావుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అనేక రాజకీయ సంక్షోభాల మధ్య కూడా వివాదాలకు చోటియ్యకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్ తదుపరి గవర్నర్‌గా రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధానికి, హోంమంత్రికి చెప్పారా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల్లో గవర్నర్ పదవిని నిర్వహించడం వాలాకు కష్టంగా మారిందని ఆయనే స్వయంగా కేంద్రానికి విన్నవించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రానికి కొత్త గవర్నర్ అనివార్యంగా మారింది. కొన్నిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలసిన ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకకు తగిన గవర్నర్ లభించే వరకు కొన్నిరోజుల పాటు ఆ బాధ్యతలు చేపట్టాలని వాలాకు వారిరువురు సూచించినట్లు సమాచారం. అప్పటి నుంచి అయిష్టంగానే గవర్నర్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఎప్పుడైనా కొత్త గవర్నర్ ప్రకటన వెలువడచ్చని రాజకీయ వర్గాల కథనం. రేసులో సుమిత్రా మహాజన్ వీఆర్ వాలా తరువాత భర్తీ చేసేదెవరనేదానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యంత సంపన్న రాజ్‌భవన్ ఒక్క కర్ణాటకకే సొంతం. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలిసింది. కాగా, చాలా మంది లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఉమాభారతి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేసింది. ఉమాభారతిని గవర్నర్‌గా నియమిస్తే పలు వివాదాలు తలెత్తుతాయని కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలిసింది. వివాదరహితులుగా పేరొందిన సుమిత్రా మహాజన్ అయితే ఎలా ఉంటుందనే విషయంపై కూడా కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలిసింది. -
లోక్‌సభ స్పీకర్: ఎవరీ ఓం బిర్లా..
ఓం బిర్లా.. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశమైంది. కేవలం రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయిన బిర్లా బుధవారం 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పేరును బీజేపీ ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా సీనియర్ నేతలను స్పీకర్ పదవికి పరిగణలోకి తీసుకుంటారు. గత లోక్‌సభ స్పీకర్‌గా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇకపై పార్టీలోనూ, చట్టసభల్లోనూ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలను బిర్లాను ఎంపిక చేయడం ద్వారా ప్రధాని మోదీ పంపారనే తెలుస్తోంది. ఎవరీ ఓం బిర్లా.. ఓం బిర్లా 1969 నవంబర్ 23న రాజస్తాన్‌లోని కోటాలో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిర్లా, తల్లి శకుంతల దేవి. బిర్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన వారు. ఓం బిర్లా తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాజస్తాన్‌లోనే పూర్తి చేశారు. 12వ తరగతి అనంతరం బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కోటాలోని కామర్స్ కాలేజీలో, అజ్మీర్‌లోని మహర్షి దయానంద సరస్వతి విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. 1991లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అమితా బిడాలీని వివాహం చేసుకున్నారు. కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బిర్లా భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరుకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1997 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2003లో కోటా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శాంతి ధారీవాల్‌ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2008లో కోటా నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ నేత రామ్ కిషన్ వర్మను 24 వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మొత్తం మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కోటా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సునాయాసంగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కోట నుంచి పోటీ చేసిన ఆయనను స్పీకర్ పదవి వరించింది. చురుకైన నేతగా, అప్పగించిన పనికంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద బిర్లాకు మంచి గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియయనిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న బిర్లా స్పీకర్ పదవికి అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించడంతో ఆయనను సభాపతి పదవి వరించినట్టు తెలుస్తోంది. బిర్లాను స్పీకర్‌గా బీజేపీ ప్రతిపాదించగా ఎన్డీయే వర్గాలతోపాటు ఏఐఏడీఎంకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్‌గా బిర్లాకు మద్దతునిస్తున్నట్లు లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ చౌదరి తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికయిన బిర్లాను ప్రధాని మోదీ సాదరంగా తీసుకువెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. మొదటిసారి లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భరాలు గతంలోనూ ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైన మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 16వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. -
‘నన్ను మందలించగల వ్యక్తి ఆమె మాత్రమే’
భోపాల్ : లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన రెండో మహిళ సుమిత్రా మహాజన్. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేకుండా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన మహాజన్.. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. పదవిలో ఉండగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఇండోర్ ప్రజల అభిమానాన్ని గెల్చుకున్నారు సుమిత్రా మహాజన్. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలు ఆమెను ‘తాయి’ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఈ క్రమంలో ఆదివారం ఇండోర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సుమిత్రా మహజన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంభంధించి ఏ విషయంలోనైనా సరే మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ స్పీకర్‌గా తాయి తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ప్రజల మనసులో ఆమె పట్ల చాలా మంచి అభిప్రాయం ఉంది. మీ అందరికి నేను ఈ దేశ ప్రధానిగానే తెలుసు. ఇప్పుడు నేను చెప్పేబోయే విషయం నా పార్టీలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏ విషయంలోనైనా సరే నన్ను మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి మాత్రమే’ అని చెప్పారు. అంతేకాక మేమిద్దరం బీజేపీ కోసం కలసి పని చేశాం. పని పట్ల ఆమెకు చాలా శ్రద్ధ. ఇండోర్ అభివృద్ధి విషయంలో తాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు అని ప్రశంసించారు. -
11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత...
మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వాళ్లు మళ్లీ ఆ పదవి పొందాలని ఆశించడం సహజమే. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. వాజపేయి, అడ్వాణీ, ఇంద్రజిత్ గుప్తా, సుమిత్రా మçహాజన్ వంటి వారు కొందరు అనేక సార్లు ఎంపీలుగా గెలిచినా మెజారిటీ ఎంపీలకు రెండో అవకాశం దక్కలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1951 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే... 60 శాతం ఎంపీలు అంటే ప్రతి ఐదుగురిలో ముగ్గురు రెండోసారి ఎంపీ కాలేకపోయారు. ఇంత వరకు జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4,843 మంది ఎంపీలుగా (నామినేట్ ఎంపీలు 22 మంది కాకుండా) ఎన్నికయ్యారు. వీరిలో 2,840 మంది రెండోసారి ఎంపీలుగా ఎన్నిక కాలేదు. మిగిలిన 2003 మందిలో 50 శాతం మంది మూడోసారి ఎన్నికకాలేదు. అంటే వీరు రెండు సార్లు మాత్రమే గెలిచారు. మొత్తం ఎంపీల్లో 999 మంది రెండుసార్లు, 502 మంది మూడుసార్లు, 249 మంది నాలుగు సార్లు, 134 మంది ఐదు సార్లు గెలిచారు. ఒకసారికి మించి లోక్‌సభకు ఎన్నిక కాని వాళ్ల సంగతి ఇలా ఉంటే, కొందరు అనేకసార్లు పార్లమెంటుకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఇంద్రజిత్ గుప్తా 11 సార్లు ఎన్నికయి దేశంలో ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర నెలకొల్పారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి, సోమనాథ్ చటర్జీ, పీఎం సయీద్‌లు పదేసి సార్లు ఎంపీలయ్యారు. వీరు కాక తొమ్మిది మంది నాయకులు 9 సార్లు, పద్దెనిమిది మంది ఎనిమిది సార్లు, 34 మంది ఏడుసార్లు, 54 మంది 6 సార్లు,134 మంది ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక నామినేటెడ్ ఎంపీల విషయానికి వస్తే ఇంత వరకు మొత్తం 22 మంది లోక్‌సభకు నామినేట్ కాగా వారిలో చాలా మంది కేవలం ఒకసారే నామినేట్ అయ్యారు. అయితే, ఆంగ్లో ఇండియన్ ఫ్రాంక్ అంటోనీ ఏకంగా 8సార్లు నామినేట్ అయి రికార్డు సృష్టించారు. ఏఈటీ బారో ఏడు సార్లు ఆంగ్లో ఇండియన్ సభ్యునిగా పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. -
విజయానికి మారు పేర్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత తేలికయిన విషయమేమీ కాదు. కానీ, కొందరు రాజకీయ నేతలు గెలుపునే అలవాటుగా మార్చుకున్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇంత ఈజీయా అనుకునేలా దశాబ్దాలపాటు కొనసాగారు. కొందరు ఇంకా కొనసాగుతున్నారు. ఉదాహరణకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. బీజేపీకి చెందిన ఈమె ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, కాంగ్రెస్‌కు చెందిన కె.హెచ్.మునియప్ప కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఏడుసార్లు క్రమం తప్పకుండా ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా 8వసారీ బరిలో నిలిచారు. వీరందరినీ మించి ఇంద్రజిత్ గుప్తా 11 పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర భారతంలో లోక్‌సభ సభ్యులుగా అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న కొందరు హేమాహేమీల వివరాలివీ.. ఇంద్రజిత్ గుప్తా, మనేకా గాంధీ, కమల్ నాథ్ -
లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం!
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ఎనిమిది సార్లు వరుసగా గెలుపొందిన ఆమె ఈసారి పోటీ చేయడం లేదని శుక్రవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన బీజేపీ.. ఇండోర్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ మహాజన్‌కు టికెట్ ఇస్తారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ తానే పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా అధిష్టానం త్వరగా ఇండోర్ అభ్యర్థిని నిర్ణయించాలని ఆమె సూచించారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత విజయ్వార్గియా పేరు బీజేపీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న సుమిత్ర మహాజన్ 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. రాజకీయాల్లో 75 సంవత్సరాల తర్వాత గెలుపు అవకాశాలు తగ్గుతాయన్న కారణంతోనే సుమిత్రను బీజేపీ పక్కన పెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా!
సాక్షి వెబ్ ప్రత్యేకం (భోపాల్): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ విపక్ష బీజేపీ నేత గోపాల్ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు తమ వారసులకు లోక్‌సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉపయోగించే గోపాల్ భార్గవ కుమారుడు అభిషేక్ ప్రస్తుత మధ్యప్రదేశ్ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారసులూ అర్హులే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్ కూడా తన కూతురు మౌసమ్ బీ సేన్‌కు బాలాఘాట్ నియోజకవర్గ లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి మాజీ మంత్రి గౌరీ శంకర్ షెజ్వార్ తనయుడు ముదిత్ ఈసారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్ తోమర్ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న వారసత్వ రగడను చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
‘సీఆర్ఐ పంప్స్’కు ఎన్ఈసీ అవార్డ్
విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్ఐ పంప్స్ తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2018’ని అందుకుంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అవార్డును అందుకోవడం ఇది 4వసారి. వినూత్న రూపకల్పన, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లకు విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్‌ను అందిస్తున్నాం. అనుకున్న కార్యంలో విజయవంతమైనందుకు కస్టమర్లు, డీలర్లు, స్టేక్ హోలర్లకు దన్యవాదాలు.’ అని వ్యాఖ్యానించారు. -
మీ కంటే స్కూల్ పిల్లలు నయం..
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల శైలిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె విఫలయత్నం చేశారు. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయమని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పాలక బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఎంపీల తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. పార్లమెంటేరియన్ల కంటే స్కూల్ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్ గాంధీయే క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘మీడియా చెప్పిందల్లా నిజం కాదు’
న్యూఢిల్లీ : భారత్‌లో మహిళల భద్రత గురించి మీడియా క్రియేట్ చేసిన ఒపినియన్ వల్లే మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం ఏర్పడిందంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(ఐఐఎమ్‌సీ) 51వ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. న్యూస్ పేపర్లు, టీవీ చానెళ్లు పార్లమెంట్లో జరిగే నిరసనలు కవర్ చేయడానికి ఉత్సాహం చూపిస్తాయి.. కానీ సమాజానికి ఉపయోగపడే అంశాల గురించి నడిచే డిబేట్లను ప్రసారం చేయవంటూ విమర్శించారు. ఇక్కడ మహిళలు రోడ్ల మీద తిరగరు.. అంత మాత్రం చేత భారత్‌లో ఉన్న మహిళలు సురక్షితంగా లేరని చెప్పలేం కదా అన్నారు. అంతేకాక నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది మేడం.. మీ దేశం ఇప్పటికి కూడా సురక్షితం కాదా అంటూ అక్కడి జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు అని తెలిపారు. అప్పుడు నేను గత 75 ఏళ్లుగా నేను ఇండియాలో ఉంటున్నాను.. నాకేం కాలేదు.. నా కూతురికి గాని.. కోడలికి గాని ఏం కాలేదు. మీరనుకుంటున్నట్లు ఏం లేదు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మా దేశంలోను.. మీ దేశంలోను.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ప్రజలు నేరాలు చేస్తుంటారు. అంటే ఆ దేశంలో నేరాలు మాత్రమే జరుగుతాయా.. వేరే ఏం జరగవా అని వారిని అడుగుతాను అని తెలిపారు. అలానే రాజకీయాల్లో ఎప్పుడు అసభ్య పదజాలమే వాడము కదా.. కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడతాము. కానీ వాటి గురించి మీడియా పట్టించుకోదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సమాజానికి ఏం అవసరముంది.. కానీ మనం ఎలాంటి వార్తలు ప్రచురిస్తున్నాం అనే విషయం గురించి మీడియా సంస్థలు ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్‌కు పరిస్థితిని విశ్లేషించే సామర్ధ్యం కలిగి ఉండటం చాలా ప్రధానం అని తెలిపారు. -
రిజర్వేషన్లపై సుమిత్రా మహాజన్ కీలక వ్యాఖ్యలు
-
‘రిజర్వేషన్లతో ప్రయోజనం ఏంటి?’
రాంచీ : రిజర్వేషన్ల వల్ల దేశానికి ఏమైనా మేలు జరిగిందా, వెనకబడిన వర్గాలు అభివృద్ది సాధించాయా.. అంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘లోన్ మానథాన్’ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సామాజిక సామరస్యాన్ని సాధించడం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వాతంత్ర్యనంతరం పదేళ్ల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలవారికి తగు ప్రాధాన్యత కల్పించడం కోసం రిజర్వేషన్లు ఉద్దేశించబడినవి. కానీ అవే రిజర్వేషన్ల వల్ల నేడు ఆయా రంగాల్లో తీవ్ర శూన్యత ఏర్పడింది. కేవలం పదేళ్లు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను ప్రతి పదేళ్లకోసారి పొడిగిస్తూ పోవడం వల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం సమకూరిందా? సామాజిక ప్రగతి సాధించాలంటే కావాల్సింది రిజర్వేషన్ల కాలపరిమితిని పొడగించడం కాదు. సామాజిక సామరస్యం సాధించే దిశగా మన ఆలోచనల్ని, చేతల్ని మార్చుకోవాలి. అప్పుడే అంబేద్కర్ కలలు కన్న సమాజం సిద్ధిస్తుంద’ని తెలిపారు. బీజేపీ పార్టీ రిజర్వేషన్లను ముగింపు పలకనున్నదని ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కావాలనే తమ ప్రభుత్వం గురించి అసత్య ప్రచారం చేస్తోందని.. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రకటించారు. -
ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణం అనర్హత వేటు వేయాలని, తద్వారా ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వినతిపత్రాన్ని శుక్రవారం స్పీకర్‌కు సమర్పించారు. ‘‘వైఎస్సార్సీపీ టిక్కెట్లపై గెలుపొంది ఇతర పార్టీల్లోకి ఫిరాయించి రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పి.శ్రీనివాస్‌రెడ్డి, బుట్టా రేణుకలను అనర్హులుగా ప్రకటించాలని జనవరి 3, 2018న అప్పుడు చీఫ్‌విప్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి మీకు లేఖ రాశారు. నంద్యాల నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో మాపార్టీ టికెట్‌పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి వారం రోజులకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలోకి ఫిరాయించారు. అలాగే మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా టీడీపీలోకి ఫిరాయించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని బలహీనపరచాలన్న ఉద్దేశంతో అధికారపార్టీ అనేక ఆశలు చూపి వీరికి వల విసిరింది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మాపార్టీ టికెట్‌పై పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు.వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని మా పార్టీ డిసెంబర్ 14, 2016న మీ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై అనర్హత నిర్ణయం ప్రకటించలేదు. ఈ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనందువల్ల.. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఎలాంటి చర్యలు ఉండవన్న సంకేతాన్నిస్తూ ఇతర ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించేందుకు విశ్వాసం కలిగించింది. అక్టోబర్ 17, 2017న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా మా పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. ఆమెపైనా పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని మీవద్ద పిటిషన్ దాఖలు చేశాం. ఈ నలుగురు సభ్యులు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇచ్చే అధికారిక సమాచారానికి మాత్రం స్పందించట్లేదు..’’ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి.. ‘‘అధికారపార్టీలు పెట్టే ఆశలతో ప్రేరేపితమైన రాజకీయ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తి పునాదులకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరంగా దాపురించాయన్న ఉద్దేశంతో వీటిని అరికట్టేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని తెచ్చుకున్నాం. ఒకపార్టీ నుంచి చట్టసభల సభ్యుడిగా ఎన్నికై.. మరో పార్టీకి వెళితే వారిని అనర్హులుగా చేయాలని ఈ చట్టం తెచ్చుకున్నాం. రాజ్యాంగంలో ఇంతటి బలమైన నిబంధనలున్నప్పటికీ సభ్యులు స్వేచ్ఛగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. అనర్హత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సభాపతులపై ఉండగా వారు నిర్ణయం తీసుకోకపోగా ఇతరులు సైతం ఫిరాయించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ రకంగా ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఓడిపోవడమేగాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రమాదకరమైన ధోరణి ప్రబలేందుకు కారణమైంది. ఇటీవల ఈ ఫిరాయింపులు మరింత విశృంఖలంంగా బహిరంగంగా మీడియా సమక్షంలోనే జరుగుతుండడం మనం చూస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ ఇటీవల శరద్ యాదవ్, అన్వర్ అలీలపై పిటిషన్ వచ్చిన 90 రోజుల్లోపే నిర్ణయం తీసుకుని అనర్హులుగా ప్రకటించారు. అలాంటి వేగవంతమైన నిర్ణయాలు ఫిరాయింపులను అరికట్టడమేగాక ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉద్దేశాన్ని నెరవేర్చుతాయి. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలపై చర్య తీసుకుని మీరు మార్గదర్శిగా నిలవాలని కోరుతున్నా. ఆ నలుగురు సభ్యులపై అనర్హత వేటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్నా..’’ అని విజయసాయిరెడ్డి విన్నవించారు. -
‘అవిశ్వాసం’పై బీజేపీ పక్కా వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. సభ సవ్యంగా నడవడం లేదని, గందరగోళ పరిస్థితుల మధ్య అవిశ్వాసాన్ని అనుమతించలేనని అందుకు ఆమె సాకు కూడా చెప్పారు. మళ్లీ ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందే తడవుగా లోక్‌సభ స్పీకర్ అందుకు అనుమతించారు. ఎందుకు? నాటికి నేటికి మారిన పరిస్థితులు ఏమిటీ? నాడైనా, నేడైనా అవిశ్వాస తీర్మానం కారణంగా మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు. నాడు తెలుగు దేశం పార్టీ అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇది కొంత పాలకపక్ష బీజేపీకి అసంతృప్తి కలిగించే అంశమే. ప్రతిపక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే అవి తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే కేంద్రంపై అవిశ్వాసానికి ముందుకు వచ్చాయి. కావేరీ నుంచి తమిళనాడుకు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదంటూ కర్ణాటక పాలక, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సమీపంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అవిశ్వాసాన్ని అనుమతిస్తే పరువు పోగొట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ భయపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేక తడబడాల్సి వస్తుందన్న ఆందోళన. అప్పుడు అవిశ్వాసంపై చర్చకు ప్రాంతీయ పార్టీలే ముందున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. అవిశ్వాసంపై చర్చకు కాంగ్రెస్ పార్టీయే ముందుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తన నాయకత్వాన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలన్న సంకల్పం నుంచి వచ్చింది కాంగ్రెస్‌కు ఈ చొరవ. అందుకని అవిశ్వాసంపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగితే ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుందన్నది బీజేపీ వ్యూహం. ఈ విషయాన్ని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పలువురు బీజేపీ నాయకులు ధ్రువీకరించారు. వారికి తమ నాయకుడు నరేంద్ర మోదీ ప్రసంగం లేదా వాగ్వాద నైపుణ్యంపై ఎంతో నమ్మకం ఉంది. కాంగ్రెస్ ముస్లిం పురుషులను మెప్పించే పార్టీ అనే ప్రచారం, తలాక్‌కు వ్యతిరేకమంటూ ధ్వజమెత్తడం ద్వారా ఆ పార్టీని సులభంగానే ఎదుర్కోవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన తలాక్ బిల్లు రాజ్యసభలో కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆమోదం పొందని విషయం తెల్సిందే. కశ్మీర్లో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కఠిన వైఖరి కూడా తమకు ఎంతో ఉపయోగ పడుతుందని బీజేపీ భావిస్తోంది. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే ముఫ్తీ మెహబూబా ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్నామన్న ప్రచారం కూడా తమకు బాగానే ఉపయోగ పడుతుందన్న ఆలోచన. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అవిశ్వాసాన్ని తిరస్కరించి అభాసుపాలవడం కంటే ఆమోదించి ఎదుర్కోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చింది. అవిశ్వాసాన్ని నెగ్గడం ద్వారా ప్రతిపక్షాన్ని దూషించి ప్రజల మన్ననలను పొందవచ్చు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న పై మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమూ కావచ్చు అన్నది బీజేపీ వ్యూహంలో భాగం. అందుకనే అవిశ్వాసంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ ‘చర్చ నుంచి పారిపోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని చూస్తున్నాం. ప్రతిపక్షాల అబద్ధాలకు అడ్డుకట్ట వేయదల్చుకున్నాం. ఏ ప్రశ్ననైనా ఎదుర్కోవడానికి, దానికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, గోసంరక్షకుల దాడులు, పిల్లల కిడ్నాపర్ల పేరిట అల్లరి మూకల హత్యలు, మహిళలపై అత్యాచారాలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీయవచ్చు. అయితే అందులో ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్న. -
ఎట్టకేలకు అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సభలో చదవి వినిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50కి పైగా సభ్యుల మద్దతు లభించడంతో పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపకపోవడం గమనార్హం. టీడీపీ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందస్తుగానే సంకేతమిచ్చారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే త్వరలో తేదీ ప్రకటిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 పనిదినాల పాటే జరగనుండటంతో రెండు మూడు రోజుల్లో చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మాన నోటిసులిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని విషయాలు వెల్లడిస్తామని, పార్లమెంట్ వ్యవహారాల శాక మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. -
అంతరాయం కలిగించకండి.. ప్లీజ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇతర పార్టీల సభ్యులు చేశారంటూ తమ వాదనలను సమర్ధించుకోవాలనుకుంటే అంతరాయాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులకు ఆమె లేఖ రాశారు. ‘మన పార్లమెంట్, మన ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి పార్లమెంట్ గౌరవం, పవిత్రతను కాపాడే లక్ష్యం మనందరిదీ’ అని పేర్కొన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటమే కాదు, దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పటిష్టానికి మీరు కృషి చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు. సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ..తమ అభిప్రాయాలను, డిమాండ్లను తెలిపేందుకు కొన్ని పరిమితులు, నిబంధనలు ఉంటాయన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో రాజకీయ పోరు సాగిస్తూనే సభ్యులు ప్రజాస్వామ్యయుత బాధ్యతలను కూడా సభలో నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. మరో 5 భాషలకు ఛాన్స్ రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషలకు గాను తెలుగు సహా 12 భాషల్లో మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఉంది. కొత్తగా డొంగ్రి, కశ్మీరీ, కొంకణి, సంథాలీ, సింధి భాషల్లో సభ్యులు మాట్లాడేందుకు వీలుగా శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పొందిన అనువాదకులకు నియమించినట్లు తెలిపారు. -
‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడం హర్షణీయమన్నారు. సంవత్సరం పాటు పదవులను వదులుకోవడం మాములు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం ఎవరు పోరాటం చేసిన వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని చలసాని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని ఆయన అన్నారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, అధికార పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా కాలం గడిపేస్తోంది. -
హోదా కోసం చేసిన వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం!
-
రాజీనామాలపై ఫలించిన వైఎస్సార్సీపీ ఎంపీల నిరీక్షణ
-
వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలను ఆమోదించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఎంపీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై పార్లమెంట్ బులెటిన్ ద్వారా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలను కోరిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయంలో మార్పు లేదని వారు తేల్చిచెప్పారు. బుధవారం మరోసారి స్పీకర్‌ను కలిశారు. ఉదయం 11 గంటలకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినా ష్‌రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్పీకర్‌ను ఆమె చాంబర్లో కలిశారు. వీరివెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం.. స్పీకర్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు అరగంటకు పైగా సమావేశమయ్యారు. రాజీనామాలపై మరోసారి పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించగా... తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ సభ్యులు కోరారు. దీనిపై రాతపూర్వకంగా మరోసారి నిర్ణయాన్ని(రీ కన్ఫర్మేషన్) తెలపాలని స్పీకర్ సూచించడంతో ఆ మేరకు ఎంపీలు లేఖలు సమర్పించారు. ‘‘16వ లోక్‌సభ సభ్యత్వానికి నేను 2018 ఏప్రిల్ 6న రాజీనామా చేశాను. ఈ రాజీనామాపై పునరాలోచించాలని మే 29న మీరు(స్పీకర్) సూచించారు. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. నేను ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. నా రాజీనామాను ఆమోదించాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను’’ అని రాసి ఉన్న లేఖలను లోక్‌సభ సభ్యులు విడివిడిగా సభాపతికి అందజేశారు. ‘హోదా’ కోసం పదవీ త్యాగం ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తుదికంటా పోరాటం చేస్తారని, కేంద్రం స్పందించకపోతే వారంతా పదవులకు రాజీనామా చేస్తారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 1న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మార్చి 5న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ పార్టీ తరపున ఎన్డీయే ప్రభుత్వంపై మార్చి 22న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు కుదిస్తారనే వార్తలు రావడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు నిర్ధేశిత తేదీ కంటే ముందుగానే.. మార్చి 15న కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడంతో ఆ తర్వాత వైఎస్సార్సీపీ వరుసగా 13 అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. 12 నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభలో ప్రస్తావించారు. అయితే, సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నందువల్ల వాటిపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్ జగన్ మార్చి 31న స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 వరకూ ప్రత్యేక హోదా కోసం సభలో నినదించిన వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి సమావేశాలు వాయిదా పడగానే నేరుగా స్పీకర్ చాంబర్‌కు వెళ్లి, స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖలను సమర్పించారు. అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వచ్చి అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో తేల్చిచెప్పారు. వారి రాజీనామాల ఆమోదానికి స్పీకర్ తాజాగా అంగీకారం తెలిపారు. -
‘టీడీపీ డ్రామాలను దేశమంతా చూసింది’
సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌పై మరోసారి ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఐదుగురు వైఎఎస్సార్ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ చేసిన డ్రామాలను దేశమంతా చూసిందని, నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఏం సాధించారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని, హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొదటినుంచీ హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉందని, ఇందుకోసం వైఎస్సార్ సీపీ ఎంపీలందరం ఆమరణ దీక్ష చేశామని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు హేళన చేశారని, తర్వాత యూటర్న్ తీసుకుని టీడీపీ కూడా అవిశ్వాసం పెట్టలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. -
రాజీనామాల ఆమోదం కోసం...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయి తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరనున్నారు. ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. బడ్జెట్ సెషన్స్ చివరిరోజు రాజీనామాలు చేసిన ఎంపీలు.. అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాజీనామాల విషయంలో పునరాలోచన చేయాలని స్పీకర్ ఇంతకు ముందు ఎంపీలను కోరారు. కానీ, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని ఎంపీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
ఎల్లుండి స్పీకర్‌ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సమావేశాల్లో సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ ఎంపీలు.. సమావేశాలు ముగిసిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశ రాజధాని హస్తిన వేదికగా ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. అన్నాపానాలు ముట్టక దీక్ష చేయడంతో ఎంపీల ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించి.. నిరాహార దీక్షలు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కంటే తమకు పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల స్పీకర్‌తో భేటీలోనూ వారు ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే, రాజీనామాలపై పునరాలోచన చేయాలని స్పీకర్ ఎంపీలను సూచించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి స్పీకర్‌ను కలువబోతున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి కోరబోతున్నారు. -
తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి
-
తక్షణం ఆమోదించండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యత్వాలకు ఏప్రిల్ 6వ తేదీన తాము సమర్పించిన రాజీనామాలను ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే ఆమోదించాలని వైఎస్సార్ సీపీ లోక్‌సభ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు. సభాపతి పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న ఎంపీలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సభాపతి కోరినా ఎంపీలు ససేమిరా అన్నారు. పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి స్పీకర్‌తో భేటీ అయినవారిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా వారి వెంట వచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిసేముందు, ఆ తరువాత పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. కేంద్రం వైఖరితో విసిగిపోయాం: మేకపాటి ‘ఎవరైనా రాజీనామా చేస్తే స్పీకర్ గారు ఎగ్జామిన్ చేస్తారు. ఆమెపై ఆ బాధ్యత ఉంటుంది. కర్ణాటక వ్యవహారం వేరు. ఇది భిన్నమైన అంశం. ఐదుగురం ఒకేసారి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించాం. ఎందుకు రాజీనామా చేస్తున్నారని అడిగారు. మీ ఆందోళనలను పార్లమెంటు వేదికపై వినిపించవచ్చు కదా అన్నారు. మేం అన్ని ప్రయత్నాలూ చేశామని, కేంద్రం వైఖరితో విసిగి వేసారి పోయామని చెప్పాం. పార్లమెంటులో చేసిన వాగ్దానాలు అమలుకాకపోతే ఎలా? అని అడిగాం. తక్షణం రాజీనామాలు ఆమోదించాలని కోరాం. మూడు నాలుగు రోజుల్లోగా ఆమోదించకుంటే మళ్లీ కలసి అడుగుతాం. సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కైన ప్రత్యేక హోదాను నీరుగార్చేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజలను చైతన్యపరుస్తుంటే చంద్రబాబు యువభేరి కార్యక్రమాలకు వెళ్లేవారిపై పీడీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టించారు. జగన్ పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు మద్దతు పలకడంతో భయపడ్డ చంద్రబాబు రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా పాట పాడుతున్నారు’ అని మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ‘ఈరోజు స్పీకర్ ఇచ్చిన సమయం ప్రకారం ఆమెను కలిసి దాదాపు గంటసేపు మాట్లాడాం. మా రాజీనామాలు తక్షణం ఆమోదించండి. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాం. మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని గట్టిగా కోరాం. అసెంబ్లీకి ఎన్నికైన వారు 14 రోజుల్లోపు ఇక్కడైనా రాజీనామా చేయాలి లేదా అక్కడైనా రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పక్షంలో నిబంధనల ప్రకారం తాను రాజీనామాలను ఆమోదించాల్సిన పని లేకుండానే ఆమోదించినట్టుగానే పరిగణించాల్సి వస్తుందని కర్ణాటక విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం ఆమె సెక్రటరీ జనరల్‌తో చర్చించారు. రాజీనామాలు ఆమోదం పొందేందుకు వీలుగా స్పీకర్ ఫార్మాట్లోనే సమర్పించాం. మేం చిత్తశుద్ధితో రాజీనామాలు చేశాం. రాజీనామాలు ఆమోదింప చేసుకుని ఉప ఎన్నికలకు వెళ్తాం. హోదా అనేది ఎంత బలమైన అంశమో ఉప ఎన్నికల ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేస్తాం’ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. త్వరలో మళ్లీ కలుస్తాం: ఎంపీ వరప్రసాదరావు ‘ఇప్పటికే ఆలస్యమైంది. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరాం. నాలుగైదు రోజుల్లో మళ్లీ కలసి రాజీనామాలు ఆమోదించాలని అడుగుతాం. అది మా హక్కు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్రం నిధులిస్తే ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడవచ్చనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో గత 60 ఏళ్లలో రూ. 80 వేల కోట్లు అప్పు చేస్తే.. గత నాలుగేళ్లలోనే ఏపీపై రూ. 1.20 లక్షల కోట్ల అప్పు భారం పడింది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు’ ’ అని వరప్రసాదరావు పేర్కొన్నారు ఉప ఎన్నికలకు మేం సిద్ధం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ‘రాజీనామాలను ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే ఆమోదింపజేసుకొని ఉప ఎన్నికల యుద్ధానికి వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా పోరులో వైఎస్ జగన్ ప్రతి నిర్ణయాన్ని సవాల్‌గా స్వీకరించి అమలు చేశారు. కేంద్రంపై అవిశ్వాసం, ఎంపీలతో రాజీనామాలు చేయించడం లాంటి నిర్ణయాలను మాట తప్పకుండా నిలబెట్టుకున్నారు. చంద్రబాబు హోదా విషయంలో ఎన్ని యూటర్నులు తీసుకున్నారో యావత్తు రాష్ట్రానికి తెలుసు’ అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పాలి: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ‘ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు తదితర ప్రధాన హామీల సాధన కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామాలు చేశాం. హోదా పోరులో కలసి రావాలని, అందరం కలసి ఎంపీ పదవులకు రాజీనామాలు చేద్దామని ప్రతిపక్ష నేత జగన్ ప్రజాక్షేత్రంలో పిలుపునిస్తే చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితి ఉన్నందున రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. భావి తరాల కోసం హోదా సాధించాలి. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ చేస్తున్న కృషికి ప్రజలంతా అండగా నిలవాలి’ అని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యానికి గౌరవం? అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి ఇప్పుడు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నారు. ప్రజలకు ఏం చెబుతారు? అని కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ ‘ప్రభుత్వాల తీరు అలా ఉంది. కాబట్టే ఇలా చేస్తున్నాం. అసెంబ్లీలో 23 మంది మా పార్టీ సభ్యులను లాక్కొని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇదేనా ప్రజాస్వామ్యానికి గౌరవం? ఇక్కడ కూడా అలాగే నలుగురిని లాక్కున్నారు. ఎందుకు పోవాలి మనం అక్కడికి? నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే మన వాదన వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వకుండా ఒంటెత్తు పోకడ పోతుంటే ప్రజలకు నమ్మకం ఉంటుందా? అందుకే రాజీనామాలు చేశాం.. ఎన్నికలు వస్తాయి. ప్రజల మనోభావం వీళ్లకు తెలుస్తుంది. కేంద్రం, రాష్ట్రం కళ్లు తెరుస్తాయి. మాకు స్వార్థ ప్రయోజనాలేమీ లేవు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకునే దిశగా పోరాటం చేస్తాం. ప్రజల ఆశీస్సులు కోరుతాం’ అని వైవీ పేర్కొన్నారు. ఆ రోజుకు 14 నెలల సమయం ఉంది... ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావంటూ వస్తున్న వార్తలపై స్పందించాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని మీడియా కోరగా ‘మేం ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం. ఆ రోజుకు పదవీకాలానికి ఇంకా 14 నెలల సమయం ఉంది. మేం వాళ్లలాగా డ్రామాలు ఆడటం లేదు. చంద్రబాబులా యూటర్న్ తీసుకునే అలవాటు మాకు లేదు..’ అని బదులిచ్చారు. రాజీనామాలు ఆమోదం పొందకుంటే వచ్చే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారా? అని మీడియా ప్రశ్నించగా ‘మా రాజీనామాలు తప్పకుండా ఆమోదం పొందుతాయి. సెషన్ ఉన్నా మేం వచ్చే ప్రశ్నే లేదు..’ అని వైవీ చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై ప్రస్తావన... మీడియా అడిగిన మరో ప్రశ్నకు వైవీ బదులిస్తూ ‘వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎంపీలపై మేం ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ వద్ద మరోసారి ప్రస్తావించాం. దానికి ఆమె స్పందిస్తూ ప్రివిలేజ్ కమిటీకి పంపామని చెప్పారు. మూడేళ్లుగా ఇదే చెబుతున్నారని, రాజ్యసభలో ఇదే పరిస్థితి తలెత్తితే ఛైర్మన్ వెంకయ్య నాయుడు వెంటనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశాం. అలా జరిగిందా? అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సంగతి దేశం మొత్తం చూసింది. అయినా ఈ అంశంపై తదుపరి కార్యాచరణకు సెక్రటరీ జనరల్‌తో మాట్లాడుతానని స్పీకర్ హామీ ఇచ్చారు..’ అని ఎంపీ వైవీ తెలిపారు. -
అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా..
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన విషయం విదితమే. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు గత నెలలో స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు మంగళవారం సాయంత్రం లోక్‌సభలోని స్పీకర్ కార్యాలయంలో సుమిత్రా మహాజన్‌ను కలుసుకుని తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఈ భేటీ అనంతరం సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న ఉద్వేగపూరిత పరిస్థితుల వల్ల రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌గా వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలకు సలహా ఇచ్చా. జూన్ 5 లేదా 7వ తేదీలోపు మరోసారి కలవాలని ఎంపీలకు సూచించా. అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా.’ అని అన్నారు. రాజీనామాలు ఆమోదించాలని కోరాం.. స్పీకర్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మా రాజీనామాలు ఆమోదించాలని కోరాం. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ కోరారు. మేం మాత్రం తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరాం. కర్ణాటకలో ఇద్దరు ఎంపీలు రాజీనామాలు ఆమోదించారు. అదేవిధంగా మా రాజీనామాలు కూడా ఆమోదించాలని కోరాం. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశాం. రాజీనామాలు ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళితే.. ప్రత్యేక హోదాకు బలం చేకూరుతుందని మా నమ్మకం. రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ వచ్చి అడుగుతాం. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. టీడీపీ ఎంపీలు కూడా మాతోపాటు రాజీనామాలు చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మా ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. చంద్రబాబువన్నీ డ్రామాలే. ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తూనే ఉంటాం.’ అని స్పష్టం చేశారు. రాజీనామాలు ఆఖరి అస్త్రం... స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, హోదా కోసం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామన్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరామని, రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ వచ్చి అడుగుతామని మేకపాటి అన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం... ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ‘ఫిరాయింపుల అంశాన్ని కూడా స్పీకర్‌ను అడిగాం. ప్రివిలేజ్ కమిటీకి పంపామని స్పీకర్ చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆ చట్టానికి అర్థం లేదు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకు కచ్చితంగా గుణపాఠం చెబుతారు.’ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భయపడుతున్నారు.. ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేస్తే ఓటమి పాలవుతారనే భయం బాబుకు ఉందని అన్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. -
రాజీనామాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు
-
ప్రత్యేకహోదా కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం
-
మా రాజీనామాలు ఆమోదించండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరారు. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో మంగళవారం ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకే తమ పదవులకు రాజీనామాలు చేశామని స్పీకర్‌తో ఎంపీలు పేర్కొన్నారు. మా రాజీనామాలు ఆమోదించండి.. స్పీకర్ కలిసేందుకు వెళ్లే ముందు రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి హోదా సాధించలేకపోయారు. స్వలాభం కోసం ఆయన హోదాను తాకట్టు పెట్టారు. మేం మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్నాం. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.’ అని అన్నారు. ఉప ఎన్నికలకు సిద్ధం... మా రాజీనామాలు త్వరగా ఆమోదించాలని స్పీకర్‌ను కోరతామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. స్పీకర్ మా రాజీనామాలు ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాటలు మారుస్తూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. హోదాను నీరుగార్చిన వ్యక్తి చంద్రబాబేనని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. విభజన హామీల అమలు కోసం మొదటి నుంచి పోరాడుతున్నామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేపట్టామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీ ఎంపీలను కోరామని, 25మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే హోదా వచ్చేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, నాలుగేళ్లుగా హోదా నినాదంతో ప్రజల మధ్య ఉన్నామన్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరనున్నట్లు వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఓడిపోతామని చంద్రబాబుకు భయం.. హోదా కోసం రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలు ఆమోదించకపోతే ఏపీ ప్రజలను అవమానించినట్లే అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం లేదన్నారు. రాజీనామాలు చేస్తే ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందన్నారు. హోదా కోసం దేనికైనా సిద్ధం స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరతామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు భయమని, ఉప ఎన్నికలంటే జంకుతున్నారని ఆయన విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకు పడుతుందన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాహుల్ గాంధీతో కలవడానికైనా, మోదీతో జతకట్టడానికి అయినా చంద్రబాబు వెనకాడరన్నారు. విలువలు లేని పచ్చి అవకాశవాది చంద్రబాబు అని మేకపాటి మండిపడ్డారు. -
రాజీనామాల పై వెనక్కి తగ్గేది లేదు
-
స్పీకర్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలకు పిలుపు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను స్పీకర్ కార్యాలయంలో కలవనున్నట్లు హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే. పార్లమెంట్ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఎంపీలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు టీడీపీ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో హంగామా సృష్టించారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత కూడా ఆందోళన పేరిట వారు సభ లోపలే ఉండిపోయారు. ఇంతలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుస్తున్నారంటూ ఆమె కార్యాలయ సిబ్బంది చెప్పడంతో టీడీపీ ఎంపీలు బయటకు వచ్చారు. స్పీకర్ చాంబర్‌కు వెళ్లగా అప్పటికే ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీంతో అవాక్కయిన టీడీపీ ఎంపీలు తిరిగి సభ లోపలికి వెళ్లి ఆందోళనకు దిగాలని భావించగా.. భద్రతా సిబ్బంది అప్పటికే లోక్‌సభ తలుపులను మూసివేశారు. కంగుతిన్న టీడీపీ ఎంపీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి అక్కడే బైఠాయించడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారంతా పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్దకు ధర్నా నిర్వహించి వెనుతిరిగారు. -
స్పీకర్‌కు రాజీనామాల సమర్పణ
-
అవిశ్వాసం మళ్లీ తూచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 12వ అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం అనుమతించలేదు. కావేరీ నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యులు యథావిధిగా సభలో ఆందోళనకు దిగారు. సభ సజావుగా సాగడం లేదంటూ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. పదేపదే అదే దృశ్యం లోక్‌సభ గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో లోక్‌సభ ప్రారంభమైంది. ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళనకు పూనుకోవడంతో కొద్దిసేపటికే సభాపతి సభను వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా ఏఐఏడీఎంకే సభ్యులు ఎప్పటిలాగే ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో పలు శాఖలకు సంబంధించిన పత్రాలను పలువురు మంత్రులు, సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం అవిశ్వాస తీర్మానం నోటీసుల గురించి స్పీకర్ ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు తన వద్దకు వచ్చినట్టు సభాపతి చెప్పారు. వాటిని సభలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని లెక్కించేందుకు వీలుగా సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. సంఖ్యా బలాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, జేఎంఎం, ఎంఐఎం తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలుచున్నారు. అయితే, స్పీకర్ విజ్ఞప్తిని లెక్కచేయకుండా ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగిం చారు. దీంతో సభ ఆర్డర్లో లేదని, అవిశ్వాస తీర్మానం నోటీసుల ను సభ ముందుకు తీసుకురాలేకపోతు న్నానని స్పీకర్ ప్రకటించారు. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం శుక్రవారంతో ముగియనున్నాయి. కాగా, వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై 13వసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాటి సభా కార్యక్రమాల జాబితాలో ఆ అంశాన్ని చేర్చాలని నోటీసులో కోరారు. గురువారం ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు వీరికి సంఘీభావం తెలిపారు. రాజ్యసభలో ఆందోళన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టుకుని వెల్‌లో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్‌తో జతకట్టిన టీడీపీ పార్లమెంట్ సమావేశాలను సజావుగా నడపాలని, అన్ని అంశాలపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పలు పార్టీలు గురువారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. ఇందులో టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ నేతలతో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ పక్కన ప్లకార్డు పట్టుకుని నిలుచున్నారు. మరోవైపు సుజనా చౌదరి, తోట నర్సింహం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌తో ముచ్చటిస్తూ కనిపించారు.ఏపీ విభజనకు కాంగ్రెస్సే కారణమంటూ పదేపదే విమర్శించే టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో వియ్యానికి తెరలేపింది. రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రమాణ స్వీకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉదయం రాజ్యసభలో ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను పలువురు ఎంపీలు అభినందించారు. -
8వ రోజూ చర్చకు రాని తీర్మానం
-
ఎనిమిదో‘సారీ’
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా ఎనిమిదోసారీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానాలను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు బుధవారం కూడా లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళన చేపట్టడంతో సభ సజావుగా లేదంటూ స్పీకర్ అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అనుమ తి ఇవ్వలేదు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సభాపతి ఈ అవిశ్వాస తీర్మానాలను ప్రస్తావించారు. ‘‘సభ్యులు వైవీ సుబ్బా రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, తోట నర్సింహం, కొనకళ్ల నారాయణరావు, శ్రీనివాస్ కేశినేని, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, పి.కరుణాకరన్, మహ్మద్ సలీం, పి.కె.కున్హలికుట్టి, ఎం.శ్రీనివాసరావు, అసదుద్దీన్ ఒవైసీ, జయదేవ్ గల్లా నుంచి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందాయి. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన బలాన్ని లెక్కించాలంటే సభ సజావుగా సాగాలి. అందువల్ల సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లాలి’’అని ఆమె కోరారు. అయితే వెల్‌లో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు కదల్లేదు. మరోవైపు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుగా బలం సమకూర్చుతూ వైఎస్సార్సీపీ, టీడీపీ, కాం గ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, జేఎంఎం, సీపీఐ, ఎంఐఎం, ఆర్ఎస్ పీ, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తదితర పార్టీల సభ్యులంతా లేచి నించున్నారు. అయినా సభ సజావుగా లేదంటూ సభాపతి సభను ఏప్రిల్ 2కి వాయిదా వేశారు. మళ్లీ నోటీసులిచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2వ తేదీనాటి సభా కార్యక్రమాల జాబితాలో అవిశ్వాస తీర్మానాలను చేర్చాలంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం నోటీసులు ఇచ్చారు. టీడీపీ నుంచి ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. కొనసాగిన ఆందోళన అంతకుముందు ఉదయం 10.30కి పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఆందోళన నిర్వహించారు. హోదా వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సభ నిరవధికంగా వాయిదా పడిన రోజున రాజీనామాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. -
అవిశ్వాసంపై చర్చిద్దామన్న స్పీకర్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఎనిమిదో రోజు కూడా బుట్టదాఖలయ్యాయి. బుధవారం వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనలు కొనసాగించాయి. అవిశ్వాస తీర్మానం నోటీసులు తనకు అందాయని, చర్చను కూడా చేపడతానని స్పీకర్ చెప్పారు. కానీ సభ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తానని స్పష్టం చేశారు. ‘‘అవిశ్వాస తీర్మానంపై తప్పకుండా చర్చిద్దాం. విపక్షాలు, అధికారపక్షం ఇద్దరూ ఇందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సభ సజావుగా జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. దయచేసి సభ్యులు సహకరించండి..’ అని స్పీకర్ చెప్పారు. కానీ తమిళ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్.. లోక్‌సభను సోమవారానికి(ఏప్రిల్ 2కు) వాయిదావేశారు. -
ఆరో‘సారీ’...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో చర్చకు రావాలని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటున్నా సభ సజావుగా సాగడం లేదన్న కారణంతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీర్మా నాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వరుసగా 6వ రోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అవిశ్వాస తీర్మానాన్ని సభా కార్యక్రమాల జాబితాలో చేర్చాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం గురువారం మధ్యాహ్నమే నోటీసులు ఇవ్వటం తెలిసిందే. వెల్‌లో కొనసాగిన ఆందోళన శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే సభాపతి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏఐఏడీఎంకే సభ్యులు, రిజర్వేషన్ల కోటా పెంపు అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టాలని కోరుతూ టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జన్ అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ ఆందోళన నిర్వహిం చటంతో కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే 12.05 గంటల కు సభాపతి అవిశ్వాస తీర్మానాల ప్రస్తావన తెచ్చారు. కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం నుంచి నోటీసులు అంది నట్లు ప్రకటించారు. తీర్మానం ప్రవేశపెట్టేం దుకు అవసరమైన 50 మంది సభ్యులు నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలన్నారు. అప్పుడు మాత్రమే తీర్మానం ప్రవేశపెట్టటంపై నిర్ణయం తీసుకోగ లనని, సభ్యులంతా కూర్చోవాలని సూచించా రు. ‘కుడివైపు (అధికారపక్షం వైపు) ఉన్న సభ్యులు చర్చకు సిద్ధంగా ఉన్నారు. మీరంతా అంగీకరిస్తేనే దీన్ని చేపట్టగలను. ఇలా ఉంటే తీర్మానం అనుమతించడం సాధ్యం కాదు..’ అని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఎంపీల్లో పలువురు గైర్హాజరు అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు వచ్చిన సమ యంలో సభలో విపక్షాల హాజరు పలుచగా కనిపించింది. సభకు హాజరైన కాంగ్రెస్ సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టీడీపీ సభ్యుల్లో ఒకరిద్దరు హాజరుకాలేదు. రాజ్యసభలో హోదాపై చర్చకు చైర్మన్ నిరాకరణ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ రాజ్యసభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరగా చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వలేదు. వివిధ పార్టీల సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. ఏడోసారి అవిశ్వాసం నోటీసులు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం శుక్రవారం మధ్యాహ్నం ఏడోసారి నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు అందజేశారు. మద్దతు పలికిన విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు రాగానే విపక్షాలకు చెందిన సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపాయి. అయితే ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోనే ఉండడంతో సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్ వద్ద విపక్షాల ధర్నా ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెబుతూనే మళ్లీ లాలూచీ పడి కలిసి కాపురం చేస్తున్నారని అధికార తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాము చేపట్టిన ధర్నా అనంతరం వైవీ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం వెళ్లామని సాకులు చెబుతూ మళ్లీ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తాము రాజీనామాలు చేసే లోపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని బహిర్గతం చేస్తామన్నారు. -
అవిశ్వాసం తీర్మానం.. ఆరో రోజూ అదే ప్రకటన!
-
అవిశ్వాసం; ఎంపీలు ఒకపక్కకొస్తే లెక్కిస్తాం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఆరో రోజు కూడా చర్చకు రాలేదు. వాయిదా అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన సభలో నినాదాలు మిన్నంటడంతో అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో ప్రవేశపెట్టలేకపోతున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సభ ఆర్డర్లో లేని కారణంగా మంగళవారానికి వాయిదావేశారు. దీంతో లోక్‌సభ కార్యదర్శికి వైఎస్సార్సీపీ మరోసారి అవిశ్వాసంపై నోటీసులు అందజేసింది. అంతా ఒకదగ్గరికొస్తే లెక్కపెడతాం: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహంలు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చారన్న స్పీకర్.. ‘‘సభ సజావుగా సాగినప్పుడు మాత్రమే దానిపై ముందుకు వెళతానని స్పష్టం చేస్తున్నా.. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఎంపీలంతా ఒకచోటి వస్తే లెక్కింపునకు సులువుగా ఉంటుంది. ఇదంతా జరగాలంటే ఆందోళన చేస్తోన్న ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలి..’ అని అన్నారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న టీఆర్ఎస్, ఐఏడీఏంకే ఎంపీలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. 7వ వేతన సంఘంపై కమిటీ ఏర్పాటు: ఏడవ వేతన సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల పరిశీలన కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా తెలిపారు. మురళీ మనోహర్ జోషి అధ్యక్షుడిగా ఉండే కమిటీలో ఆర్థిక మంత్రి, వివిధ స్థాయీ సంఘాల అధ్యక్షులు సభ్యులుగా ఉంటారని, సమగ్ర పరిశీలన అనంతరం సదరు కమిటీ లోక్‌సభ, రాజ్యసభలకు సూచనలు చేస్తుందని పేర్కొన్నారు. ఎంపీల నినాదాల నడమే స్పీకర్ ఈ మేరకు ప్రకటన చేశారు. -
అవిశ్వాసం; శాంతి తర్వాత అశాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావాల్సిఉండగా సభ వాయిదాపడింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే షహీద్ దివస్‌కు సంబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్యసమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను జాతి గుర్తుచేసుకుంటున్నదని, వారి త్యాగాలు మరువలేనివని స్పీకర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమరులకు నివాళులు అర్పించిన పార్లమెంట్.. నిమిషంపాటు మౌనం పాటించింది. శాంతి తర్వాత అశాంతి: అమరులను తలుచుకుంటూ మౌనం పాటించడం పూర్తైన వెంటనే సభలో ఎప్పటిలాగే నినాదాలు మిన్నంటాయి. మౌనం ముగిసిందనడానికి సూచనగా స్పీకర్ ‘ఓం శాంతి..’ అని అన్నారు. అప్పటికే వెల్‌లో ఉన్న టీఆర్ఎస్, ఏఐడీఏంకే సభ్యులు మౌనం ముగియగానే నినాదాలు చేశారు. దీంతో స్పీకర్.. ‘శాంతి తర్వాత అశాంతి..’ అని చమత్కరించారు. శాంతించాలని ఎంత చెప్పినా సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. రాజ్యసభలో: షహీద్ దివస్ సందర్భంగా అటు రాజ్యసభలో అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కొద్దినిమిషాలు మాత్రమే సజావుగా సాగిన సభ.. విపక్షాల ఆందోళనలతో మళ్లీ గందరగోళంగా మారింది. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదావేశారు. -
సారీ.. సారీ.. సారీ.. నాలుగోసారీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మరోసారి అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పట్టుదలగా పోరాడుతున్నా సభ సజా వుగా లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. వెల్‌లో ఆందోళన నిర్వహిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్లకు మరో పార్టీ జతకలవటంతో సభలో గందరగోళ పరిస్థి తులు నెలకొన్నాయి. ఆర్జేడీ నుంచి గెలిచి జన్ అధికార్ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్న పప్పూయాదవ్ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభ సజావుగా లేదంటూ వైఎస్సార్ సీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగోసారీ అనుమతిం చలేదు.తీర్మానాన్ని బుధవారం నాటి సభాకార్యక్రమాల జాబితాలో చేర్చాలం టూ వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం మంగళవారం సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పక్షాలు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయడంతో అప్పటికే ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ కొద్ది క్షణాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగానే వివిధ శాఖలకు చెపందిన పత్రాలను పలువురు మంత్రులు పార్లమెం ట్‌కు సమర్పిం చారు. సభ్యులంతా తమ స్థానా ల్లోకి వెళ్లాలని, అవిశ్వాస తీర్మానం సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కు మార్ పేర్కొ న్నారు. ఈ సమయంలో బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ పప్పూయాదవ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 12.05 గంటలకు సభాపతి తనకు అందిన అవిశ్వాస తీర్మానం నోటీసుల ను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహంనుంచి నోటీసు లు అందాయని చెప్పారు. ‘వీటిని సభ ముం దుంచడం నా బాధ్యత. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. వారిని లెక్కించాక తీర్మానం ప్రవేశపె ట్టటంపై నిర్ణ యించగలను. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలి..’ అని సూచించారు. తీర్మానానికి మద్దతుగా నిలుచున్న ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలకు చెందిన సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. అయితే సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ వైఎస్సార్ సీపీ ఆందోళన ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ఆందోళన నిర్వహిం చారు. ప్రత్యేక హోదా ప్లకార్డును ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అయితే రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కొద్ది క్షణాల్లోనే సభను గురువారానికి వాయిదావేశారు. ఐదోసారి అవిశ్వాసం నోటీసులు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు ఐదో సారి నోటీసులను అందజేశారు. పార్లమెంట్ వద్ద ధర్నా అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగప ల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ద్రోహివి నువ్వే సీఎం వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. నాలుగేళ్లపాటు ప్రత్యేక హోదా అడగకుండా, హోదా అవసరం లేదని మంత్రివర్గంలో నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేసినవారిలో మొదటి వ్యక్తని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించిన బాబుకే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇన్నేళ్లుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు. -
‘అవిశ్వాసం’ మరోసారి వాయిదా
-
నిరసనల పర్వం; ‘అవిశ్వాసం’ మళ్లీ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: అదే రభస.. అదే తీరు.. మళ్లీ అదే నిర్ణయం! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మరోసారి వాయిదా పడింది. మంగళవారం కూడా లోక్‌సభలో నిరసనలు చోటుచేసుకోవడంతో.. సభ ఆర్డర్లో లేదన్న కారణంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘అవిశ్వాసం’చర్చను చేపట్టలేకపోయారు. విపక్షాల ఆందోళనల మధ్యే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. ఇరాక్‌లో భారత బందీల మరణానికి సంబంధించిన ప్రకటన చేశారు. అనంతరం స్పీకర్ సభను బుధవారానికి వాయిదావేశారు. అవిశ్వాసంపై చర్చ కోసం గట్టిగా పోరాడుతున్న వైఎస్సార్సీపీ నాలుగోసారి నోటీసులు ఇవ్వనుంది. వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసినా.. : అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చూడాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం మహాజన్‌ను ఆమె కార్యాలయంలో కలిశారు. ఇటు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా పార్టీల సహకారాన్ని కోరుతూ ప్రకటన చేశారు. కాగా, టీఆర్ఎస్, ఏఐడీఏంకే పార్టీలు నిరంతరాయంగా నిరసనలు తెలపడంతో, సభ ఆర్డర్లో లేని కారణాన్ని చూపుతూ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోలేదు. రాజ్యసభ కూడా: రెండో విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు వ్యక్తం తెలిసిందే. నేడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదావేశారు. -
మేడమ్.. అనుమతించండి
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చూడాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం మహాజన్‌ను ఆమె కార్యాలయంలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని స్పీకర్‌ను కోరినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్పీకర్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత 15 రోజులుగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా ఆర్థికబిల్లును ఆమోదించారని గుర్తుచేశారు. సభ ఆర్డర్లో లేదన్న కారణంతో సభా కార్యకలాపాలను వాయిదా వేయడం సరికాదన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి సభా కార్యక్రమాలకు అడ్డుపడొద్దని, అవిశ్వాసానికి మద్దతివ్వాలని అన్నాడీఎంకె ఎంపీలను వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని మాజీ ప్రధాని, జెడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడకు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. -
ఆగని ఆందోళనలు.. లోక్‌సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్, అన్నాడీఎంకేల నిరవధిక ఆందోళన కారణంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టాలని భావించారు. కానీ అప్పటికే ఎంపీలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం నేడు సభముందుకు రానున్న దరిమిలా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ కూడా: రెండో విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు వ్యక్తం తెలిసిందే. నేడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదావేశారు. -
పట్టు వీడేదిలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేంత వరకు పట్టువీడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. రెండోసారి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తీసుకోకుండానే లోక్‌సభ మరోసారి వాయిదా పడడంతో ఆ పార్టీ ఎంపీలు సోమవారం మూడోనోటీసు ఇచ్చారు. సభ సజావుగా లేనందున మద్దతిచ్చే సభ్యులను లెక్కించడానికి వీలుకాదనే సాకుతో సోమవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదావేశారు. ఇదే కారణం చెప్పి శుక్రవారం కూడా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోని విషయం తెలిసిందే. అదే రోజు సభ వాయిదా పడ్డ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి వారు అవిశ్వాసం నోటీసులిచ్చారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12.06 గంటలకు సభాపతి అవిశ్వాసం నోటీసులను ప్రస్తావించారు. ‘కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం, గల్లా జయదేవ్ నుంచి నోటీసులు అందాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు లేచి నిలుచుంటే వారిని లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే నేను వారిని లెక్కించి ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించగలను’ అని పేర్కొన్నారు. తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ సీపీతో పాటు విపక్షాల సభ్యులంతా మద్దతుగా వారి స్థానాల్లో నిలబడ్డారు. ఇందులో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు ఉన్నారు. శివసేన తటస్థంగా ఉంటామని గతంలోనే ప్రకటించింది. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే ఆందోళన.. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తెచ్చిన సమయంలో రిజర్వేషన్ల కోటా పెంపు కోసం టీఆర్ఎస్, కావేరీ నదీ బోర్డు ఏర్పాటు కోసం ఏఐఏడీఎంకే ఎంపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. వారిని వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ ఎంపీలు పట్టించుకోలేదు. సభ ఆర్డర్లో లేనందున తీర్మానపు నోటీసును సభ దృష్టికి తేలేకపోతున్నాను.. ఐ ఆమ్ సారీ అని చెబుతూ స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోసారి నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి, తోట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం మరోసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి మండలిపై ఈ సభ అవిశ్వాసం ప్రకటిస్తోంది’ అన్న తీర్మానాన్ని మంగళవారం నాటి బిజినెస్ లిస్ట్‌లో చేర్చాలని విన్నవించారు. అలాగే ఈ తీర్మానం వస్తున్నందున పార్టీ ఎంపీలంతా హాజరై తీర్మానం ప్రవేశపెట్టేందుకు మద్దతుగా నిలబడాలని, తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని పేర్కొంటూ వైఎస్సార్ సీపీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి త్రీలైన్ విప్ జారీచేశారు. చర్చకు సిద్ధం: హోం మంత్రి స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చిన విషయాన్ని ప్రస్తావించక ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. ఏ అంశంపైన అయినా, ఏ సభ్యుడు లేవనెత్తినా దానిపై పూర్తిగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారపక్షం తరఫున చెబుతున్నా. కొందరు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఈ తీర్మానంపై చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. సభ్యులంతా సహకరించాలని కోరుతున్నా. ఈ తీర్మానంపై చర్చ జరిగేందుకు సహకరించండి’ అని అన్ని పక్షాలను కోరారు. హోదాకు మా మద్దతు: డీఎంకే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని డీఎంకే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ సోమవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే పార్టీ అవిశా>్వసానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో చర్చిస్తున్నాం: మేకపాటి లోక్‌సభ ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పీవి మిథున్‌రెడ్డి పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. 11 గంటలకు సభ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. ధర్నా వద్ద మీడియాతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో కూడా మాట్లాడుతున్నామని, సహకరించాలని బతిమాలామని చెప్పారు. వాళ్ల రాజకీయ కోణాలు వాళ్లవని, చంద్రబాబును మించినవారు అని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా నిమ్మకునీరెత్తినట్టు ఉన్నారని, హోదా ఉద్యమాన్ని హేళన చేశారని విమర్శించారు. హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేశారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోరాడుతున్నానంటున్నారని విమర్శించారు. ప్రజల గొంతునొక్కుతున్న ఎన్డీఏ, స్పీకర్: ఎంపీ వైవీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘శుక్రవారం రెండోసారి నోటీసులు ఇచ్చాం. అప్పటికే అన్ని పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరాం. అందరూ సానుకూలంగా స్పందించడమే కాకుండా స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావించినప్పుడు 100 మందికి పైగా నిలబడ్డారు. అయినా సభ సజావుగా లేదంటూ అనుమతించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం, స్పీకర్ ఏపీ ప్రజల గొంతునొక్కుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా సభ సజావుగా జరిగేలా చూడాలి. అన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. చర్చకు వస్తే అన్యాయాన్ని చెప్పవచ్చు: పీవీ మిథున్‌రెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశం దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై పడేలా ఈ తీర్మానం ద్వారా చేయగలిగాం. తీర్మానం చర్చకు వస్తే మనకు జరిగిన అన్యాయం చెప్పుకొనే వీలుంటుంది. మేం ఐదుగురం ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతామని చెప్పడంలేదు. హోదా డిమాండ్ వైపు దేశం చూస్తోందంటే మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ పోరాటం చేయడం, మేం పార్లమెంటులో పోరాటం చేయడం వల్లే. మేం ఐదుగురమే ఐనా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశానికి చాటగలిగాం. ఇది వైఎస్సార్‌కాంగ్రెస్ విజయమే. అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే ఈరోజు ఇంత అటెన్షన్ వచ్చేదా ’ అని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా చంద్రబాబు: విజయసాయిరెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘మేం మా కార్యాచరణ మేరకు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానం పెడతామన్నాం. పెట్టాం. శుక్రవారం ఉదయం వరకు టీడీపీ కేంద్రంపై విశ్వాసాన్ని ప్రకటించింది. మా పోరాటానికి మద్దతు తెలపకపోవడమే కాకుండా హేళన చేసింది. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. ప్యాకేజీ కావాలని అడిగారు. ఇప్పుడు ప్రజల ఆగ్రహంతో మళ్లీ హోదా కావాలంటున్నారు..’ అని పేర్కొన్నారు. ఎందుకు ఓట్లేయించుకున్నారు: ఎంపీ వెలగపల్లి ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదాను హేళన చేసిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల దృష్టితో మళ్లీ హోదా అంటోంది. నాలుగేళ్లుగా ఏం చేసింది? బీజేపీని కూడా అడుగుతున్నాం.. ఎందుకు ఆరోజు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు ఎందుకు వేయించుకున్నారు. ఎందుకు ఒత్తిడి తేలేదని టీడీపీని అడుగుతున్నాం. అవిశ్వాసం మొట్టమొదటిసారిగా పెట్టింది వైఎస్సార్ సీపీనే. అంతతేలిగ్గా మేం వదిలిపెట్టం. వైఎస్సార్ కాంగ్రెస్ వల్లే ఈ పోరాటం ముందుకుసాగింది..’ అని పేర్కొన్నారు. టీడీపీ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు: అవినాశ్‌రెడ్డి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మొదట వైఎస్సార్సీపీ ఇచ్చే తీర్మానానికి మద్దతు చెబుతామన్న టీడీపీ మళ్లీ శుక్రవారం మాటమార్చింది. మాకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు దక్కుతోందని గమనించి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి జాతీయ రాజకీయాల్లో మంచి పేరొస్తోందని ఆయన అభద్రతకు గురయ్యారు. అప్పటికప్పుడు ఎన్డీయేనుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం నోటీసులు ఇచ్చారు. అర్దగంటలో మద్దతు కూడగట్టామని వాళ్లు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా డ్రామాలు పక్కనపెట్టి చిత్తశుద్ధితో రావాలి. మేం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం.. మీరు కూడా రాజీనామాలకు సిద్ధం కండి’ అని పేర్కొన్నారు. -
ప్చ్.. అదే సాకు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తీసుకోకుండానే లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. సభ సజావుగా లేనందున మద్దతిచ్చే సభ్యులను లెక్కించడానికి వీలుకాదనే కారణంతో సోమవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదావేశారు. ఇదే కారణం చెప్పి శుక్రవారం కూడా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోని విషయం తెలిసిందే. అదే రోజు సభ వాయిదా పడ్డ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి వారు అవిశ్వాసం నోటీసులిచ్చారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12.06 గంటలకు సభాపతి అవిశ్వాసం నోటీసులను ప్రస్తావించారు. ‘కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం, గల్లా జయదేవ్ నుంచి నోటీసులు అందాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు లేచి నిలుచుంటే వారిని లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే నేను వారిని లెక్కించి ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించగలను’ అని పేర్కొన్నారు. తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ సీపీతో పాటు విపక్షాల సభ్యులంతా మద్దతుగా వారి స్థానాల్లో నిలబడ్డారు. ఇందులో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు ఉన్నారు. శివసేన తటస్థంగా ఉంటామని గతంలోనే ప్రకటించింది. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే ఆందోళన.. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తెచ్చిన సమయంలో రిజర్వేషన్ల కోటా పెంపు కోసం టీఆర్ఎస్, కావేరీ నదీ బోర్డు ఏర్పాటు కోసం ఏఐఏడీఎంకే ఎంపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. వారిని వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ ఎంపీలు పట్టించుకోలేదు. సభ ఆర్డర్లో లేనందున తీర్మానపు నోటీసును సభ దృష్టికి తేలేకపోతున్నాను.. ఐ ఆమ్ సారీ అని చెబుతూ స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోసారి నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి, తోట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం మరోసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి మండలిపై ఈ సభ అవిశ్వాసం ప్రకటిస్తోంది’ అన్న తీర్మానాన్ని మంగళవారం నాటి బిజినెస్ లిస్ట్‌లో చేర్చాలని విన్నవించారు. అలాగే ఈ తీర్మానం వస్తున్నందున పార్టీ ఎంపీలంతా హాజరై తీర్మానం ప్రవేశపెట్టేందుకు మద్దతుగా నిలబడాలని, తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని పేర్కొంటూ వైఎస్సార్ సీపీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి త్రీలైన్ విప్ జారీచేశారు. హోదాకు మా మద్దతు: డీఎంకే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని డీఎంకే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ సోమవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో చర్చిస్తున్నాం: మేకపాటి లోక్‌సభ ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పీవి మిథున్‌రెడ్డి పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. 11 గంటలకు సభ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. ధర్నా వద్ద మీడియాతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో కూడా మాట్లాడుతున్నామని, సహకరించాలని బతిమాలామని చెప్పారు. వాళ్ల రాజకీయ కోణాలు వాళ్లవని, చంద్రబాబును మించినవారు అని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా నిమ్మకునీరెత్తినట్టు ఉన్నారని, హోదా ఉద్యమాన్ని హేళన చేశారని విమర్శించారు. హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేశారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోరాడుతున్నానంటున్నారని విమర్శించారు. ప్రజల గొంతునొక్కుతున్న ఎన్డీఏ, స్పీకర్: ఎంపీ వైవీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘శుక్రవారం రెండోసారి నోటీసులు ఇచ్చాం. అప్పటికే అన్ని పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరాం. అందరూ సానుకూలంగా స్పందించ డమే కాకుండా స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావించినప్పుడు 100 మందికి పైగా నిలబడ్డారు. అయినా సభ సజావుగా లేదంటూ అనుమతించలేదు. ఎన్డీఏ ప్రభు త్వం, స్పీకర్ ఏపీ ప్రజల గొంతునొక్కుతున్నా రు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా సభ సజా వుగా జరిగేలా చూడాలి. అన్ని పార్టీలు సాను కూలంగా స్పందిస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. చర్చకు వస్తే అన్యాయాన్ని చెప్పవచ్చు: పీవీ మిథున్‌రెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశం దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల న్న డిమాండ్‌పై పడేలా ఈ తీర్మానం ద్వారా చేయగలిగాం. తీర్మానం చర్చకు వస్తే మనకు జరిగిన అన్యాయం చెప్పుకొనే వీలుంటుంది. మేం ఐదుగురం ప్రభుత్వాన్ని పడగొట్టగలుగు తామని చెప్పడంలేదు. హోదా డిమాండ్ వైపు దేశం చూస్తోందంటే మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ పోరాటం చేయడం, మేం పార్లమెంటులో పోరాటం చేయడం వల్లే. మేం ఐదుగురమే ఐనా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశానికి చాటగలిగాం. ఇది వైఎస్సార్సీపీ విజయమే. అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే ఈరోజు ఇంత అటెన్షన్ వచ్చేదా ’ అని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా చంద్రబాబు: విజయసాయిరెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘మేం మా కార్యాచరణ మేరకు నాలుగేళ్లుగా పోరా టం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానం పెడతామ న్నాం. పెట్టాం. శుక్రవారం ఉదయం వరకు టీడీపీ కేంద్రంపై విశ్వాసాన్ని ప్రకటించింది. మా పోరాటానికి మద్దతు తెలపకపోవడమే కాకుండా హేళన చేసింది. బాబు ఊసర వెల్లిలా రంగులు మారుస్తున్నారు. ప్యాకేజీ కావాలని అడిగారు. ఇప్పుడు ప్రజల ఆగ్రహంతో మళ్లీ హోదా కావాలంటున్నారు..’ అని అన్నారు. ఎందుకు ఓట్లేయించుకున్నారు: వెలగపల్లి ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదాను హేళన చేసిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల దృష్టితో మళ్లీ హోదా అంటోంది. నాలుగేళ్లుగా ఏం చేసింది? బీజేపీని కూడా అడుగుతున్నాం.. ఎందుకు ఆరోజు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు ఎందుకు వేయించుకున్నారు. ఎందుకు ఒత్తిడి తేలేదని టీడీపీని అడుగుతున్నాం. అవిశ్వాసం మొట్టమొదటిసారిగా పెట్టింది వైఎస్సార్ సీపీనే. అంతతేలిగ్గా మేం వదిలిపెట్టం. వైఎస్సార్ కాంగ్రెస్ వల్లే ఈ పోరాటం ముందుకుసాగింది..’ అని పేర్కొన్నారు. టీడీపీ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు: అవినాశ్‌రెడ్డి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మొదట వైఎస్సార్సీపీ ఇచ్చే తీర్మానానికి మద్దతు చెబుతామన్న టీడీపీ మళ్లీ శుక్రవారం మాటమార్చింది. మాకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు దక్కుతోందని గమనించి, వైఎస్ జగన్‌కు జాతీయ రాజకీయాల్లో మంచి పేరొస్తోందని ఆయన అభద్రతకు గురయ్యారు. అప్పటికప్పుడు ఎన్డీయేనుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం నోటీసులు ఇచ్చారు. అర్దగంటలో మద్దతు కూడగట్టామని వాళ్లు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా డ్రామాలు పక్కనపెట్టి చిత్తశుద్ధితో రావాలి. మేం రాజీనామాలకు సిద్ధం.. మీరు కూడా సిద్ధం కండి’ అని పేర్కొన్నారు. చర్చకు సిద్ధం: హోం మంత్రి స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చిన విషయాన్ని ప్రస్తావించక ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లా డారు. ‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావు గా సాగడం లేదు. ఏ అంశంపైన అయినా, ఏ సభ్యుడు లేవనెత్తినా దానిపై పూర్తిగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారపక్షం తరఫున చెబుతున్నా. కొందరు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఈ తీర్మానంపై చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. సభ్యులంతా సహకరించాలని కోరుతున్నా. ఈ తీర్మానంపై చర్చ జరిగేందుకు సహకరించండి’ అని అన్ని పక్షాలను కోరారు. -
స్పీకర్ నిస్సహాయత; ‘అవిశ్వాసం’వాయిదా
-
స్పీకర్ నిస్సహాయత; ‘అవిశ్వాసం’వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఎడతెరిపిలేకుండా సాగిన నినాదాల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదాపడింది. దీంతో కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానికి సంబంధించి వైఎస్సార్సీపీ మరోమారు నోటీసులు ఇవ్వనుంది. సోమవారం సభ ప్రారంభమైన మరుక్షణమే టీఆర్ఎస్, ఏఐడీఎంకేలు తమ తమ డిమాండ్లతో హోరెత్తించాయి. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు సభను వాయిదావేశారు. తిరిగి 12 గంటలకు సమావేశాలు పునఃప్రారంభమైనా.. నినాదాల జోరు తగ్గలేదు. స్పీకర్ పలుమార్లు అభ్యర్థించినా సభ్యులు శాంతించలేదు. అవిశ్వాసంపై స్పీకర్ ప్రకటన : నినాదాల మధ్యలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్సార్సీపీ, టీడీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తెవాల్సిఉంది. కానీ అంతకంటే ముందు మీరు మీమీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొవాలి. లేకుంటే బిజినెస్ జరగదు..’ అని చెప్పారు. సభ్యులు ఎంతకీ వెనక్కి వెళ్లకపోవడంతో స్పీకర్ నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘సభ ఆర్డర్లో లేనందున అవిశ్వాస తీర్మానాలపై చర్చను ప్రారంభించలేకపోతున్నాం..’ అని సుమిత్రా ప్రకటించారు. ఆ వెంటనే సభను మంగళవారానికి వాయిదావేశారు. చర్చ జరిగేంతవరకు ఎన్ని సార్లైనా అవిశ్వాసం నోటీసులు ఇస్తామని వైఎస్సార్సీపీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎడతెరిపిలేకుండా సాగిన నినాదాల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదాపడింది. దీంతో కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానికి సంబంధించి వైఎస్సార్సీపీ మరోమారు నోటీసులు ఇవ్వనుంది. సోమవారం సభ ప్రారంభమైన మరుక్షణమే టీఆర్ఎస్, ఏఐడీఎంకేలు తమ తమ డిమాండ్లతో హోరెత్తించాయి. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు సభను వాయిదావేశారు. తిరిగి 12 గంటలకు సమావేశాలు పునఃప్రారంభమైనా.. నినాదాల జోరు తగ్గలేదు. స్పీకర్ పలుమార్లు అభ్యర్థించినా సభ్యులు శాంతించలేదు. -
ప్రారంభమైన 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా
-
30 సెకన్లకే వాయిదాపడ్డ లోక్‌సభ..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ముందుకు రావాల్సిఉండగా.. పార్లమెంట్ అనూహ్యంగా వాయిదాపడింది. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైంది. అప్పటికే కొన్ని స్పీకర్ వెల్‌లోకి వచ్చిన కొన్ని విపక్షాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయసాగాయి. ఒకటిరెండుసార్లు సర్దిచెప్పినా ఫలితంలేకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదావేశారు. ఇతంతా కేవలం 30 సెకన్లలోనే జరిగిపోయింది. రాజ్యసభ రేపటికి : వివిధ పక్షాలు తమ తమ అజెండాలతో ఆందోళనలు చేపట్టడంతో రాజ్యసభ సైతం వాయిదాపడింది. ఎంత చెప్పినా సభ్యులు నిరసన వీడకపోవడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
సభ సజావుగా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయని, అయితే సభ సజావుగా లేనందున తీర్మానాన్ని తీసుకోలేకపోతున్నానంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో సభాపతి వెంటనే సభను వాయిదా వేశారు. 50 మంది సభ్యులను లెక్కించలేను.. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగానే వివిధ విభాగాలకు సంబంధించిన పత్రాలను మంత్రులు, సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో వెల్‌లో టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే సభ్యులే ఉన్నారు. ఈ సమయంలో సభాపతి తనకు వైఎస్సార్ సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యుడు తోట నరసింహం నుంచి అవిశ్వాస తీర్మానం నోటీసులు వచ్చాయని ప్రకటించారు. సభ సజావుగా లేకపోవడంతో తీర్మానం తీసుకోలేక పోతున్నానని పేర్కొంటూ సభను సోమవారానికి వాయిదా వేశారు. నోటీసులు వచ్చాయని సభాపతి ప్రకటిస్తున్న సమయంలో వైఎస్సార్ సీపీ , టీడీపీలకు చెందిన సభ్యులతో పాటు విపక్షాలన్నీ తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా లేచి నిలబడ్డాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాతో పాటు ఆ పార్టీ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సభ్యులు, సీపీఎం, ఎంఐఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల వారు లేచి నిలుచున్నారు. దాదాపు 100 మంది మద్దతుతెలిపారు. -
‘అవిశ్వాసం’పై మాట్లాడిన లోక్‌సభ స్పీకర్..
-
‘అవిశ్వాసం’పై మాట్లాడిన లోక్‌సభ స్పీకర్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు తనకు అందాయని చెప్పారు. ఈ మేరకు నోటీసులను ఆమె చదివి వినిపించారు కూడా. ‘‘లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నాకు అందాయి. హౌజ్ అదుపులోకి వస్తే దానిపై చర్చ చేపడతాను..’’ అని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. ఆ సమయంలో కొన్ని పక్షాలు వేర్వేరు డిమాండ్లతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో ఆమె సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో వైఎస్సార్సీపీ సోమవారం మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. సభ అదుపులో ఉంటేనే అవిశ్వాసం చర్చ సాధ్యం.. రాజ్యాంగంలోని 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. దానిపై నమ్మకం కోల్పోయామని భావించినప్పుడు ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మాన కోసం నోటీసు ఇవ్వొచ్చు. లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇస్తారు. ఈ తీర్మానాన్ని సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును స్పీకర్ పరిశీలించాక.. సభ్యుల మద్దతుందని సభ్యుడు చెప్పిన తర్వాత.. ఆ 50 మంది లేచి నిలబడాలి. స్పీకర్ సంతృప్తి చెందితే.. చర్చకు స్వీకరిస్తారు. నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ రోజు సభ క్రమపద్ధతిలో ఉండాలి. లేకుంటే తరువాతి రోజుకు ఆ సభ్యుడు మరోసారి నోటీసివ్వాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపడితే.. అది ముగిశాక ఓటింగ్ నిర్వహిస్తారు. తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. -
నిరసనల హోరు ; లోక్‌సభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ : తెలుగు ఎంపీల నిరసనలతో లోక్‌సభ హోరెత్తిపోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీలు శుక్రవారం సభలో నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టుకొని స్పీకర్ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. అటు టీఆర్ఎస్ ఎంపీలు సైతం రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున నినాదాలు చేసి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత వారించినప్పటికీ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదావేశారు. -
లోక్‌సభ ; ఓం శాంతి.. అంతలోనే హంగామా!
న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల ఐదో రోజు కూడా పార్లమెంట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని లోక్‌సభ స్పీకర్ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. వారిని టీడీపీ ఎంపీలు కూడా అనుసరించారు. కార్యకలాపాలు సజావుగా నడపలేని స్థితిలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సరిగ్గా ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఎంపీల ఆందోళనలన నేపథ్యంలో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. ఓం శాంతి.. : శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే.. ఇటీవలే దివంగతులైన సభ్యుడికి లోక్‌సభ నివాళులు అర్పించింది. స్పీకర్ సూచన మేరకు ఎంపీలందరూ మౌనంపాటించారు. ఒక నిమిషం మౌనం పూర్తయిందనడానికి సంకేతంగా స్పీకర్.. ‘ఓం శాంతి.. ఓం శాంతి..’ అని పలికారు. ఆమె మాటలు పూర్తికాకముందే ఎంపీలు ఒక్కసారిగా నినాదాలు మొదలుపెట్టారు. ‘‘ఇప్పుడే ఓం శాంతి.. అంతలోనే హంగామానా?’ అంటూ స్పీకర్ విస్తుపోయారు! దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. -
పార్లమెంట్లో నిరసనలపై స్పీకర్ ఆందోళన
న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచే పార్లమెంట్లో నిరసనలు వ్యక్తం అవుతుండటంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో కొద్ది నిమిషాలు మాట్లాడిన ఆమె.. ఎంపీల తీరును తప్పుపట్టారు. ‘‘సభ సజావుగా జరిగేలా సహకరించాలని నేను చేసిన మనవిని సభ్యులు పట్టించుకోలేదు. సభలోపల ప్లకార్డులు ప్రదర్శించడం, వెల్ లోకి దూసుకురావడం లాంటి చర్యలు ఆమోదనీయంకాదు. ఇలాంటివి.. ప్రపంచం దృష్టిలో మన సభకున్న గౌరవాన్ని దిగజార్చే అవకాశం ఉంది. కాబట్టి సభ్యులంతా హుందాగా ప్రవర్తించి, సభా మర్యాదను కాపాడాలి’ అని స్పీకర్ సుమిత్రా అన్నారు. -
త్వరలో పార్లమెంటులో శిశుసంరక్షక కేంద్రం
న్యూఢిల్లీ: మహిళా ఎంపీలు, పార్లమెంటు అధికారులు, సిబ్బంది చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు అనువుగా త్వరలో పార్లమెంటులో శిశు సంరక్షక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రంలో తల్లులు పాలివ్వడానికి విడిగా మరో గదిని ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్లమెంటు మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది మహిళలే ఉన్నారని వారి చిన్నారుల కోసం ఈ కేంద్రం ఏర్పాటుచేయాలని గతేడాది మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్-2018 ; నేడు ఆల్‌పార్టీ మీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్.. ఎన్నికలకు ముందు రానున్న ప్రజాకర్షక బడ్జెట్.. ఇలా ఎన్నోవిశేషణాలను సొంతం చేసుకున్న బడ్జెట్-2018 మరో మూడు రోజుల్లో ప్రజల ముందుకు రానుంది. రేపటి(జనవరి 29) నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభంకానున్నాయి. ఫిబ్రవకి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర ప్రభుత్వాలు ఆదివారం సాయంత్ర విడివిడిగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి : ఆదివారం ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఎఫ్ఆర్డీఏ బిల్లు తదితర అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీలు గళంవిప్పనున్నారు. రెండు విడదల్లో బడ్జెట్ సమావేశాలు : ఆనవాయితీ ప్రకారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో రేపు(సోమవారం) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడతగా పార్లమెంట్ భేటీ కానుంది. -
లోక్‌సభకి రాహుల్‌పై సభ హక్కుల ఉల్లంఘన నోటీస్
న్యూ ఢిల్లీ : సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజ్యసభలో నమోదైన సభ హక్కుల ఉల్లంఘన నోటీస్‌ని ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, శనివారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి పంపారు. అరుణ్ జైట్లీ పేరులోని జైట్లీని ఒత్తి పలికి అమర్యాదపూర్వకంగా అర్థం వచ్చేలా వ్యవహరించారని వారం క్రితం రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్ రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై రాహుల్ అసభ్య పదజాలాన్ని వాడారని ఆరోపించారు. రాహుల్ లోక్‌సభ సభ్యుడు కావడంతో ఈ ప్రివిలేజ్ మోషన్ని లోక్‌సభకు పంపారు. వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై డిసెంబర్ 27న జైట్లీ రాజ్యసభలో వివరణ ఇస్తూ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని పేర్కొన్నారు.దీనిపై రాహుల్ ట్విట్టర్లో జైట్లీని.. జైట్-లై(అబద్ధాలకోరు) అని అభివర్ణించారు. మీకు ధన్యవాదాలు. మన ప్రధాని చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం అంటూ ట్వీట్ చేశారు. -
ఆ నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు విన్నవించింది. రాజ్యసభ చైర్మన్ ఇటీవల అనర్హత పిటిషన్లపై 90 రోజుల్లోపే పరిష్కరించిన రీతిలో తమ పిటిషన్లను పరిష్కరించాలని విన్నవించింది. ఈ మేరకు పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఇక్కడ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఒక లేఖ ఇచ్చారు. ‘స్పీకర్ కార్యాలయంపై మాకు అపారమైన గౌరవం ఉంది. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలన్న మా విన్నపాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో నంద్యాల నుంచి మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి గెలిచిన వారం రోజులకే ఆంధ్రప్రదేశ్‌లోని అధికారపార్టీ అయిన టీడీపీలో చేరారు. ఆయన పార్టీ మారినందున రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి ఆయనపై అనర్హత వేటు వేయాలని మేం పిటిషన్ దాఖలు చేశాం. మా పార్టీ టికెట్‌పై అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయింపునకు పాల్పడినందున ఆమె సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని 14 డిసెంబరు 2016న పిటిషన్ దాఖలు చేశాం. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరడంతో డిసెంబరు 14, 2016న అనర్హత పిటిషన్ దాఖలు చేశాం. అక్టోబరు 17, 2017న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మా పార్టీ నుంచి టీడీపీలో చేరడంతో అనర్హత పిటిషన్ దాఖలు చేశాం. కానీ వారిపై ఎలాంటి చర్యలూ లేవు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు అధికార టీడీపీ వైఎస్సార్సీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని బహిరంగంగా తమ పార్టీలో చేర్చుకుందని, ఇందులో నలుగురిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఫిరాయింపులకు పరాకాష్టని తెలిపారు. -
బీజేపీ ఎంపీల రాజీనామా ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆమోదించారు. బీజేపీకి చెందిన ఆదిత్యానాథ్ యూపీ సీఎం ఎంపిక కావటం.. మరో ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఇక మహారాష్ట్రకు చెందిన నానా పటోలే పార్టీపై అసంతృప్తితో ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ క్రమంలో వారి వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
‘ఏపీ ప్రభుత్వం అల్లూరి విగ్రహాం ఇస్తే’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఏట్టకేలకు మార్గం సుగమమైందనే చెప్పవచ్చు. గతేడాది పార్లమెంట్లో అల్లూరి విగ్రహాం ఏర్పాటు చేయాలని టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంపై టీడీపీ మంత్రులు మరోసారి స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. మంత్రులు అందించిన లేఖను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అల్లూరి విగ్రహా ఏర్పాటును స్పీకర్ విగ్రహాల ఏర్పాటు కమిటీకి రెఫర్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఎంపీలకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి విగ్రహాం ఇవ్వాలని స్పీకర్ అన్నారు. దీనిపై చర్చించి నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక ఉన్నతమైన శక్తి. సాయుథ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మిన వ్యక్తి అల్లూరి. -
ఫేస్బుక్ లో మంత్రి అచ్చెన్నాయుడు మిస్టేక్!
నూఢిల్లీ: తెలుగుదేశం నేతలకు పొరపాట్లు చేయడం, తరువాత నాలుక్కరుచుకోవడం అలవాటే. సాక్షాత్తు పార్టీ అధినేతే గతంలో బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు. అంతకు ముందు ‘బీకాంలో ఫిజిక్స్ చదివా’నంటూ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఫేమస్ అయిపోయారు. తాజాగా ఏపీ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు దివంగత తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజర రామ్మోహన్ నాయుడుకు ఇటీవలే వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి రిసెప్షన్ వేడుకలను ఢిల్లీలో ఈనెల 19న ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకకు ఎవరెవరు వచ్చారో తెలుపుతూ అచ్చెన్నాయుడు సోషల్ మీడియా ఫేస్బుక్లో ఫొటోలను పోస్టు చేశారు. అందులో ‘ప్రధాని నరేంద్రమోదీలతో పాటు లోకసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీమతి షీలా దీక్షిత్ గారు, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు’. అని రాశారు. వాస్తవానికి లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ కొనసాగుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెట్‌జన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఎవరో తెలియకుండా మంత్రి ఎలా అయ్యారంటూ మండిపడుతున్నారు. అయితే ఆ ఫేస్బుక్ అకౌంట్ సదరు మంత్రిగారిదో లేక నకిలీదో తెలియాల్సిఉంది. -
మంత్రులపై ఐటీ పంజా
► బెదిరించారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ► ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్,రాధిక దంపతులు ► మంత్రి విజయభాస్కర్‌కు పదవీగండం? ఐటీ సాలెగూడులో చిక్కుకున్న మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురు మంత్రులు బైటకు వచ్చేదారిని వెతుకుతుండగా మరో ఇద్దరు మంత్రులపై ఐటీ పంజా విసిరింది. ఐటీ దాడుల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరంలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దాడులు జరుగుతున్న సమయంలో బందోబస్తులో ఉన్న సాయుధ పోలీసులు అడ్డుకుంటున్నా మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరం దౌర్జన్యంగా విజయభాస్కర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేగాక తనిఖీలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని వారు బెదిరించి విధులను అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ ముగ్గురిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్, రాధిక: సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్కుసన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్ష్మి బుధవారం చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్‌ను ఈ నెల 6వ తేదీన శరత్‌కుమార్ కలిసి మద్దతు ప్రకటించగా, ఆ మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఓటర్లకు పంపిణీ చేయాల్సిన నగదులో రూ.10 లక్షలు శరత్‌కుమార్ ఇంట్లో దొరికినట్లు తెలిసింది. ఆయన సతీమణి రాధికకు చెందిన కార్యాలయంలో సైతం కొన్ని ఆధారాలు దొరకవచ్చని రాడాన్ కార్యాలయంలో దాడులు జరిపారు. ఈనెల 11వ తేదీన శరత్‌కుమార్ ఇంట్లో రెండోసారి, నటి రాధికు చెందిన రాడాన్ టీవీ సీరియల్ సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. వీరద్దరిని వేర్వేరుగా విచారించారు. అలాగే, మంత్రి విజయభాస్కర్‌కు సన్నిహితురాలైన గీతాలక్ష్మి ఇంట్లో ఈనెల 7,8 తేదీల్లో తనిఖీలు నిర్వహించి ఐటీ సమన్లు జారీచేయగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఐటీ ఆదేశాలు పాటించాలని కోర్టు అక్షింతలు వేయడంతో గీతాలక్ష్మి సైతం బుధవారం ఉదయం హాజరయ్యారు. స్వపక్షంలోనే విపక్షం: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీలో పాత్రధారి దినకరన్కాగా సూత్రధారిగా వ్యవహరించిన మంత్రి విజయభాస్కర్ ఐటీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన స్వపక్షీయులే విపక్షీయులుగా మారిపోయారు. ఐటీ దాడుల్లో మొత్తం రూ.89 కోట్ల పంపిణీకి మంత్రి బాధ్యుడిగా భావిస్తున్నారు. అంతేగాక ఆయన ఇంటి నుంచి రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన క్వారీల్లో మంగళవారం నాడు 13 గంటలపాటు తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ ఒక దోషిగా నిలబడ్డారు. ఈ అవినీతి భాగోతంలో పలువురు మంత్రులకు భాగస్వామ్యం ఉన్నా ఐటీ దృష్టిలో విజయభాస్కర్ మాత్రమే నిందితుడుగా తేలాడు. దీన్ని అవమానంగా భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు మంత్రిపై కారాలు మిరియాలు నూరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రతిష్టను దిగజార్చిన మంత్రి విజయభాస్కర్‌ను కేబినెట్ నుంచి తప్పించాలంటూ కొందరు నేతలు సీఎం ఎడపాడిపై ఒత్తిడి చేశారు. ఐటీ అధికారులు విజయభాస్కర్‌ను మరోసారి విచారించనున్న దృష్ట్యా వెంటనే పదవి నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి విజయభాస్కర్‌పై సీబీఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుందర్ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్ని తనపై దుమ్మెత్తిపోస్తుండగా సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదులు చేయడంతో మంత్రి విజయభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. మంత్రికి పదవీగండం తప్పదని ప్రచారం జరుగుతోంది. -
స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు
న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను సభ సభ్యులు సర్ ప్రైజ్ చేశారు. బుధవారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని సభ సభ్యులందరూ 'హ్యాపీ బర్త్ డే' సాంగ్ ను ఆలపించారు. వారి బర్త్ డే సాంగ్ మురిసిపోయిన సుమిత్రా మహాజన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఒక్క సారిగా పైకి లేచి, హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడారు. ఆయురారోగ్యాలతో, సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటూ వారు ప్రార్థన నిర్వహించారు. వారి ప్రార్థనలకు ఆమె ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలయ్యారు. నేడు ఆమె 73 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సభ మొత్తం తరుఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలను తెలిపారు.''సభ్యులందరి తరుఫున మీరు సుదీర్ఘ కాలం పాటు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ వారి శుభాకాంక్షలకు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. సభ నిర్వహించేటప్పుడు తను వ్యవహరించే తీరును, మందలింపు చర్యలను ఎవరూ సీరియస్ తీసుకోరని ఆశిస్తున్నట్టు సుమిత్రా పేర్కొన్నారు. -
‘ఏం జరుగుతుందసలు? ఇదేమన్న స్కూలా?’
న్యూఢిల్లీ: ఎప్పుడు శాంతంగా కనిపించే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు చిరాకొచ్చింది. సభలో సభ్యుల తీరుపట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇదేమన్న స్కూల్(పాఠశాల) అనుకుంటున్నారా అని కాస్తంత గట్టి స్వరంతో ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ్యులు అరుపులు, గోలతో రచ్చరచ్చగా మారింది. దాంతో సభలో ప్రశాంత వాతావరణంకోసం పలుమార్లు సభ్యులను బ్రతిమిలాడి చూసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘అసలు ఏం జరుగుతుంది? అల్లరి చేయడానికి ఇదేమన్న స్కూల్ అనుకుంటున్నారా?’ అని సభ్యులను గట్టిగా ప్రశ్నించారు. వాస్తవానికి సభ ప్రారంభమైన తర్వాత గంటపాటు ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా సాగాయి. ఆ సమయంలో సభలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. ప్రశ్నోత్తరాలు అయిపోగానే మోదీ వెళ్లిపోయారు. ఆ వెంటనే సభలో లొల్లి మొదలైంది. దీంతో సభ నడపడం కష్టంగా మారడంతో ఆమె అలా అన్నారు. -
రాష్ట్రపతి రేసులో సుష్మ, జోషి?
-
రాష్ట్రపతి రేసులో సుష్మ, జోషి?
- సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది పేర్లు కూడా పరిశీలనలో - అద్వానీకి అందని ద్రాక్షే.. ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టత న్యూఢిల్లీ: ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి... ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పదవికి సంబంధించి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి కాగా మరొకరు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. మహిళా అభ్యర్థులకు సంబంధించి మరికొంతమంది పేర్లుకూడా వినవస్తున్నాయి. వారిలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మర్ములు కూడా ఉన్నారు. జూలైలో ఖాళీ అయ్యే ఈ పదవి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకనాడు గట్టి మద్దతుదారుడిగా నిలబడిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పేరు మాత్రం పరిశీలనలో కూడా లేదు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రమే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదేళ్ల వయసులో ఉండగా అంటే 1944లో మనోహర్ జోషి ఆర్ఎస్ఎస్లో అడుగుపెట్టారు. 1991లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996, 1998, 1999లలో ఏర్పడిన ప్రభుత్వాల్లో ఆయన పనిచేశారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ఆయన ఏక్తా యాత్రను నిర్వహించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ చేరుకున్న అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయోధ్య ఉద్యమం సమయంలో జోషి...కీలకపాత్ర పోషించారు. 1992, డిసెంబర్లో బాబ్రీ మసీదు ధ్వంసం కాగా ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 1975, జూన్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి అనేకమందిని కారాగారం పాలుచేశారు. అందులో జోషి కూడా ఉన్నారు. ఆయన 19 నెలలపాటు శిక్ష అనుభవించారు. ఇదిలాఉంచితే ఈ పదవి రేసులో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ కేబినెట్లో మంచి మంత్రిగా పేరు తెచ్చుకోవడమే ఇందుకు కారణం. దీంతో మహిళా వ్యతిరేకి అనే భావన ఆర్ఎస్ఎస్ కేడర్‌లో ఉన్నా మంచి మంత్రి అనే పేరు రావడం ఆమెకు సానుకూల వాతావరణం నెలకొనేందుకు దోహదం చేసింది. సొంత పార్టీతోపాటు ఇతర పార్టీ నాయకులతో ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఇది ఆమెను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు ఓ వరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది ఆమెకు ఓ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే ఈ కారణంగానే ఆమెకు ఈ పదవి లభించొచ్చనేది కొంతమంది వాదన. -
'33శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే'
విజయవాడ: మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఘాటుగా స్పందించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని అందరూ అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబుకు ఒక్కటే విషయం స్పష్టంగా చెప్తున్నానంటూ.. ఎవరో ఇస్తే తీసుకునేది రిజర్వేషన్ కాదన్నారు. మహిళా రిజర్వేషన్ దేశానికి అవసరమని చెప్పారు. మహిళల జనాభా దేశంలో సగమే కావొచ్చు కానీ ప్రతి కుటుంబాన్ని నడిపిస్తుంది మాత్రం మహిళలేనని అన్నారు. మహిళా రిజర్వేషన్ అనగానే పార్లమెంటులో కొంతమంది పేపర్లు చించుతూ నినాదాలు ఇస్తున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ పట్ల మాత్రమే ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించగలుగుతామని అన్నారు. -
'33శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే'
-
హోదాపై నా ప్రైవేటు బిల్లు వచ్చేలా చూడండి
స్పీకర్‌కు వైవీ సుబ్బారెడ్డి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తన ప్రైవేటు మెంబరు బిల్లు ఈ సెషన్లోనే వచ్చేలా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఒక లేఖ అందజేశారు. ‘చాలా బాధ, అసంతృప్తితో నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2016 శీర్షికతో ఉన్న నా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు గతేడాది జూలై నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈ బిల్లు గత ఏడాది జూలై 27, నవంబర్ 18, డిసెంబర్ 16, ఈ ఏడాది ఫిబ్రవరి 3 తేదీల్లో లోక్‌సభ బిజినెస్ జాబితాలో చోటు చేసుకున్న ప్పటికీ.. ప్రతీ సందర్భంలో అటు కాంగ్రెస్ గానీ, ఇటు అధికార పక్షం గానీ గందరగోళం సృష్టిస్తుండడం తో సభ వాయిదా పడుతూ వచ్చింది. నా బిల్లు లిస్టయిన సందర్భం లోనే ఇలా జరుగుతూ వచ్చింది. ఇందులో ఏదో మతలబు ఉందని నాకు అర్థమైంది. ఈ నేపథ్యంలో మీరు మీ అధికారాన్ని ఉపయోగించి ఈ సమావేశాల్లోనే ప్రైవేటు మెంబర్ బిజినెస్ లేని రోజైనా సరే ఈ బిల్లును నేను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వగలరు. అంతేకాకుండా 64వ నిబంధన ద్వారా ఈ బిల్లును గెజిట్‌లో ప్రచురించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. -
నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్
► తిరుపతి ఎస్వీయూలో ప్రారంభించనున్న ప్రధాని ►నోబెల్ పురస్కార గ్రహీతలతో భేటీ ► ఐదురోజుల పాటు సదస్సులు ► ఆకట్టుకుంటున్న ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మక భారతీయ విజ్ఞాన సమ్మేళ నం (సైన్స్ కాంగ్రెస్)కు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యం ప్రాంగణంలో జరిగే ఈ 104వ సమ్మేళనాన్ని నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు. ఎస్వీయూలో సైంటిస్ట్‌ల సందడి.. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎటుచూసినా శాస్త్రవేత్తలతో కళకళలాడుతోంది. నోబెల్ పురస్కార గ్రహీతలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, యంగ్ అచీవర్ అవార్డు విజేతలు, ప్రతిభా అవార్డులను గెల్చుకున్న విద్యార్థులు వర్సిటీ ప్రాంగణంలో సందడి చేస్తున్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, పరిశోధనా రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులతో ఎస్వీయూ క్యాంపస్ కొత్త రూపును సంతరించుకుంది. ఎస్వీయూ క్యాంపస్‌లో ఫ్రైడ్ ఆఫ్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, సందర్శకులను ఆకట్టుకుంటోంది. డీఆర్డీవో, ఐఎస్ఎస్ఆర్, ఇస్రో, షార్లతో పాటు హెచ్ఏఎల్, బీడీఎల్, వంటి భారత ప్రభుత్వ రంగ సంస్థల తయారీ ఎగ్జిబిట్లు తరలి వచ్చాయి. వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్, డెయిరీ రంగాల్లో సాధించిన పురోగతిని తెలియజేసే టెక్నాలజీని కూడా అందుబాటులో ఉంచారు. ఢిల్లీ నుంచే నిఘా దేశ విదేశీ ప్రముఖులు హాజరవుతున్న విజ్ఞాన సమ్మేళనానికి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఇంటిలిజెన్ప్ బ్యూరో (ఐబీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతి పట్టణాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ జూమ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఢిల్లీలోని ఐబీ కార్యాలయానికి అనుసంధానం చేశామని, ఒక్కో కెమెరా రెండు కిలోమీటర్ల పరిధిని గమనిస్తుందని అధికారులు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల ఆధార్, ఇతర ఫోటో గుర్తింపు కార్డులను నిఘా విభాగం సాఫ్ట్‌వేర్‌కు లింక్ చేశారు. దాదాపు 6,500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల సూచనలను పాటిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. డీఐజీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, ఇద్దరు ఐపీఎస్‌లు, 30 మంది డీఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక తిరుపతిలోని స్టార్హోటళ్లన్నీసైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు, సందర్శకులతో కిటకిటలా డుతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానమే ప్రధానం స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింత మెరుగు పర్చుకునే దృఢ సంకల్పంతో భారత్ ముందడుగు వేస్తోంది. దీనికోసం ఇండి యన్ న్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కృషిచేస్తోంది. 1914లో కల కత్తా కేంద్రంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారం భమైంది. ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరిశోధనా రంగాల్లో సాధించిన పురోగతిని పరస్ప రం సమీక్షించుకునేలా ఏర్పాట్లు చేసింది. 2013లో శత వసంతాల వేడుకను కోల్ కతాలోనే నిర్వహించారు. గత సమ్మేళ నాన్ని మైసూర్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రత్యేకతలివీ... ♦ ఈసారి సదస్సుకు 12,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ♦ మొత్తం 32 ప్లీనరీలు, సబ్ సెక్షన్స్ ♦ 1,100 మంది వలంటీర్లు సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ♦ ఈఏడాది శిశు, మహిళా కాంగ్రెస్ సదస్సులనూ నిర్వహిస్తున్నారు. ♦ ఏడెకరాల్లో భారీ సైన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ♦ ప్రతినిధులందరికీ టూరిజం శాఖ పర్యాటక ప్రదేశాలను చూపిస్తుంది. ♦ సైన్స్ టెక్నాలజీ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించనున్నారు. హాజరవుతున్న నోబెల్ గ్రహీతలు... 1. ప్రొ.విలియం ఈమోర్నర్(యూఎస్ఏ) 2. ప్రొ.టకాకి కజిత (జపాన్) 3. ప్రొ.సెర్జ్ హరోచి (ఫ్రాన్స్) 4. ప్రొ.జీన్ టిరోలి (ఫ్రాన్స్ ) 5. ప్రొ.అడా ఇ యెనాత్ (ఇజ్రాయెల్) 6. ప్రొ.మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్) -
చర్చ లేకుండానే ముగింపు
తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ► నోట్ల రద్దుపై చివరి రోజు వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ ► 21 రోజుల్లో 19గంటలు సాగిన లోక్‌సభ, 22గంటలు సాగిన రాజ్యసభ న్యూఢిల్లీ: తాము చెప్పినట్లు వినాలంటూ విపక్షాలు, తమకు నచ్చినట్లే జరగాలంటూ అధికార పక్షం పట్టుదలతో నెలరోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై తలెత్తిన ఇక్కట్లపై చర్చించాల్సిన అధికార, విపక్షాలు ఉభయసభల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు సభా సమయాన్ని పణంగా పెట్టాయి. దీంతో చివరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉభయసభల్ని నిరవధికంగా వాయిదావేశారు. నవంబర్ 16న సమావేశాలు మొదలుకాగా తొలి రోజు నుంచి సభల్లో వాయిదాలు కొనసాగాయి. నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో గందరగోళం కొనసాగింది. అంతరాయం వల్ల లోక్‌సభలో 92 గంటల సభా సమయం వృథా అయ్యింది. మొత్తం 21 రోజుల పాటు లోక్‌సభ సమావేశం కాగా... కేవలం 19 గంటలే నడిచింది. రాజ్యసభలో 86 గంటల సమయం వృథా కాగా., సభ 22 గంటలే పనిచేసింది. వాయిదాల వల్ల రాజ్యసభ జాబితాలోని 330 ప్రశ్నలకు గాను కేవలం రెండింటికి, లోక్‌సభలో మొత్తం 440 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలిచ్చారు. లోక్‌సభలో నోట్ల రద్దుపై 193 నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను మొదలుపెట్టినా... విపక్షాల ఆందోళనలతో అది కొనసాగలేదు. సభా కార్యకలాపాలన్ని రద్దు చేసి నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానాలు చేపట్టాలంటూ మొదటి రోజు నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ స్పీకర్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభలో సమావేశాల మొదటి రోజే నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. ప్రధాని సభలోనే ఉండాలన్న విపక్ష డిమాండ్‌తో సభ పదేపదే వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ సమావేశం కాగానే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి తాము నోట్ల రద్దు చర్చకు సిద్ధమని గురువారమే చెప్పామని, అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమపై అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు. దివ్యాంగుల హక్కుల బిల్లుకు ఆమోదం తాజా సమావేశాల్లో సభలు ఒక్క బిల్లునే ఆమోదించాయి. దివ్యాంగులపై వివక్షకు కఠిన శిక్షలకు ఉద్దేశించిన హక్కుల బిల్లును సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన దీనికి లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమోద సమయంలో ప్రధాని సభలో ఉన్నారు. ఖర్చు రూ.267 కోట్లు షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు 21 రోజుల పాటు సమావేశం కావాలి. కానీ, ఇందులో లోక్‌సభలో కేవలం 19 గంటలపాటు, రాజ్యసభలో 22.25 గంటలే సభాకార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా పార్లమెంటు నడిచేందుకు ఒక్కోసభలో నిమిషానికి రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది (చాలాకాలంగా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు). ఈ లెక్కన ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోవటంతో ఖజానాకు రూ. 267 కోట్లు నష్టం వాటిల్లింది. -
ప్రత్యేకహోదాపై వాయిదా తీర్మానానికి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించిన రోజున రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం ఇప్పటివరకు హోదా ప్రకటించలేదని, ఈ అంశంపై చర్చకు వీలుగా సభా కార్యక్రమాలను వాయిదావేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ అంశం ముఖ్యమైనదైనా సభాకార్యకలాపాలను వాయిదా వేయాల్సిన పనిలేదని, సరైన ఇతర నిబంధనల కింద చర్చించుకోవచ్చని పేర్కొంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నోటీసులను తిరస్కరించారు. -
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
-
మహాజన్‌కు ద.కొరియా వర్సిటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు దక్షిణ కొరియాలోని హాంకూక్ విదేశీ వ్యవహారాల విశ్వవిద్యాలయం(హెచ్‌యూఎఫ్‌ఎస్) గౌరవ డాక్టరేటును శనివారం ప్రదానం చేసింది. పార్లమెంటేరియన్ల పనిని ప్రజలు అరుదుగా గుర్తిస్తారని, ఈ గౌరవం ప్రత్యేకమైందని మహాజన్ ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని చట్టాలకున్న ఉమ్మడితత్వానికి ఈ డాక్టరేటు చిహ్నంగా నిలుస్తుందని స్పీకర్‌ను ఉటంకిస్తూ లోక్‌సభ ప్రకటన జారీ చేసింది. ఈ వర్సిటీ అంతర్జాతీయ అవగాహన పెంపుకు ఎంతో కృషి చేస్తోందని సుమిత్రాప్రశంసించారు.