మహాజన్‌కు ద.కొరియా వర్సిటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు దక్షిణ కొరియాలోని హాంకూక్ విదేశీ వ్యవహారాల విశ్వవిద్యాలయం(హెచ్‌యూఎఫ్‌ఎస్) గౌరవ డాక్టరేటును శనివారం ప్రదానం చేసింది. పార్లమెంటేరియన్ల పనిని ప్రజలు అరుదుగా గుర్తిస్తారని, ఈ గౌరవం ప్రత్యేకమైందని మహాజన్ ఈ సందర్భంగా అన్నారు.
ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని చట్టాలకున్న ఉమ్మడితత్వానికి ఈ డాక్టరేటు చిహ్నంగా నిలుస్తుందని స్పీకర్‌ను ఉటంకిస్తూ లోక్‌సభ ప్రకటన జారీ చేసింది. ఈ వర్సిటీ అంతర్జాతీయ అవగాహన పెంపుకు ఎంతో కృషి చేస్తోందని సుమిత్రాప్రశంసించారు.