సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ఎనిమిది సార్లు వరుసగా గెలుపొందిన ఆమె ఈసారి పోటీ చేయడం లేదని శుక్రవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన బీజేపీ.. ఇండోర్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ మహాజన్‌కు టికెట్ ఇస్తారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ తానే పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికైనా అధిష్టానం త్వరగా ఇండోర్ అభ్యర్థిని నిర్ణయించాలని ఆమె సూచించారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత విజయ్‌వార్గియా పేరు బీజేపీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న సుమిత్ర మహాజన్ 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. రాజకీయాల్లో 75 సంవత్సరాల తర్వాత గెలుపు అవకాశాలు తగ్గుతాయన్న కారణంతోనే సుమిత్రను బీజేపీ పక్కన పెట్టిందని విశ‍్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పోటీ చేయనంటున్న సుమిత్ర మహాజన్
Published Fri, Apr 5 2019 5:17 PM | Last Updated on Fri, Apr 5 2019 5:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment