ఫిరాయింపులపై అఖిల పక్ష భేటీలో చర్చ: మేకపాటి | LS Speaker Calls For An All Party Meeting Ahead Of Stormy Parliament Session | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై అఖిల పక్ష భేటీలో చర్చ: మేకపాటి

Published Sun, Apr 24 2016 11:26 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

ఫిరాయింపులపై అఖిల పక్ష భేటీలో చర్చ: మేకపాటి - Sakshi

ఫిరాయింపులపై అఖిల పక్ష భేటీలో చర్చ: మేకపాటి

న్యూఢిల్లీ : పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం ఆదివారం ఉదయం 11.30కి ప్రారంభం కానుంది. లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ లోక్సభ పక్షనేత మేకపాటి రాజమోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశాన్ని మేకపాటి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే... చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్న వైనాన్ని ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో మేకపాటి వివరించనున్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై గడువులోపల.. అనర్హత వేటు వేసేలా సవరణ చేయాలని మేకపాటి ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వాన్ని కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement