తల్లి భాగ్యలక్ష్మితో నైనా జైస్వాల్
Table Tennis Player Naina Jaiswal: దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ 22 ఏళ్ల వయస్సులోనే పీహెచ్‌డీలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతానికి చెందిన నైనా జైస్వాల్.. ఏపీలోని రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను రిసెర్చ్ గైడ్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఎం. ముత్యాల నాయుడు అభినందించారు. కాగా టీటీ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు అందుకున్న నైనా.. చదువులోనూ తనకు తానే సాటి.
ఎనిమిదేళ్లకే పదో తరగతి కంప్లీట్ చేసిన నైనా.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. ఈ క్రమంలో ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. మోటివేషనల్ స్పీకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నైనా.. తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు.
చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment