న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఏట్టకేలకు మార్గం సుగమమైందనే చెప్పవచ్చు. గతేడాది పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహాం ఏర్పాటు చేయాలని టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ విషయంపై టీడీపీ మంత్రులు మరోసారి స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. మంత్రులు అందించిన లేఖను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అల్లూరి విగ్రహా ఏర్పాటును స్పీకర్ విగ్రహాల ఏర్పాటు కమిటీకి రెఫర్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఎంపీలకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి విగ్రహాం ఇవ్వాలని స్పీకర్ అన్నారు. దీనిపై చర్చించి నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక ఉన్నతమైన శక్తి. సాయుథ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మిన వ్యక్తి అల్లూరి.
Comments
Please login to add a commentAdd a comment